కంచి రామకృష్ణ దర్శకత్వంతో అట సందీప్, షాజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ది షార్ట్ కట్’.విజయానికి అడ్డదారులు ఉండవు అనేది ఉప శీర్షిక. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది.కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుకొని ఎట్టకేలను నేడు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
ప్రకాశ్(ఆట సందీప్)కి సినిమా డైరెక్టర్ కావాలని కోరిక. ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీలోకి వస్తాడు. సినిమా డైరెక్టర్ గా ఎదగాలి అన్న కోరికతో ఇండస్ట్రీలోని ప్రొడ్యూసర్లను కలిసి కథలు చెబుతూ ఉంటాడు. ఒక్కరు కూడా తనకు సినిమా చాన్స్ ఇవ్వరు. మరోవైపు తన ప్రియురాలు దివ్య(షాజ్ఞ శ్రీ) మాత్రం సినిమా, డైరెక్షన్ వర్కౌట్ ఇప్పట్లో వర్కౌట్ కాదని, ఉద్యోగం చేయమని ఒత్తిడి చేస్తుంది.
ప్రకాశ్ మాత్రం తన ఫోకస్ అంతా డెరెక్షన్‌పైనే పెడతాడు. ఎలాగైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి డ్రగ్స్ ఉన్న బ్యాగ్ దొరుకుతుంది. ఆ డ్రగ్స్‌ని, అమ్మి వచ్చిన డబ్బుతో సినిమా చేయాలనుకుంటాడు. కానీ అనుకోకుండా డ్రగ్స్ మాఫీయా డాన్ చేతికి దొరుకుతాడు. ఆ తర్వాత ప్రకాశ్ జీవితంలో ఎలాంటి మార్పు చోటు చేసుకున్నాయి? డైరెక్టర్ కావాలనే కోరిక నెరవేరిందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
డ్రగ్స్ మాఫియా చుట్టూ తిరిగే డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కి అలవాటు పడి తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ డ్రగ్స్ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపై చూపించడంలో కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. కథా ప్రారంభం బాగుంటుంది. అయితే హీరో పాత్ర మొదలు చాలా సీన్లు కూడా గత సినిమాలను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్‌లో కథ మొత్తం డ్రగ్స్ మాఫియా చుట్టే తిరుగుతుంది. సెకండాఫ్‌లో అక్కడక్కడ లాగ్ అనిపిస్తుంది. కొన్ని అనవసర సన్నివేశాలను జోడించి, కథను సాగదీసినట్లు అనిపిస్తుంది. కమర్షియల్‌గా ఈ సినిమా ఏ మేరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశం అయితే ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే...
ఆట సందీప్ అంటే ఇప్పటివరకు అందరికి డ్యాన్సర్‌గానే పరిచయం. ఆయనలో మంచి నటుడు ఉన్నాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. డైరెక్టర్ అయ్యి తన ప్రేమను పొందాలి అనే తపన ఉన్న కుర్రాడిగా చాలా బాగా నటించాడు. షాజ్ఞ శ్రీ నటన క్యారెక్టర్జషన్ బాగున్నాయి. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈటీవీ ప్రభాకర్ గారి నటన అదే విధంగా డ్రగ్స్ మాఫియా కు సంబంధించి లోకల్ డాన్ క్యారెక్టర్ లో రాకేష్ మాస్టర్ నటన ప్రేక్షకులను అలరిస్తాయి. టెస్టర్ క్యారెక్టర్ లో బల్వీర్ సింగ్ సపోర్టింగ్ రోల్ లో చాలా బాగా నటించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. ఆర్ఆర్ ద్రువన్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. ఎస్ ఎన్ మీరా సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment