ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రుల తరువాత మనకు నియర్ అండ్ డియర్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే మన ఫ్రెండ్స్. పిల్లల్లో కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ గురించి అద్భుతంగా ఊహించుకుంటారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ దగ్గర ప్రస్తుతం లేని ఫ్రెండ్స్ గురించి గొప్పగా ఊహించుకుంటారు. అంటే ఆ ఊహలోని ఫ్రెండ్స్ కి గొప్ప పవర్స్, పవర్ ఫుల్ మేకోవర్ ఉంటాయి. మరి అలాంటి ఊహలు నిజమైతే...అలాంటి థాట్ లోంచి వచ్చిన సినిమానే ఇఫ్ చిత్రం. ఇదో ఫాంటసీ కామెడీ మూవీ. దీనిని జాన్ క్రసింస్కీ తీశారు. ప్రముఖ నటులు రేయాన్ రెనాల్డ్స్ తో పాటు కాలే ఫ్లెమ్మింగ్ తమ పాత్రలకు అద్భుతమైన న్యాయం చేశారు.
ఇఫ్ సినిమా కథేంటంటే...పన్నెండేళ్ళ బీ తన డాడీ ఆపరేషన్ వల్ల గ్రాండ్ మదర్ మార్గరేట్ అపార్ట్ మెంట్ కు వస్తుంది. బీ మమ్మీ చిన్నప్పుడే చనిపోతుంది. ఓ రోజు రాత్రి బీ తనకు బిల్డింగ్ లో ఎవరో రేర్ క్రియేచర్ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ తరువాత రోజు కూడా ఆ క్రియేచర్ ఓ మనిషితో పాటు వెళ్తున్నట్టు మళ్ళీ కనిపిస్తుంది. ఆ మనిషి ఎవరో కాదు తన గ్రాండ్ మదర్ బిల్డింగ్ చివరి పై ఫ్లోర్ లో వున్న కాల్ అని తెలుస్తుంది. కాల్ తో వున్న క్రియేచర్ బ్లూ. కాని ఈ సారి బ్లూ తో పాటు సీతాకోకచిలుక రూపంలో వున్న బ్లాసమ్ ని చూడగానే బీ మూర్ఛపోతుంది.
ఆ తరువాత కొన్ని రోజులకు బీ కాల్ తో కలిసి ఈ క్రియేచర్స్ అన్ని ఉన్న చోటికి వెళ్ళి తన ఇమేజినేషన్ తో వాటన్నిటిని తనకు నచ్చిన విధంగా మార్చి చూసుకుని ముచ్చటపడుతుంది. అసలు బీకి కనిపించిన ఈ క్రియేచర్స్ ఏంటి, తన ఇమేజినేషన్ తో సృష్టించుకున్న క్రియేచర్స్ తో బీ ఇంకెన్ని మాజిక్స్ చేసిందో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఇఫ్ చూస్తే తెలిసిపోతుంది. ఈ సినిమా మొత్తంలో గ్రాఫిక్స్ చాలా బావుంటాయి. మనకు కనిపించే క్రియేచర్స్ ని చాలా బాగా చూపించారు. ఇట్స్ ఎ వర్త్ మూవీ ఫర్ కిడ్స్.
- ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment