‘దేవర’ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్ ఫ్రీ అవుతారు. సో... ఇక తదుపరి చిత్రం షూటింగ్‌తో బిజీ అవుతారనుకోవచ్చు. అయితే ఓ మూడు నెలల తర్వాతే నెక్ట్స్ మూవీ షూట్‌లో పాల్గొంటారట ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 21న ఆరంభమవుతుంది.
(చదవండి: శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు)
అయితే అప్పుడు ఎన్టీఆర్ పాల్గొనరట. ఈ హీరో లేని సన్నివేశాల చిత్రీకరణ మొదలుపెడతారు. 21 నుంచి దాదాపు 40 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనరు. జనవరిలోనే ఈ చిత్రం సెట్స్‌లోకి ఎంట్రీ ఇస్తారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు ఎన్టీఆర్. ఈ మూడు నెలల సమయాన్ని ఫ్యామిలీకి కేటాయిస్తారట. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
టైటిల్ ఇదేనా?
సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ ఫుల్ ఫోకస్ ఎన్టీఆర్ సినిమాపైనే పెట్టేశాడు. కేజీయఫ్, సలార్ మాదిరే ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా రాబోతున్నట్లు సమాచారం. ఒక వేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండగే. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీయఫ్ రెండు భాగాలుగా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. అలాగే సలార్ పార్ట్ 2 కూడా రాబోతుంది. ఈ రెండు చిత్రాల మాదిరే ఎన్టీఆర్ మూవీ కూడా కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ అనుకుంటున్నారట.
Comments
Please login to add a commentAdd a comment