OTT: యానిమేటెడ్‌ సిరీస్‌ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ | Despicable Me 4 Web Series Review In Telugu | Sakshi
Sakshi News home page

OTT: యానిమేటెడ్‌ సిరీస్‌ ‘డిస్పెకబుల్ మి 4’ రివ్యూ

Published Sat, Nov 9 2024 10:55 AM | Last Updated on Sat, Nov 9 2024 12:10 PM

Despicable Me 4 Web Series Review In Telugu

మామూలు మూవీస్ లో సూపర్ కారెక్టర్స్ చెయ్యాలంటే చాలా ఖర్చు, కష్టం తో కూడుకున్న పని. కాని అదే యానిమేటడ్ కారెక్టర్స్ అయితే అంత ఖర్చు, కష్టం రెండూ ఉండవు. అంతేనా ఇప్పటి జెనరేషన్ కి బాగా నచ్చుతుంది కూడా. అందుకేనేమో రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కి డిమాండ్ & మార్కెట్ రెండూ ఎక్కువే. కాబట్టే ఒక్కో కారెక్టర్ సీరిస్ రూపేణా బోలెడన్ని పార్ట్స్ లో వస్తున్నాయి. అదే రేంజ్ లో ఇటీవల రిలీజ్ అయిన సినిమా డిస్పెకబుల్ మి 4. జియో సినిమా ఓటిటి వేదికగా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ లభ్యమవుతోంది. డిస్పెకబుల్  సీరిస్ లో ఇది 5వ సినిమా. క్రిస్ రేనాడ్ దర్శకత్వం వహించిన సినిమా అనుకున్నట్టుగానే సూపర్ రివ్యూస్ తో దూసుకుపోతోంది. 

ఈ సిరీస్ ఫాలో అవుతున్నవాళ్ళకి దీనిలో కారెక్టర్స్ తో పాటు కథ కూడా సులువుగా అర్ధమవుతుంది. దీనిలో మెయిన్ కారెక్టర్ గ్రూ. ఇక గ్రూతో పాటు ఫిల్, రోన్ మరియు రఫ్ అనే మీనియన్స్. ఈ డిస్పెకబుల్ మి 4 కథాంశానికొస్తే గ్రూ కి ఒక కొత్త ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. కాని ఆ బాబు వాళ్ళ అమ్మ దగ్గర బానే వుంటాడు కాని గ్రూకి మాత్రం విసుగు పుట్టిస్తుంటాడు. కాని గ్రూ కి ఆ బాబంటే ఎంతో ఇష్టం. మరో పక్క తన ఎనిమీ అయిన మాక్స్ మీ లీమాల్ జైలు నుండి తప్పించుకుని గ్రూ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన గ్రూ ఫ్యామిలీ సేఫ్ హౌస్ కి వెళుతుంది. ఇక అక్కడ నుండి గ్రూ మాక్స్ మీ లీమాల్ ను ఎలా ఎదుర్కుంటుందన్నదే మిగతా సినిమా. 

పైన చెప్పుకున్నట్టు రియల్ కారెక్టర్స్ కన్నా యానిమేటడ్ కారెక్టర్స్ కథను మరో లెవల్ కు తీసుకువెళతాయి. ముఖ్యంగా ఈ సినిమాలో మీనియన్స్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. సినిమా బ్యానర్ నేమ్ నుండే ఆ అల్లరి ప్రారంభమవుతుంది. గ్రూ చేసే సాహస విన్యాసాలు, మాక్సిమల్ క్రియేట్ చేసిన ఎక్సట్రార్డినరీ వెహికల్ సూపర్ గా ఉంటాయి. పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఈ వీకెండ్ కు మస్ట్ వాచ్ బుల్ మూవీ డిస్పెకబుల్ మి 4. జీయో సినిమా వేదికగా ఉంది చూసేయండి.
 - ఇంటూరు హరికృష్ణ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement