హాలీవుడ్ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతారు. అందులోనూ మార్వెల్ యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజ్‌లో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్స్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్, కెప్టన్ మార్వెల్,ది అవెంజర్స్,బ్లాక్ పాంథర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.
ఈ క్రమంలో నవంబర్ 10 2023న విడుదలైన 'ది మార్వెల్స్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందేబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.
ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను రూ.2250 కోట్లతో నిర్మించారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్‌గా 'ది మార్వెల్స్'ఈ సినిమా వచ్చింది. ఇందులో బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో లీడ్ చేస్తే.. ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్‌లు లేడి సూపర్ హీరోలుగా చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
మార్వెల్‌కు చెందిన ఈ ముగ్గురు సూపర్ హీరోయిన్స్ విశ్వ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్రీ అనే గ్రహం అంతరించిపోతున్న సమయంలో ఆ గ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని విలన్ పాత్రలో ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) పోరాడుతుంటాడు. ఇతర గ్రహాల్లో ఉన్న వనరులను తన గ్రహానికి తెచ్చుకునే పనిలే ఉంటాడు. అందుకోసం ఒక క్వాంటమ్ బ్యాండ్ సాయంతో ఈ పనిచేస్తుంటాడు. ఇలాంటి సమయంలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వచ్చే మాగ్నెటిక్ పవర్ వల్ల అనేక శక్తులతో కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్ (ఇమాన్ వెల్లని) ఎంట్రీ ఇస్తారు. ఈ ముగ్గురిని టీం అప్ చేసే ‘నిక్‌ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ కనిపిస్తారు. తన శక్తులను లాక్కున్న క్రీ గ్రహం నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఇందులో కెప్టన్ మార్వెల్‌కి వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి ఉంటుంది. వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్ మార్వెల్‌కి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.ఈ ముగ్గురు కలిసి ‘ది మార్వెల్స్’గా మారడం.. ఆపై విశ్వాన్ని నాశనం చేస్తున్న ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్)పై ఎలాంటి యుద్ధం చేస్తారనేది ఈ కథ.
ఎలా ఉందంటే
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకోసం రూ. 2250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు లేడి సూపర్ హీరోల భారీ యాక్షన్ సీన్స్ మెప్పించినప్పటికీ కథలో కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కథలు రావడంతో అంతగా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్‌తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్‌ను పవర్ ఫుల్ విలన్‌గా మొదట్లో చూపించిన దర్శకులు.. క్లైమాక్స్ వచ్చేసరికి అంతలా మెప్పించలేకపోయారు.
ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని ది మార్వెల్స్‌లో చూపించారు. అది బాగానే ఉన్నప్పటికీ వార సంస్కృతిని చూపించిన విధానం అంతగా మెప్పించదు. ఇందులో ప్రదానంగా కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్‌గా ఇమాన్ వెల్లని తన నటనతో దుమ్మురేపింది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మార్వెల్స్ చిత్రాలను ఇష్టపడే వారందరినీ 'ది మార్వెల్స్' తప్పకుండా మెప్పిస్తుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment