4రోజుల్లో రూ.50 కోట్లు రాబట్టిన సరైనోడు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'సరైనోడు' సూపర్ ఫీట్ను తన ఖాతాలో వేసుకుంది. నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ను షేక్ చేసింది. సినిమాపై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది వసూళ్లపై ప్రభావం చూపలేదు. బన్నీ పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్న 'సరైనోడు' కలెక్షన్లతో బన్నీ రికార్డు సృష్టిస్తున్నాడు.
బన్ని నటించిన రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాలు రూ.50 కోట్ల మార్కును దాటేశాయి. అయితే ఈ సారి బన్ని సినిమా నాలుగు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్లు రాబట్టడం టాలీవుడ్లో విశేషం. కాగా తమిళంలో హీరోగా మంచి గుర్తింపు ఉన్న ఆది పినిశెట్టి తొలిసారి తెలుగులో విలన్గా కనిపించాడు. రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ థెరిసాలు ఈ సినిమాలో హీరోయిన్లుగా మెరిశారు. సోమవారం ఈ చిత్ర సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది.