Infosys:టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ అరుదైన రికార్డు సాధించింది. ఐటీ సేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ మరో రేర్ ఫీట్‌ను సొంతం చేసుకుంది. ఇండియా నుంచి వంద బిలియన్ డాలర్ల విలువైన కంపెనీల సరసన చేరింది.
పెరిగిన షేర్ ధర
ఈ ఏడాది ఆరంభం నుంచి షేర్ మార్కెట్ జోరుమీదుంది. ఫిబ్రవరిలో బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 50 వేల మార్క్‌ని దాటితే ఆగస్టులో 56 వేలు క్రాస్ చేసింది. అయితే ఇందులో ఎక్కువగా లాభపడింది ఐటీ కంపెనీలే. దీంతో గత కొంత కాలంగా ఐటీ కంపెనీల ఆస్తుల విలువ పెరుగుతోంది. మంగళవారం మార్కెట్‌లో ఇన్ఫోసిస్ ఒక షేర్ వాల్యూ ఒక శాతం పెరగింది. దీంతో ఒక షేర్ విలువ రికార్డు స్థాయిలో రూ.1,755.60కి చేరుకుంది.
వంద బిలియన్ల క్లబ్‌లోకి
దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో రెండవదిగా ఇన్ఫోసిస్‌కి గుర్తింపు ఉంది. బ్లూ చిప్ కేటగిరికి చెందిన ఇన్ఫోసిస్ షేర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. తాజగా ఒక షేర్ వాల్యూ రూ.1,755.60కి పెరిగిపోవడంతో కంపెనీ విలువ 100 బిలియన్ డాలర్లను దాటింది. ఇండియన్ కరెన్సీలో ఇన్ఫోసిస్ కంపెనీ విలువ 7.45 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.
నాలుగో కంపెనీ
ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం మూడు వ్యాపార సంస్థల విలువ వంద బిలియన్ డాలర్లను దాటింది. అందులో మొదటి స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్‌డీఎఫ్‌సీలు ఉన్నాయి. వాటి తర్వాత వంద బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన నాలుగో సంస్థగా ఇన్ఫోసిస్ నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment