BASF
-
జత కలిసిన బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్: లక్ష్యం ఇదే..
బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ కంపెనీలు తాజాగా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి ఎంఓయూపై సంతకం చేశారు. ఢిల్లీలో జరిగిన ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024 సమావేశంలో ఈ ఒప్పందం జరిగింది.బీఏఎస్ఎఫ్, ఏఎం గ్రీన్ సంస్థలు భారతదేశంలో తక్కువ కార్బన్ రసాయనాల ఉత్పత్తిపై సాధ్యాసాధ్యాల అధ్యయనాలను నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే.. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏఎమ్ గ్రీన్ ప్లాంట్స్ నుంచి ప్రత్యేకంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ అమ్మోనియాను సంవత్సరానికి 1,00,000 టన్నులు సేకరించనున్నారు.ఈ అమ్మోనియా రెన్యూవబుల్ ఎనర్జీ డైరెక్టివ్‌లో నిర్వచించినట్లుగా నాన్ బయోలాజికల్ ఆరిజన్ పునరుత్పాదక ఇంధనాల కోసం ఈయూ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఏఎమ్ గ్రీన్‌కు సంబంధించిన కొన్ని సౌకర్యాలు ఇప్పటికే దీనికి సంబంధించిన ద్రువీకరణను పొందాయి. మరికొన్ని సౌకర్యాల కోసం ప్రీ-సర్టిఫికేషన్ కూడా జరుగుతోంది.మా సంస్థలు స్థిరమైన పరివర్తనకు కట్టుబడి ఉంటాయి. మా భాగస్వామి ఏఎం గ్రీన్‌తో కలిసి తక్కువ కార్బన్ రసాయన ఉత్పత్తిని అన్వేషించడానికి భారతదేశం సరైన ప్రదేశమని మేము విశ్వసిస్తున్నామని బీఏఎస్ఎఫ్ ఎస్ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ డాక్టర్ మార్కస్ కమీత్ అన్నారు.ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి మాట్లాడుతూ.. పరిశ్రమలో గ్రీన్ ట్రాన్స్ఫర్మేషన్ను ప్రోత్సహించడానికి బీఎస్ఏఎఫ్ వంటి గ్లోబల్ కెమికల్ లీడర్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉందని అన్నారు. ఇది అనుబంధ వినియోగదారు పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. -
బీఏఎస్ఎఫ్ కొత్త ఉత్పాదన!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న బీఏఎస్ఎఫ్ ఎక్స్‌పోనస్ పేరుతో కొత్త ఉత్పాదనను ప్రవేశపెట్టింది. ప్రత్యేక ఫార్ములేషన్ బ్రోఫ్లానిలైడ్తో తయారైన ఈ పురుగు మందు గొంగళి పురుగులు, మిరపలో వచ్చే కఠినమైన చీడపీడలను నియంత్రిస్తుందని కంపెనీ తెలిపింది. సోయాబీన్, కంది, మిరప, టమాట, వంగ, క్యాబేజి లాంటి పంటలకు సమర్థవంతంగా, సుదీర్ఘకాలంపాటు రక్షణ కల్పిస్తుందని వివరించింది. -
బీఏఎస్ఎఫ్- బజాజ్ ఎలక్ట్రికల్స్ జోరు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించడంతో స్పెషాలిటీ కెమికల్స్ రంగ దిగ్గజం బీఏఎస్ఎఫ్ ఇండియా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించడంతో ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ కంపెనీ బజాజ్ ఎలక్ట్రికల్స్ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బీఏఎస్ఎఫ్ ఇండియా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బీఏఎస్ఎఫ్ ఇండియా నికర లాభం రూ. 412 కోట్లను అధిగమించింది. గతేడాది(2019-20) క్యూ2లో కేవలం రూ. 2.3 కోట్ల లాభం ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం రూ. 2067 కోట్ల నుంచి రూ. 2,463 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో కన్ స్ట్రక్షన్ కెమికల్స్ బిజినెస్ విక్రయం ద్వారా రూ. 465 కోట్లకుపైగా లాభం ఆర్జించింది. ఫలితాల నేపథ్యలో ప్రస్తుతం బీఏఎస్ఎఫ్ షేరు 13 శాతం దూసుకెళ్లి రూ. 1,525 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 15 శాతంపైగా ర్యాలీ చేసింది. రూ. 1,557ను అధిగమించింది. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్)లో బజాజ్ ఎలక్ట్రికల్స్ రూ. 53 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2లో రూ. 36.5 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 11 శాతం పెరిగి రూ. 1,218 కోట్లకు చేరింది. రూ. 73 కోట్ల ఇబిటా ఆర్జించింది. గత క్యూ2లో రూ. 29 కోట్ల పన్నుకు ముందు నష్టం నమోదైంది. ఈ నేపథ్యంలో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్ చేసి రూ. 510 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 515 వరకూ ఎగసింది. -
బీఏఎస్ఎఫ్ నుంచి వరి సస్యరక్షణ ఉత్పత్తులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న జర్మనీ దిగ్గజం బీఏఎస్ఎఫ్ భారత మార్కెట్లో వరి సస్యరక్షణ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. వరికి సోకే వ్యాధులు, కలుపు, తెగుళ్ల నుంచి రక్షణ కల్పించడమేగాక అధిక దిగుబడులు ఈ ఉత్పత్తుల ప్రత్యేకత అని కంపెనీ క్రాప్ ప్రొటెక్షన్ విభాగం ప్రెసిడెంట్ మార్కస్ హెడెట్ తెలిపారు. కంపెనీ ప్రతినిధులు రామన్ రామచంద్రన్, రాజేంద్ర వెలగల తదితరులతో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి 130 నూతన ఉత్పాదనలతోపాటు మరో 250 ఇతర ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం బీఏఎస్‌ఎఫ్‌కు భారత వరి సస్యరక్షణ ఉత్పత్తుల మార్కెట్లో 3–4 శాతం వాటా ఉంది. దీనిని 10%కి చేర్చనున్నట్టు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో బీఏఎస్ఎఫ్ ఇప్పటికే రూ.1,000 కోట్లు ఖర్చు చేసింది. ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా వరిని పండిస్తున్న భారత్‌లో రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు కొనసాగించనున్నట్టు తెలిపింది. -
రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు
-
రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు
జర్మనీలోని బీఏఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోగల ఓ రసాయనాల ఫ్యాక్టీరలో పేలుడు సంభవించడంతో ఒక వ్యక్తి మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. మరికొందరు గాయపడ్డారు. స్థానికులు అందరినీ ఇళ్లలోనే ఉండాలని.. బయటకు రావొద్దని ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పైప్‌లైన్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. చాలామందికి గాయాలయ్యాయని, కొందరు గల్లంతయ్యారని బీఏఎస్ఎఫ్ తెలిపింది. రైన్ నది ఒడ్డున ఉన్న ఒక రేవులో భారీ పారిశ్రామిక ప్రాంగణం ఉంది. అక్కడే ప్రమాదం జరగడంతో.. భారీ ఎత్తున మంటలు, పొగలు కమ్ముకున్నాయి. రాత్రి 7 గంటల సమయంలో కూడా ఇంకా అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సమీపంలోని రోడ్లను పోలీసులు మూసేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు అందరూ ఇళ్లలోనే ఉండాలని, తలుపులు.. కిటికీలు మూసేసుకోవాలని అధికారులు ప్రకటించారు. పాఠశాలలు మూసేశారు. ప్రమాదానికి కారణాలేంటో తాము దర్యాప్తు చేస్తున్నామని, సంబంధిత అధికారులకు తెలిపామని బీఏఎస్ఎఫ్ వివరించింది. లడ్విగ్ఫాఫెన్ నగరంలో 1.60 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఇది ఫ్రాంక్ఫర్ట్ నగరానికి నైరుతి దిశలో 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.