రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు | Several missing, injured in German chemical plant blast | Sakshi
Sakshi News home page

రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Published Mon, Oct 17 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

రసాయనాల ఫ్యాక్టరీలో భారీ పేలుడు

జర్మనీలోని బీఏఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయంలోగల ఓ రసాయనాల ఫ్యాక్టీరలో పేలుడు సంభవించడంతో ఒక వ్యక్తి మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. మరికొందరు గాయపడ్డారు. స్థానికులు అందరినీ ఇళ్లలోనే ఉండాలని.. బయటకు రావొద్దని ఈ సందర్భంగా అప్రమత్తం చేశారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పైప్‌లైన్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు ఫ్యాక్టరీ వర్గాలు తెలిపాయి. చాలామందికి గాయాలయ్యాయని, కొందరు గల్లంతయ్యారని బీఏఎస్ఎఫ్ తెలిపింది. రైన్ నది ఒడ్డున ఉన్న ఒక రేవులో భారీ పారిశ్రామిక ప్రాంగణం ఉంది.

అక్కడే ప్రమాదం జరగడంతో.. భారీ ఎత్తున మంటలు, పొగలు కమ్ముకున్నాయి. రాత్రి 7 గంటల సమయంలో కూడా ఇంకా అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సమీపంలోని రోడ్లను పోలీసులు మూసేశారు. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు అందరూ ఇళ్లలోనే ఉండాలని, తలుపులు.. కిటికీలు మూసేసుకోవాలని అధికారులు ప్రకటించారు. పాఠశాలలు మూసేశారు. ప్రమాదానికి కారణాలేంటో తాము దర్యాప్తు చేస్తున్నామని, సంబంధిత అధికారులకు తెలిపామని బీఏఎస్ఎఫ్ వివరించింది. లడ్విగ్ఫాఫెన్ నగరంలో 1.60 లక్షల మంది ప్రజలు ఉంటారు. ఇది ఫ్రాంక్‌ఫర్ట్ నగరానికి నైరుతి దిశలో 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement