న్యూఢిల్లీ: గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఇంధనం, పర్యావరణ సొల్యూషన్ల కంపెనీ థెర్మాక్స్ ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా ఆస్ట్రేలియన్ కంపెనీ ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్(ఎఫ్‌ఎఫ్‌ఐ)తో చేతులు కలిపింది. భాగస్వామ్య ప్రాతిపదికన రెండు సంస్థలూ వాణిజ్య, పారిశ్రామిక కస్టమర్ల కోసం సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నాయి.
ఇందుకు ఎఫ్‌ఎఫ్‌ఐతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు థెర్మాక్స్ పేర్కొంది. తద్వారా దేశీయంగా తయారీ యూనిట్ల ఏర్పాటుసహా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధి అవకాశాలను సంయుక్తంగా అన్వేషించనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా దేశీయంగా రిఫైనరీలు, ఫెర్టిలైజర్లు, స్టీల్ తదితర ప్రధాన రంగాలలో కర్బనాలను తగ్గించేందుకు అవకాశముంటుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment