australian company
-
గ్రీన్ హైడ్రోజన్‌పై థెర్మాక్స్ దృష్టి
న్యూఢిల్లీ: గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఇంధనం, పర్యావరణ సొల్యూషన్ల కంపెనీ థెర్మాక్స్ ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా ఆస్ట్రేలియన్ కంపెనీ ఫోర్టెస్క్యూ ఫ్యూచర్ ఇండస్ట్రీస్(ఎఫ్ఎఫ్ఐ)తో చేతులు కలిపింది. భాగస్వామ్య ప్రాతిపదికన రెండు సంస్థలూ వాణిజ్య, పారిశ్రామిక కస్టమర్ల కోసం సమీకృత గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకు ఎఫ్ఎఫ్ఐతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు థెర్మాక్స్ పేర్కొంది. తద్వారా దేశీయంగా తయారీ యూనిట్ల ఏర్పాటుసహా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల అభివృద్ధి అవకాశాలను సంయుక్తంగా అన్వేషించనున్నట్లు తెలియజేసింది. పారిశ్రామిక స్థాయిలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ద్వారా దేశీయంగా రిఫైనరీలు, ఫెర్టిలైజర్లు, స్టీల్ తదితర ప్రధాన రంగాలలో కర్బనాలను తగ్గించేందుకు అవకాశముంటుందని వివరించింది. -
భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి
న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలియా కంపెనీలకు అపార అవకాశాలున్నాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా కంపెనీలకు ఆసక్తి అధికంగా ఉండే మైనింగ్, రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) నిబంధనలను సరళీకరించామని, అందుకే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఆయన ఆస్ట్రేలియా కంపెనీలను ఆహ్వానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (సమగ్రమైన ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సెపా) కోసం సంప్రదింపులు మరింత ముమ్మరం కాగలవన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాకు మన ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవని, వీటిని మరింతగా పెంచుకోవలసి ఉందని వివరించారు. కాగా సెపా విషయమై పురోగతిని ఆకాంక్షిస్తున్నట్లు వెబినార్ ద్వారా ఆస్ట్రేలియా సెనేటర్ సైమన్ బ్రిమ్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆస్ట్రేలియాకు 290 కోట్ల డాలర్ల ఎగుమతులు, ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు 980 కోట్ల డాలర్ల దిగుమతులు జరిగాయని గోయల్ పేర్కొన్నారు. -
లేజర్ కిరణాలతో నక్షత్రాల శక్తి!
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్‌లాగా కాలుష్యం గొడవ లేదు. అణు విద్యుత్తుతో వచ్చే రేడియోధార్మికత, వ్యర్థాల సమస్య ఉండదు. ఛర్నోబిల్, ఫుకుషిమా వంటి అణు ప్రమాదాలకూ ఆస్కారం లేదు. బయటకొచ్చేదంతా హాని చేయని హీలియం. ఉత్పత్తి అయ్యే విద్యుత్తును నేరుగా వాడుకోవడమే.. ఏమిటిదీ.. ఎలా సాధ్యం? ప్రపంచం మొత్తం దశాబ్దాలుగా పరిష్కరించేందుకు మల్లగుల్లాలు పడుతున్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని ‘హెచ్‌బీ11 ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ ఓ వినూత్నమైన పరిష్కారం కనుక్కుంది. వీరి ఆలోచన విజయవంతమైతే.. భూమ్మీద విద్యుత్తు కొరత అసలే ఉండదు. సూర్యుడితో పాటు నక్షత్రాలన్నింటిలోనూ శక్తి ఉత్పత్తి అయ్యేందుకు కారణమైన కేంద్రక సంలీన ప్రక్రియపై ఆ సంస్థ కన్నేసింది. కేంద్రక సంలీన ప్రక్రియ అంటే? అణు విద్యుత్ శక్తి ప్లాంట్ల గురించి మనం తరచూ వింటూ ఉంటాం. ఇందులో అణువులను విడగొట్టడం ద్వారా పుట్టే వేడిని విద్యుత్తుగా మారుస్తారు. కేంద్రక సంలీన ప్రక్రియ అనేది దీనికి పూర్తిగా వ్యతిరేక దిశలో జరుగుతుంది. ఇందులో విపరీతమైన వేడిని ఉపయోగించి అణువులను ఒకదాంట్లో ఒకటి లయమయ్యేలా చేస్తారు. సూర్యుడు, ఇతర నక్షత్రాలన్నింటిలోనూ హైడ్రోజన్ హీలియం అణువులు లయమైపోవడం ద్వారానే శక్తి ఉత్పత్తి అవుతుంటుంది. ఈ శక్తిని మనం వెలుతురు రూపంలో అనుభవిస్తున్నాం. అయితే నక్షత్రాల్లో కోటాను కోట్ల ఏళ్లుగా జరుగుతున్న కేంద్రకసంలీన ప్రక్రియను భూమ్మీద సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. హైడ్రోజన్, హీలియం వంటి ఇంధనాలను లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేయడం ద్వారా మాత్రమే ఆ రెండు అణువులు కలసిపోతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇలాంటి ఓ విద్యుదుత్పత్తి రియాక్టర్‌ను నిర్మించేందుకు ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్ పేరుతో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఫ్రాన్స్‌లో ప్రయత్నం చేస్తోంది. అణువులను లయం చేయడం, ఉష్ణోగ్రతలను నియంత్రించడం సాధ్యమైతే? ఆ తర్వాత ఈ ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చే విషయాన్ని ఆలోచిస్తారు. హెచ్‌బీ11.. కాస్త డిఫరెంట్.. అయితే హెచ్‌బీ11 అభివృద్ధి చేసిన టెక్నాలజీలో ఇంధనాలను వేడి చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా శక్తిమంతమైన లేజర్లను ఉపయోగిస్తారు. అత్యంత సూక్ష్మ సమయం మాత్రమే వెలువడే ఈ లేజర్ల ద్వారా సూర్యుడి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉష్ణోగ్రతను పుట్టిస్తారు. ఈ టెక్నాలజీలో లోహంతో తయారు చేసిన ఓ బంతిలాంటి నిర్మాణం ఉంటుంది. దీని మధ్యభాగంలో హెచ్‌బీ11 గుళిక ఉంచుతారు. గుళికపై ఇరువైపులా చిన్న కణతలు ఉంటాయి. అయస్కాంత శక్తితో ఒక లేజర్ ప్లాస్మాను పట్టి ఉంచితే.. రెండో లేజర్ కేంద్రకసంలీన ప్రక్రియ మొదలుపెడుతుంది. ఈ క్రమంలో విడుదలయ్యే ఆల్ఫా కణాలు విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయి. ఈ విద్యుత్తును నేరుగా గ్రిడ్‌కు అనుసంధానించవచ్చు. ఈ పద్ధతిలో ఉపయోగించే బోరాన్ ప్రపంచవ్యాప్తంగా విరివిగా లభిస్తుందని, యురేనియం థోరియం వంటి అణు ఇంధనాల కంటే సులువుగా వెలికితీసి వాడుకోవచ్చని హెచ్‌బీ11 వ్యవస్థాపకుడు డాక్టర్ హెన్రిక్ హోరా చెబుతున్నారు. అణు రియాక్టర్లలోలా స్టీమ్ ఇంజన్లను ఉపయోగించాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషమంటున్నారు. అరవై ఏళ్ల ప్రస్థానం.. 1960: తొలి లేజర్ ఆవిష్కరణ 1960–78: లేజర్ల సాయంతో సంలీన ప్రక్రియపై ప్రొఫెసర్ హెన్రిక్ హోరా పరిశోధనలు 1978: శక్తిమంతమైన లేజర్లతో హైడ్రోజన్, బోరాన్ –11 (హెచ్‌బీ11)లను బాగా వేడి చేయకుండానే లయం చేయొచ్చని హెన్రిక్ హోరా ప్రకటన. 1985: అందుబాటులోకి చిర్ప్డ్ పల్స్ ఆంప్లిఫికేషన్ టెక్నాలజీ(సీపీఏ). డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ ద్వారా చిన్న చిన్న లేజర్ కిరణాల శక్తిని లక్షల రెట్లు పెంచేందుకు వీలేర్పడింది. 2005–2015: సీపీఏ టెక్నాలజీ సాయంతో హెచ్‌బీ11ను లయం చేయొచ్చని, ఇందుకు 2 పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతలకు వేడి చేయాల్సిన అవసరం లేదని పలువురు శాస్త్రవేత్తల నిరూపణ. 2014–2017: కేంద్రక సంలీన ప్రక్రియను సులువుగా సాధించే టెక్నాలజీపై పేటెంట్ హక్కులు నమోదు చేసిన హెచ్‌బీ11 2018: డోనా స్ట్రిక్‌ల్యాండ్, గెరార్డ్ మౌరూలకు భౌతిక శాస్త్ర నోబెల్. 2019: హెచ్‌బీ11 ఎనర్జీ కంపెనీ ఏర్పాటు. తొలి అమెరికన్ పేటెంట్ మంజూరు! -
తేలికైన సౌరఫలకాలు..
సౌరశక్తిని విస్తృత స్థాయిలో వాడకపోయేందుకు కారణాలేంటో తెలుసా? బరువు ఎక్కువగా ఉండటం.. కావాల్సినట్లు మడతపెట్టే అవకాశం లేకపోవడం వంటివి రెండు కారణాలు. ఈ సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియాలోని సన్మ్యాన్ ఎనర్జీ సంస్థ వినూత్నమైన సౌర ఫలకలను అభివృద్ధి చేసింది. తేలికగా, గాజు లేకుండా తయారు చేసింది. ఫలితంగా వీటిని ఎలా అంటే అలా మడతపెట్టి వాడుకోవచ్చు. దీంతో వంపులున్న భవనాల్లోనూ ఎక్కువ సంఖ్యలో సోలార్‌ప్యానెల్స్ ఏర్పాటు చేసి విద్యుదుత్పత్తి పెంచుకోవచ్చు. ఈ–ఆర్చ్ అని పిలుస్తున్న ఈ సోలార్‌ప్యానెల్ ఒకొక్క దాంట్లో దాదాపు వంద వరకు ఘటకాలు ఉంటాయి. రెండు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే ఈ ప్యానెల్‌ను కావాల్సిన ఆకారంలో మార్చుకునే అవకాశం ఉంది. సంప్రదాయ సోలార్ ప్యానెల్స్ ఒకొక్కటి 20 కిలోల బరువు ఉంటే ఈ ఆర్చ్ 2.4 కిలోలు మాత్రమే ఉంటుంది. భవనాల కిటికీలతో పాటు పైకప్పులపై కూడా ఇవి తేలిగ్గా ఇమిడిపోతాయని సన్మ్యాన్ ఎనర్జీ సీఈవో డారెన్మిల్లర్ తెలిపారు. -
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కలెక్టర్ సమీక్ష
కర్నూలు(అగ్రికల్చర్): ఆస్ట్రేలియన్ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై గురువారం కలెక్టర్ విజయమోహన్ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అస్ట్రేలియన్ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు 500 ఎకరాల భూములు అవసరమని ఈ భూములను ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్‌లో కేటాయించాలని కలెక్టర్ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో లభ్యమయ్యే లో గ్రేడ్ ముడి ఇనుప ఖనిజాన్ని హైగ్రేడ్‌కు మార్చే టెక్నాలజీపై కార్మికులకు తగిన శిక్షణ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్‌తో పాటు వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వివరించారు. అస్ట్రేలియన్ కంపెనీ ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్ వల్ల జిల్లాకు చెందిన వందలాది మంది యువతకు ఉఫాది లభిస్తుందని తెలిపారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపికృష్ణ స్పందిస్తూ ఓర్వకల్ మండలం కొమరోలు గ్రామంలో 500 ఎకరాల భూములు కేటాయిస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రేపటికి ముందడుగు
సూపర్ సేఫ్ హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదం. అంతేకాదు.. గెడ్డం కింద నుంచి ఓ పట్టీని బిగించుకునే మన పాత మోడల్ హెట్మెట్లను ప్రమాద సమయాల్లో వెంటనే తొలగించలేకపోయినా ప్రమాదమే! ఈ చిక్కులకు ఫుల్స్టాప్ పెట్టేందుకు వోజ్ అనే ఆస్ట్రేలియన్ సంస్థ సరికొత్త డిజైన్‌తో హెల్మెట్‌ను తయారు చేసింది. నిట్టనిలువునా రెండుగా విడిపోయే ఈ ఆర్ఎస్ 1.0 హెల్మెట్‌కు పట్టీలేవీ ఉండవు. మన దవడలుండే ప్రాంతంలో ఏర్పాటు చేసిన బటన్లతో రెండు భాగాలను కలుపుకుంటే చాలు. ప్రమాద సమయాల్లో హెల్మెట్‌ను తొలగించేందుకు పైభాగంలో రెండు స్క్రూలు ఏర్పాటు చేశారు. నోటిభాగంలోని మరో స్క్రూ సాయంతో హెల్మెట్ సైజును మార్చుకోగలగడం మరో సౌలభ్యం. ఈ స్మార్ట్‌ఫోన్‌ను సోప్‌తో కడిగేయవచ్చు! స్మార్ట్ఫోన్లు చాలా సున్నితమైనవి. వాటర్ ప్రూఫ్ ఏమాత్రం తడి తగిలినా పాడైతాయి. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్ఫోన్లూ ఉన్నా వాటికీ కొన్ని పరిమితులున్నాయి. క్యోసెరా మొబైల్ కంపెనీ డిగ్నో రాఫైర్ పేరుతో తయారు చేసిన సరికొత్త స్మార్ట్ఫోన్లు మాత్రం వీటికి పూర్తిగా భిన్నం. మరక పడిందనుకుంటే దీన్ని నేరుగా నల్లా కింద పెట్టేయవచ్చు. ఎంచక్కా సోపు పెట్టి కడిగేయవచ్చు కూడా. ప్రస్తుతానికి జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఖరీదు దాదాపు రూ.30 వేలు. ఆండ్రాయిడ్ 5.1 9 (లాలీపాప్) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే డిగ్నో రాఫైర్లోని ప్రత్యేకమైన స్క్రీన్ తడిగా ఉన్నా పనిచేస్తుంది. దీంట్లో ఉండే స్మార్ట్ సోనిక్ రిసీవర్లు స్పీకర్లలోనూ నీరు చేరకుండా ఉంచుతుంది. ఫ్రిజ్ ఎలా పనిచేస్తుంది? తినగ తినగ వేము తియ్యనగు అన్న సామెత మీరు వినే ఉంటారు. దీన్ని కొంచెం మార్చుకుంటే ఫ్రిజ్ ఎలా పనిచేస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఫ్రిజ్లోపలి గాల్లో ఉండే వేడిని పదేపదే తీసేస్తూపోతే అక్కడ చల్లగా అవుతుందన్నమాట. ఇందుకోసం త్వరగా ఆవిరయ్యే ద్రవం ఒకటి అవసరం. దీన్నే రిఫ్రిజరెంట్ అంటారు. ఫ్రిజ్ వెనుకభాగంలో ఉండే కంప్రెసర్‌లో ఈ రిఫ్రిజరెంట్ ఆవిరిని అధికపీడనంతో ఉంచుతారు. మనం ఫ్రిజ్ స్విచ్ ఆన్ చేయగానే... 1. రిఫ్రిజరెంట్ ఆవిరి ఫ్రిజ్ వెనుకభాగంలో ఉన్న కండెన్సర్ కాయిల్స్ ద్వారా ప్రయాణించడం మొదలవుతుంది. 2. చుట్టుపక్కల ఉండే చల్లటిగాలి కారణంగా కాయిల్‌లోని ఆవిరి కాస్తా ద్రవంగా మారుతుంది. 3. పీడనం ఎక్కువగా ఉండటం వల్ల వేగంగా చల్లబడుతూ ప్రీజర్‌లో ఉండే ఎవాపరేటర్ కాయిల్స్ ద్వారా ప్రయాణిస్తుంది. రిఫ్రిజరేటర్ లోపలి వేడిని పీల్చుకుంటుంది. 4. ఈ క్రమంలో రిఫ్రిజరెంట్ కాస్తా మళ్లీ ఆవిరిగా మారిపోయి... కంప్రెసర్‌ను చేరుతుంది. ఈ ఐదు దశలు మళ్లీమళ్లీ పునరావృతం కావడం ద్వారా రిఫ్రిజరేటర్‌లోని గాలి క్రమేపీ చల్లగా మారుతుంది.