స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కలెక్టర్‌ సమీక్ష | collector rivew on steel plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై కలెక్టర్‌ సమీక్ష

Published Fri, Jan 20 2017 12:33 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

collector rivew on steel plant

కర్నూలు(అగ్రికల్చర్‌): ఆస్ట్రేలియన్‌ కంపెనీ ఆధ్వర్యంలో జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై గురువారం కలెక్టర్‌ విజయమోహన్‌ తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అస్ట్రేలియన్‌ కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు 500 ఎకరాల భూములు అవసరమని ఈ భూములను ఓర్వకల్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లో కేటాయించాలని కలెక్టర్‌ ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో లభ్యమయ్యే లో గ్రేడ్‌ ముడి ఇనుప ఖనిజాన్ని హైగ్రేడ్‌కు మార్చే టెక్నాలజీపై కార్మికులకు తగిన శిక్షణ ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌తో పాటు వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వివరించారు. అస్ట్రేలియన్‌ కంపెనీ ఏర్పాటు చేసే స్టీల్‌ ప్లాంట్‌ వల్ల జిల్లాకు చెందిన వందలాది మంది యువతకు ఉఫాది లభిస్తుందని తెలిపారు. ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ గోపికృష్ణ స్పందిస్తూ ఓర్వకల్‌ మండలం కొమరోలు గ్రామంలో 500 ఎకరాల భూములు కేటాయిస్తామన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ సోమశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement