
నీటిని పొదుపు చేయాలి
కోదాడఅర్బన్: నీటిని పొదుపు చేసి , పరిమితంగా ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మున్సిపల్ కౌన్సిలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్‌ఎన్ ప్రసాద్, సీసీరెడ్డి పాఠశాలల గుంటూరు ప్రావిన్స్ ప్రొవెన్షియల్ సిస్టర్ సుందరిలు కోరారు. మంగళవారం సీసీరెడ్డి పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నీటి పొదుపు ఆవశ్యకతపై నిర్వహించిన కార్యక్రమంలో వారు ముఖ్య అతి«థులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనను వారు తిలకించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సిస్టర్ లతీషా, ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ ఆన్‌జ్యోతి, ఉపాధ్యాయులు ఎబినేజర్‌బాబు, సుజాత, షమ్మీబేగం, క్లెమెన్స్, నెమ్మాది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.