
బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలి
కోదాడ: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింభమైన బతుకమ్మ ఉత్సవాలను జాగృతి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వాటిని విజయవంతం చెయాలని కోదాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కె. శశీధర్‌రెడ్డి కోరారు. గురువారం కోదాడలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాగృతి నియోజకవర్గ కన్వీనర్ రణబోతు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 9 రోజుల పాటు నియోజకవర్గంలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలిరోజు 30వ తేదీన అనంతగిరిలో, 1వ తేదీన మాధవరంలో, 2న నడిగూడెంలో, 3న మునగాలలో, 4న నేలమర్రిలో, 5న మోతెలో,6న చిలుకూరులో, 7న నారాయణగూడెంలో, 8న కేఎల్‌ఆర్ ఎవెన్యూలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, శ్రీనివాసగౌడ్, యల్క కవిత, రాంబాబు, భరత్, ఉపేందర్, అమరనాథ్, రామకృష్ణ, సైదులు, పిచ్చయ్య, రఘు, గోపినాథ్, కోదండం తదితరులు పాల్గొన్నారు.