జీవవెవిధ్యాన్ని కాపాడటం సామాజిక బాధ్యత | protect biodiversity is social responsibility | Sakshi
Sakshi News home page

జీవవెవిధ్యాన్ని కాపాడటం సామాజిక బాధ్యత

Published Thu, Sep 1 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

జీవవెవిధ్యాన్ని కాపాడటం సామాజిక బాధ్యత

జీవవెవిధ్యాన్ని కాపాడటం సామాజిక బాధ్యత


మోత్కూరు
జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని మోత్కూరు మండల ఎంపీపీ ఓర్సులక్ష్మీ పురుషోత్తం తెలిపారు. బుధవారం మండలంలోని దాచారం గ్రామంలో జీవవైవిధ్యంపై అవగాహన సదస్సు, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు గ్రామంలోని ప్రతిఒక్కరు కృషిచేయాలని కోరారు. జెడ్పీటీసీ చింతల వరలక్ష్మీ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరారు. సింగిల్‌ విండో చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జీవవైవిధ్యాన్ని కాపాడకపోతే మానవ మనుగడ అసాధ్యమన్నారు. జీవవైవిధ్య జిల్లా కోర్డినేటర్‌ ఎట్టం శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఔషధ మొక్కల ఉపయోగాన్ని గ్రామస్తులకు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.వెంకటనర్సయ్య, సర్పంచ్‌ కడమంచి వస్తాద్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు నిమ్మల వెంకటేశ్వర్లు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ యాదగిరి, అవిలయ్య, ఉప సర్పంచ్‌ కప్పల లింగయ్య, వార్డు సభ్యులు, జీవవైవిధ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement