
మండే ఎండ.. దుప్పటే అండ
పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి అన్నట్లు.. మండుతున్న ఎండల నుంచి రక్షించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇదిగో ఈ చిత్రమే ఇందుకు సాక్ష్యం. బయట ఎండను చూస్తే భయమేస్తోంది. అలాగని ఇంట్లోనే ఉంటే కడుపు కాలుతుంది.
ఇంకేముంది ఎడ్ల బండి యజమాని బుర్రకు ఆలోచన తట్టినట్లుంది.. అంతే.. ఇదిగో తనతో పాటు ఎద్దుకు కూడా నీడ ఉండేలా దుప్పటి కప్పాడు. ఎంచక్కా తన పని తాను చేసుకుపోతున్నాడు. కడప నగరంలో మంగళవారం ఈ దృశ్యం కనిపించింది.