మునగాల: మండల కేంద్రంలో 229 సర్వే నంబర్‌లో గల ఊరచెరువును మునగాల, నారాయణగూడెం గ్రామాలకు చెందిన కొందరు గ్రామస్తులు ఆక్రమణలకు పాల్పడి బోర్లు, బావులు ఏర్పాటు చేసుకొని సాగుచేస్తున్నారని గ్రామాలకు చెందిన పలువురు బుధవారం స్థానిక ఇన్‌చార్జి తహసిల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే దాదాపు 150ఎకరాల వరకు ఆక్రమణ జరిగిందని గతంలో ప్రభుత్వం చెరువు భూమికి హద్దులు ఏర్పాటు చేసిందని వారు వివరించారు. దీంతో చెరువులో నీటి సామర్థ్యం తగ్గిపోవడంతో ఆయకట్లు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతుందని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆక్రమణల దారులనుంచి చెరువు భూమిన కాపాడాలని వారు కోరారు. వినతిపత్రం అందచేసిన వారిలో ఎల్‌పి.రామయ్య, బండారు నర్సయ్య, పిడమర్తి వెంకన్న, ఎల్.మట్టయ్య ఎల్.వెంకన్న, ఎల్.రాములు, ఎల్.ఈదయ్య, నెమ్మాది దుర్గయ్య, నెమ్మాది ముత్తయ్య, ఎల్.నాగేశ్వరరావులు ఉన్నారు.
చెరువు ఆక్రమణను అడ్డుకోవాలి
Published Wed, Aug 31 2016 6:02 PM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement