నష్టపోయిన రైతులను ఆదుకోవాలి | who loss the farmers govt protect them | Sakshi
Sakshi News home page

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Published Mon, Sep 26 2016 10:32 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి - Sakshi

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

–జూలకంటి రంగారెడ్డి
మొల్కచర్ల(దామరచర్ల) : ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని.సోమవారం దామరచర్ల మండలం మొల్కచర్లలో వర్షాలకు నష్టపోయిన పంట పొలాలతో పాటు  తెగిన మల్లప్ప చెర్వును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు తెగడం వల్ల దానికింద సాగు చేసిన 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. చెరువు గండిని పూడ్చి వేసి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.     రైతు రుణాలన్నింటినీ జాప్యం చేయకుండా ఒకే విడతలో మాపీ చేయాలని కోరారు. ఆయన వెంట సీపీఎం yì విజన్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు,డి.చంద్రశేఖర్‌యాదవ్,సర్పంచి కొర్రా శ్రీనునాయక్‌ తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement