ప్రతి మొక్కనూ సంరక్షించాలి
Published Wed, Jul 20 2016 1:33 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
గుండ్రాంపల్లి (చిట్యాల) : హరితహారం కార్యక్రమంలో హైవే పక్కన నాటిన ప్రతి మొక్కను సంరంక్షించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆదేశించారు. మంగళవారం ఆయన నల్లగొండలో జరిగే సమావేశానికి వెళ్తూ మండలంలోని గుండ్రాంపల్లి శివారులో హైవే వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ నాటిన వేప మొక్క దగ్గరగా వెళ్లి పరిశీలించారు. సీఎం నాటిన మొక్కకు రక్షణగా ట్రీ గార్డు ఏర్పాటు చేకపోవడంపై ఆయన అధికారులను ప్రశ్నించారు. వెంటనే ట్రీ గార్డును ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. మొక్కలకు రోజుకు ఎన్నిసార్లు నీరు పోస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎండిన మొక్కలను పరిశీలించి వెంటనే వాటిని తొలగించి కొత్తవాటిని నాటాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన గుండ్రాంపల్లి సింగిల్ విండో చైర్మన్ అంతటి శ్రీనివాస్‌ను ‘హరితహారంలో పాల్గొంటున్నారా..?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఆయన ‘అందరూ పాల్గొంటున్నారు’ అని బుదులివ్వడంతో మంత్రి సంతప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట పలువురు ఆటవీ శాఖ అధికారులు ఉన్నారు.
Advertisement