ఆధునిక యుగంలో గ్రామాలు సైతం నగరాలుగా మారిపోతున్నాయి. అయితే నేటికీ దేశంలోని కొన్నిగ్రామాలు మూఢనమ్మకాల ముసుగులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో కొలియారి గ్రామ ప్రజలు నేటికీ ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగివున్నారు. వీరు తమ ఇళ్లకు ఆవు పేడతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది పిడుగుపాట్ల నుంచి తమను రక్షిస్తుందని చెబుతారు.
గ్రామస్తులందరూ ఈ నమ్మకానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఈ గ్రామంలో పిడుగుపాటుకు గురైన వారికి ఆవు పేడ పూస్తారు. ఆవు పేడ నిల్వ ఉన్న ప్రదేశాలలో పిడుగు పడదని వీరు చెబుతుంటారు. ఈ గ్రామంలో ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ నేటికీ ఏ శుభకార్యం జరిగినా ఆ ప్రాంగణాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. గ్రామంలోని ప్రతి ఇంటి వెలుపల పేడతో కూడిన భద్రతా వలయం కనిపిస్తుంది.
ఇలా చేయడం వల్ల తమ ఇల్లు సురక్షితంగా ఉంటుందని గ్రామస్తులు అంటారు. ఇంటికి ఆవు పేడను పూస్తే పిడుగుల నుండి ఉపశమనం కలగడమే కాకుండా, పాములు, తేళ్ల నుండి కూడా రక్షణ దొరుకుతుందంటారు. అలాగే కీటకాలు కూడా ఇంటిలోనికి ప్రవేశించవని చెబుతారు.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత లోతైన 5 సింక్‌హోల్స్.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం..
Comments
Please login to add a commentAdd a comment