Dung Cakes (Pidakalu)
-
ఇంటికి పేడ రాస్తే పిడుగు పడదట..! వింత గ్రామంలో విచిత్ర నమ్మకం!
ఆధునిక యుగంలో గ్రామాలు సైతం నగరాలుగా మారిపోతున్నాయి. అయితే నేటికీ దేశంలోని కొన్నిగ్రామాలు మూఢనమ్మకాల ముసుగులో కొట్టుమిట్టాడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో కొలియారి గ్రామ ప్రజలు నేటికీ ఒక విచిత్రమైన నమ్మకాన్ని కలిగివున్నారు. వీరు తమ ఇళ్లకు ఆవు పేడతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది పిడుగుపాట్ల నుంచి తమను రక్షిస్తుందని చెబుతారు. గ్రామస్తులందరూ ఈ నమ్మకానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఈ గ్రామంలో పిడుగుపాటుకు గురైన వారికి ఆవు పేడ పూస్తారు. ఆవు పేడ నిల్వ ఉన్న ప్రదేశాలలో పిడుగు పడదని వీరు చెబుతుంటారు. ఈ గ్రామంలో ఆవు పేడకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ నేటికీ ఏ శుభకార్యం జరిగినా ఆ ప్రాంగణాన్ని ఆవు పేడతో అలంకరిస్తారు. గ్రామంలోని ప్రతి ఇంటి వెలుపల పేడతో కూడిన భద్రతా వలయం కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల తమ ఇల్లు సురక్షితంగా ఉంటుందని గ్రామస్తులు అంటారు. ఇంటికి ఆవు పేడను పూస్తే పిడుగుల నుండి ఉపశమనం కలగడమే కాకుండా, పాములు, తేళ్ల నుండి కూడా రక్షణ దొరుకుతుందంటారు. అలాగే కీటకాలు కూడా ఇంటిలోనికి ప్రవేశించవని చెబుతారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత లోతైన 5 సింక్‌హోల్స్.. భారీ భవనమే కాదు.. పెద్ద అడవి సైతం.. -
భలే... పేడ కళ
‘ఇంకేం మిగిలింది పేడ’ అని వ్యంగ్యంగా అనవచ్చు. పేడ విలువ మన పూర్వికులకు తెలుసు. దాని ఉపయోగాలూ తెలుసు. పేడ అలికిన ఇల్లు శుభదాయకమైనది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పుడొక టీచరమ్మ పేడతో కళాకృతులు తయారు చేస్తోంది. ఆధ్యాత్మిక చిహ్నాలను పేడతో రూపొందిస్తోంది. వీటి అలంకరణ ఇంటికి సంప్రదాయకళ తెస్తుందని చెబుతోంది. ప్రస్తుతం జనం వాటిని కొనేందుకు సిద్ధమవుతున్నారు. పేడతో పిడకలు కొట్టడం, కళ్లాపి చల్లుకోవడం, ఇల్లు అలుక్కోవడం తరతరాలు చేస్తున్నదే. కాని పేడతో కళాకృతులు చేయడం ద్వారా ఒట్టిపోయిన ఆవులను, ఎడ్లను కూడా రోడ్ల మీద వదలడమో, కబేళాకు తరలించడమో చేయకుండా వాటి ఆలనా పాలనా చూడొచ్చు అంటుంది 42 ఏళ్ల పూజా గాంగ్వర్. కిలో పేడ ఎంత? కిలో పేడ మనం ఎంతకు కొంటాం? ఎంతకీ కొనం. ఎందుకంటే పేడ ఎక్కడైనా దొరుకుతుంది. ‘కాని వాటితో కళాకృతులు చేస్తే కిలో పేడ కళాకృతులకు 2000 రూపాయలు వస్తాయి. సంపాదించవచ్చు’ అంటోంది పూజా గాంగ్వర్. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌కు సమీపంలోని రాజన్‌పూర్ అనే గ్రామంలో ప్రైమరీ టీచర్‌గా పని చేస్తున్న పూజా గాంగ్వర్ పేడతో కళాకృతులు చేయడమే కాదు. వాటివల్ల ఒక డజను మందికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయమూ గడిస్తోంది. వాల్ హ్యాంగింగులు, నేమ్ ప్లేట్లు, బొమ్మలు, పెన్ హోల్డర్లు, అగర్ బత్తీలు, చెప్పులు... ఇలా ఎన్నో తయారు చేస్తూ ఆకట్టుకుంటోంది. తేలిక బొమ్మలు పేడతో తయారయ్యే వస్తువులు తేలిగ్గా ఉంటాయి. ఎందుకంటే పేడను సేకరించి, ఎండబెట్టి, పొడి చేసుకుని, జల్లెడ పట్టుకుని, ఆ వచ్చిన మెత్తటి పొడికి మైదా పిండిగాని, చెట్టు బంక గాని, ముల్తానీ మట్టిగాని కలిపి సాగే లక్షణం కలిగిన బంక పదార్థంగా (క్లే) చేసుకుని దానితో కళాకృతులు తయారు చేస్తారు. ‘ఇనుము, రాగి, ఫైబర్ మూసల్లో పేడ క్లేను మూసబోసి ఆరబెట్టి బొమ్మలను తయారు చేస్తాం’ అని తెలిపింది గాంగ్వర్. బొప్పాయి పాలు ‘మూసలో పోసి ఆరబెట్టుకున్న కళాకృతులకు పాలిష్ కోసం బొప్పాయి పాలుగాని, అవిసె గింజల నూనె గాని వాడతాం. ఈ కళాకృతులు పాడుగావు. నీళ్లు తగలకుండా చూసుకుంటే ఐదారేళ్లు ఉంటాయి. మా ఊళ్లోని యాభై ఆవుల పేడను నేను ఈ బొమ్మల కోసం వాడుతున్నాను. ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి స్త్రీలు వచ్చి నేర్చుకుంటామంటున్నారు. వారికి ట్రయినింగ్ ఇస్తే ఆవు పేడ సద్వినియోగం అవుతుంది. ఆవుల సంరక్షణా జరుగుతుంది’ అని తెలిపింది పూజ.. -
పిడకల సమరంలో 50 మందికి గాయాలు
ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పిడకల సమరాన్ని (నుగ్గులాట) చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అరగంట పాటు జరిగిన పిడకల సమరంలో సుమారు 50 మంది గాయపడ్డారు. వారందరికీ స్థానికంగా చికిత్స చేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
పేడ ఎత్తేందుకూ ఓ మెషీన్!
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ శ్రమ, ఖర్చును తగ్గిస్తూ అనేక ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులు, డెయిరీ ఫారాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగా ‘ఆటోమేటెడ్ డంగ్ క్లీనర్’రూపుదిద్దుకుంటోంది. టైమ్ సెట్ చేసి వదిలేస్తే... నిర్ధారిత సమయానికి పేడను ఎత్తివేసి పశువుల షెడ్డును శుభ్రం చేసేస్తుంది. ప్రయోగస్థాయిలోనే పలువురి ప్రశంసలు పొందిన ఈ నూతన ఆవిష్కరణ త్వరలో పూర్తిస్థాయిలో పాడి రైతులు, డెయిరీ ఫారాల నిర్వాహకులకు అందుబాటులోకి రానున్నది. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ, కృషికి ఫలితమిది. పాడి పరిశ్రమను చేపట్టిన రైతులు, వ్యాపారవేత్తలు డెయిరీ రంగంలో కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. షెడ్ల నుంచి పేడను ఎత్తి శుభ్రం చేయడం ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ‘డంగ్ క్లీనర్’యంత్రాన్ని రూపొందించారు. డంగ్ క్లీనర్ ప్రోటోటైప్ యంత్రానికి ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, స్థానిక జిల్లా అధికారుల ప్రశంసలు దక్కాయి. పని చేస్తుందిలా... ►ఇది చక్రాలతో పశువుల కొట్టం అంతటా తిరుగుతూ రోబోటిక్ చేతుల సాయంతో పేడను ఎత్తుతుంది. ►ఎత్తిన పేడను ఓ కంటెయినర్లో నింపుకుని నిర్ణీత పరిమాణంకు చేరుకున్న తర్వాత సమీపంలోని కంపోస్ట్ పిట్‌కు చేరవేస్తుంది. ►మీథేన్ గ్యాస్ ఆధారంగా పేడను గుర్తించేలా ఇందులో సెన్సర్లను అమర్చారు. ►యంత్రంలోని రియల్ టైమ్ క్లాక్ ఆధారంగా ఏ సమయంలో షెడ్‌ను క్లీన్ చేయాలో ముందుగానే టైమ్‌ను సెట్ చేయొచ్చు. ►విద్యుత్ చార్జింగ్‌తో పనిచేస్తుంది.రూ.100 నుంచి 150 పశువులున్న డెయిరీని దాదాపు నాలుగు గంటల్లో శుభ్రం చేయగలదు. -
పిడకలు.కామ్
అప్రాచ్య దేశాల్లో ఎక్కడ చూసినా బోసిగోడలే! ఏ ఇళ్లలో చూసినా పొగలేని పొయ్యిలే! పేడ పరిమళం నాసికకు సోకే అవకాశమే ఉండదు. దగ్గరగా ఉండేవాటి విలువను మనం తెలుసుకోలేం. పిడకలూ అందుకు అతీతం కాదు. దూరపు కొండలు ఎంత నునుపుగా ఉంటాయో, దగ్గరగా చూశాక విదేశాల్లో స్థిరపడ్డ మనవాళ్లకు తాము కోల్పోతున్నదేదో అర్థమయ్యే ఉంటుంది. మన కళా సంస్కృతుల విలువ మాత్రమే కాదు, సంస్కృతిలో అవిభాజ్యమైన పిడకల విలువ కూడా వాళ్లకు బాగానే తెలిసొచ్చి ఉంటుంది. బహుశ అందుకేనేమో! ఆన్లైన్లో పిడకలకు గిరాకీ పెరిగింది. కంప్యూటర్ ముందు కూర్చుని, ఒక నొక్కు నొక్కితే చాలు. పిడకల పార్సెల్ ఇంటికొచ్చిపడుతోంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. అనే రీతిలో దేశభక్తులగు మన ప్రవాసులు పార్సెళ్లలో పిడకలు తెప్పించుకుంటూ, వాటితో అక్కడ సంప్రదాయానికి లోటు రాకుండా భోగిమంటలు వేసుకుంటున్నారు. పిడకలు - ఉపయోగాలు * తొలిరోజుల్లో పిడకలను వంటచెరకుకు అనుబంధంగా వాడేవారని తెలిసిందే. పిడకలు కాలిన తర్వాత మిగిలిన బూడిదను అంట్లగిన్నెలు తోముకోవడానికే కాదు, పళ్లుతోముకోవడానికి కూడా ఉపయోగించేవాళ్లు. * పిడకలు తయారు చేసేటప్పుడు పేడలో కాసిన్ని వేపాకులు కూడా కలిపేవారు. వేపాకులు కలిపిన పిడకలను ఎండబెట్టిన తర్వాత కాలిస్తే, వాటి నుంచి వెలువడే పొగకు దోమలు పరారయ్యేవి. మస్కిటో కాయిల్స్ తెలియని రోజుల్లో జనాలు వీటినే కాల్చేవారు. * సగటు పరిమాణంలో ఉండే ఒక పిడక నుంచి దాదాపు 2100 కిలోజౌల్స్ శక్తి విడుదలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. అందువల్ల వీటిని ప్రత్యామ్నాయ ఇంధనంగా భేషుగ్గా వాడుకోవచ్చు. * తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమ పెట్టాలనుకునే వాళ్లు పిడకల పరిశ్రమను పెట్టుకునే అవకాశాన్ని నిక్షేపంగా పరిశీలించవచ్చు. ఆన్లైన్ మార్కెట్లో డజను పిడకల ధర దాదాపు రూ.150 వరకు పలుకుతోంది. - పన్యాల జగన్నాథదాసు