
మాట్లాడుతున్న కమలానంద భారతీస్వామి
కోరుట్లటౌన్: హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని హిందూ దేవాలయాల పరిరక్షణ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు కమలానంద భారతీస్వామి అన్నారు. కోరుట్లలో ఈనెల 30న భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్ర పోస్టర్‌ను ఆదివారం స్థానిక మహాదేవస్వామి ఆలయంలో విడుదల చేశారు.
ఆయన మాట్లాడుతూ శ్రీరామునిచరిత్ర, హనుమాన్‌దీక్ష విశిష్టతను వివరించారు. ఆలయ అధ్యక్షుడు గెల్లె గంగాధర్, మంచాల జగన్, గట్ల శివ, అర్చకులు పాలెపు వెంకటరమణశర్మ, కార్తీక భరధ్వాజశర్మ, గెల్లె శ్రీనివాస్, నరేందర్, నరేశ్, రోహిత్ పాల్గొన్నారు.