ఆదిలాబాద్: పుష్కర స్నానం చేసేందుకు వచ్చిన ఒక వ్యక్తి గోదావరిలో మునిగి మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి గ్రామం వద్ద శనివారం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సికిందర్ (27) అనే యువకుడు కుటుంబసభ్యులతో గోదావరి పుష్కరాలకు దండేపల్లి గ్రామానికి వచ్చాడు. శనివారం మధ్యాహ్నం గోదావరిలో పుష్కర స్నానం చేస్తుండగా నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. యువకుడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడని పోలీసులు చెప్పారు.