
పార్టీ కోసం పడవలో రాత్రి వెళ్లి..
భోపాల్: నీళ్లపై బోటులో విహరిస్తూ పార్టీ చేసుకోవాలన్న వారి కోరిక నెరవేరుతుండగా విషాధమలుపు తీసుకుంది. అనూహ్యంగా ఆ పడవ బోర్లాపడి అందులోని పదిమంది నీళ్లలో పడిపోయారు. వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా ఐదుగురు ఈదుకుంటూ ఒడ్డునపడ్డారు. కళ్లముందే తమ స్నేహితులు మునిగిపోతుంటే చూడటం తప్ప ఏం చేయలేకపోయారు.
ఈ దుర్ఘటన భోపాల్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భోపాల్లోని కమ్లాపాటి ఘాట్ వద్ద ఓ చిన్న నీటి సరస్సు ఉంది. ఆదివారం రాత్రి అక్కడికి వెళ్లిన పదిమంది స్నేహితులు పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకొని ఓ పడవను తీసుకున్నారు. అనంతరం పార్టీ చేసుకుంటూ పడవ బోర్లాపడి ఐదుగురు జలసమాధి అయ్యారు. మిగిలిన ఐదుగురి మృతదేహాలను తర్వాత బయటకు తీశారు.