జైపూర్: ఓ నీటి కొలనులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం రాజస్థాన్లో చోటుచేసుకుంది. వీరిలో ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అన్నాదమ్ములు. ఈ ఘటనతోవారివారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శివనాథ్(13), సురేశ్(శివనాధ్ సోదరుడు) (10), ప్రజాపత్ (10) కలిసి స్నానం చేసేందుకు ఓ నీటి కొలను వద్దకు వెళ్లారు. అక్కడ ఒడ్డకు నిల్చొని స్నానం చేస్తుండగా కాలు జారీ అందులో పడిపోయారు. ముగ్గురుకి ఈత రాకపోవడంతో అందులోనే ప్రాణాలు వదిలారు.