three boys
-
చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థుల మృతి
మాక్లూర్: చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం ఒడ్డేట్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహేశ్ (20), తిరుపతి(19), నరేశ్ (20), సాయితేజ, వినోద్‌లు శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే చెరువులో మొరం కోసం తవ్విన లోతైన గుంతలు ఉన్నాయి. ఈ విషయం తెలియని మహేశ్, తిరుపతి, నరేశ్ చెరువులోకి దిగిన వెంటనే లోతైన గుంతల్లోకి జారి మునిగి పోయారు. ఒడ్డునే ఉన్న సాయితేజ, వినోద్ వెంటనే తేరుకుని గ్రామంలోనికి వెళ్లి సమాచారం ఇచ్చారు. పెద్దఎత్తున గ్రామస్తులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ముగ్గురూ మృతిచెందడంతో గజ ఈతగాళ్లతో ముగ్గురి మృత దేహాలను బయటకు తీయించారు. మృతుల తల్లిదండ్రులకు వారు ఒక్కొక్కరే సంతానం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుల్లో తిరుపతి 10వ తరగతి, నరేశ్, మహేశ్‌లు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మాక్లూర్ ఎస్సై సుధీర్‌రావు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలాన్ని ట్రెయినీ ఐపీఎస్ అధికారి చైతన్యరెడ్డి, నార్త్‌జోన్ సీఐ సతీశ్ పరిశీలించారు. -
మొబైల్, డబ్బు కోసం టీచర్‌ను చంపేశారు
బీజింగ్: చైనాలో దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది. ముగ్గురు విద్యార్థులు మహిళా టీచర్ (50)ను చంపి, ఆమె వద్ద నుంచి మొబైల్ ఫోన్, 20 వేల రూపాయల నగదును దోచుకుని పారిపోయారు. ముగ్గురు విద్యార్థుల వయసు 11 నుంచి 13 ఏళ్ల మధ్య ఉంటుంది. హునన్ ప్రావిన్స్‌లోని లియన్క్వియావోలోనిఓ ఎలిమెంటరీ స్కూల్లో ఈ దారుణం జరిగింది. ఆ స్కూల్లో ఆమె ఒక్కరే టీచర్ కాగా.. దాడి చేసిన విద్యార్థులు వేరే స్కూల్లో చదువుతున్నారు. విద్యార్థులు.. మహిళా టీచర్ నోట్లో గుడ్డ కుక్కి చెక్కతో పొడిచారు. అనంతరం ఆమెను ఈడ్చుకెళ్లి బాత్రూమ్లో పడేశారు. మహిళా టీచర్ అక్కడికక్కడే మరణించారు. పారిపోయిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు వలస కార్మికులు. పిల్లలను సొంత ఊళ్లోనే విడిచి.. ఉపాధి కోసం చైనాలోని ఇతర నగరాలకు వెళ్లారు. -
ముగ్గురు పిల్లలు మునిగిపోయారు
జైపూర్: ఓ నీటి కొలనులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. వీరిలో ఇద్దరు ఒకే ఇంటికి చెందిన అన్నాదమ్ములు. ఈ ఘటనతోవారివారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది. శివనాథ్(13), సురేశ్(శివనాధ్ సోదరుడు) (10), ప్రజాపత్ (10) కలిసి స్నానం చేసేందుకు ఓ నీటి కొలను వద్దకు వెళ్లారు. అక్కడ ఒడ్డకు నిల్చొని స్నానం చేస్తుండగా కాలు జారీ అందులో పడిపోయారు. ముగ్గురుకి ఈత రాకపోవడంతో అందులోనే ప్రాణాలు వదిలారు. -
గణేష్ నిమజ్జనానికి వెళ్లి ముగ్గురు మృతి
-
ఈత కొలునులో చిక్కుకుని ముగ్గురు మృతి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం ముగ్గురూ మిల్లార్‌పేట వాసులే సాక్షి, బళ్లారి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని బళ్లారిలోని చారిత్రాత్మక కొండపైనున్న కోటపైకి ఎక్కిన ముగ్గురు బాలురు ఈత కొలనులో పడి మృతి చెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బళ్లారిలోని మిల్లార్ పేటకు చెందిన ఆటో డ్రైవర్ నూర్ కుమారుడు జాఫర్ (15), మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న మస్తానప్ప, మీనాక్షిల కుమారుడు సుప్రీత్ (13), మిల్లార్ పేటకు చెందిన షంషుద్దీన్ కుమారుడు మహమ్మద్ షమిఉల్లా (17) బళ్లారి కొండపైనున్న కోటపైకి వెళ్లారు. కొండపై అటూ, ఇటూ సంతోషంగా తిరుగుతూ ఈత కొలునులో కమలం పువ్వులను పీకేందుకు దిగారు. దీంతో బురదలో ఒక బాలుడు చిక్కుకోవడంతో అతన్ని రక్షించేందుకు వెళ్లిన మిగిలిన ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు కొలునులోని బురదలో ఇరుక్కుని మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న కౌల్‌బజార్ పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఈత నిపుణులను కొలనులో దింపారు. రెండు గంట ల పాటు కొలనులో వెతికి ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికి తీశారు. ముగ్గురూ మిల్లార్‌పేటకు చెందిన వారే కావడంతో ఆ పేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, మాజీ ఎంపీ కేసీ కొండయ్య తదితరులు వెళ్లి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడిపెట్టించింది. ఈ ఘటనపై కౌల్‌బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
బాలిక పై లైంగిక దాడి