
'శారదా'లో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
శారదా నదిలో ఈతకు దిగి గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారి మృతదేహాలను బుధవారం ఉదయం అనకాపల్లి సమీపంలోని తుమ్మలపాలం వద్ద పోలీసులు కనుగొన్నారు. మృతులు పృథ్వీ, మురళీ, అహ్మద్లుగా గుర్తించినట్లు తెలిపారు. మృతులు ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్నారని, విశాఖపట్నం నగరానికి చెందినవారని వెల్లడించారు.
శారదా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు.