Three engineering students
-
ముగ్గురు భావి ఇంజనీర్ల దుర్మరణం
గున్నేపల్లిలో రోడ్డు ప్రమాదం సర్టిఫికెట్లు తీసుకొని వస్తుండగా ఘటన దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గున్నేపల్లి వద్ద రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. బీటెక్ పూర్తిచేసి సర్టిఫికెట్లు తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన యాసా అశోక్‌కుమార్(24) విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. కళాశాల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం ఖమ్మంలో ఉండే స్నేహితులు రావులపాటి ప్రశాంత్(21), మామిడి పవన్‌కుమార్(25), రాజు, అనురాగ్‌తో కలసి 5న కారులో విశాఖపట్టణం వెళ్లారు. అక్కడి నుంచి బుధవారం రాత్రి ఖమ్మం తిరుగుపయనమయ్యూరు. గురువారం ఉదయం గున్నేపల్లి సెంటర్ వద్దకు రాగానే వారి కారును ఎదురుగా వచ్చిన గుజరాత్‌కు చెందిన లారీ ట్యాంకర్ బలంగా ఢీకొంది. దాదాపు 100 మీటర్లకు పైగా కారును ఈడ్చుకువెళ్లింది. ఈ ప్రమాదంలో యాసా అశోక్‌కుమార్ (24), మామి డి పవన్‌కుమార్ (25) అక్కడికక్కడే మృతి చెం దారు. కొన ఊపిరితో ఉన్న రావులపాటి ప్రశాంత్ (21) సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ప్రశాంత్, పవన్‌కుమార్, అశోక్‌కుమార్‌లు, తీవ్రంగా గాయపడిన రాజు, అనురాగ్‌లు అందరూ ఒకే బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు. మంచి స్నేహితులు. -
'శారదా'లో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
శారదా నదిలో ఈతకు దిగి గల్లంతైన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారి మృతదేహాలను బుధవారం ఉదయం అనకాపల్లి సమీపంలోని తుమ్మలపాలం వద్ద పోలీసులు కనుగొన్నారు. మృతులు పృథ్వీ, మురళీ, అహ్మద్‌లుగా గుర్తించినట్లు తెలిపారు. మృతులు ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్నారని, విశాఖపట్నం నగరానికి చెందినవారని వెల్లడించారు. శారదా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. -
ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు
-
ర్యాగింగ్ కేసులో ముగ్గురు విద్యార్థులు అరెస్ట్
పార్మసీ విద్యార్థి శ్రావణ్ కుమార్‌పై ర్యాగింగ్ చేసిన కేసులో ముగ్గురు సీనియర్ విద్యార్థులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రొబిహెషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అండ్ ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం... నగర శివారులోని దిండిగల్‌లోని ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో కొత్తగా శ్రావణ్ కుమార్ పార్మసీ కోర్సులో చేరాడు. అయితే అదే కాళాశాలలో ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సీనియర్ విద్యార్థులు సురేష్ బాబు, ఎం బాను ప్రకాశ్, ఎం హేమంత్లు ర్యాగింగ్ చేశారు. అ క్రమంలో శ్రావణ్ వారికి ఎదురు తిరిగాడు. దాంతో సీనియర్ విద్యార్థులు శ్రావణ్‌పై దాడి చేశారు. దాంతో శ్రావణ్ తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్యకు యత్నించాడు. ఆ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు శ్రావణ్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే శ్రావణ్ ఆత్మహత్యకు యత్నించాడన్న విషయం తెలుసుకున్న సీనియర్ విద్యార్థులు పరారయ్యారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.