- గున్నేపల్లిలో రోడ్డు ప్రమాదం
- సర్టిఫికెట్లు తీసుకొని వస్తుండగా ఘటన
దమ్మపేట: ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం గున్నేపల్లి వద్ద రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. బీటెక్ పూర్తిచేసి సర్టిఫికెట్లు తీసుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన యాసా అశోక్‌కుమార్(24) విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. కళాశాల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవడం కోసం ఖమ్మంలో ఉండే స్నేహితులు రావులపాటి ప్రశాంత్(21), మామిడి పవన్‌కుమార్(25), రాజు, అనురాగ్‌తో కలసి 5న కారులో విశాఖపట్టణం వెళ్లారు. అక్కడి నుంచి బుధవారం రాత్రి ఖమ్మం తిరుగుపయనమయ్యూరు. గురువారం ఉదయం గున్నేపల్లి సెంటర్ వద్దకు రాగానే వారి కారును ఎదురుగా వచ్చిన గుజరాత్‌కు చెందిన లారీ ట్యాంకర్ బలంగా ఢీకొంది. దాదాపు 100 మీటర్లకు పైగా కారును ఈడ్చుకువెళ్లింది.
ఈ ప్రమాదంలో యాసా అశోక్‌కుమార్ (24), మామి డి పవన్‌కుమార్ (25) అక్కడికక్కడే మృతి చెం దారు. కొన ఊపిరితో ఉన్న రావులపాటి ప్రశాంత్ (21) సత్తుపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ప్రశాంత్, పవన్‌కుమార్, అశోక్‌కుమార్‌లు, తీవ్రంగా గాయపడిన రాజు, అనురాగ్‌లు అందరూ ఒకే బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు. మంచి స్నేహితులు.