గుంటూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో పులిచింతల ప్రాజెక్టుకు ఆదివారం భారీగా నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో పరిసర ప్రాంతాల్లోని కోళ్లురు, పులిచింతల గ్రామాలు పూర్తిగా జలమయం అయ్యాయి. . చిట్యాల, చిట్యాల తండా, బోదనం గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో సదరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయిర్లో ప్రస్తుతం నీటి నిల్వ 10.40 టీఎంసీలుగా ఉంది.