చింతూరు: తూర్పుగోదావరి జిల్లా చింతూరులో శబరి నదిలో స్నానానికి దిగిన ఇద్దరు ఆదివారం గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన షేక్ సలార్ (40), పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన షేక్ ముల్లా (18) చింతూరులో బంధువుల వివాహానికి వచ్చారు.
ఆదివారం చింతూరులోనే ఉన్న శబరి నదిలో స్నానానికి దిగగా కొట్టుకుపోయారు. వారి కోసం పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు.