
సాక్షి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం వద్ద చెరువులోకి ఈతకు దిగిన నలుగురు విద్యార్థులు గల‍్లంతయ్యారు. ఆదివారం సెలవు రోజు కావడంతో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు సరదాగా ఈత కొట్టేందుకు చెరువులోకి దిగారు. అయితే వారి జాడ తెలియట్లేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున‍్న పోలీసులు చెరువు వద‍్దకు వెళ్ళి పరిశీలించారు.
చెరువు గట్టుపై రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన పుస‍్తకాలు, బట‍్టల బ్యాగులు ఉండటాన్ని గుర్తించారు. ఈతకు గిది గల‍్లంతైన విద్యార్థులు ఏలూరులోని రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులేనని నిర్ధారించారు.
గల‍్లంతైన నలుగురు విద్యార్థులను హరికృష‍్ణరాజు, విజయశంకర్, ఎఎస్‌కే పరశురామ్, కోట సాయిగా పోలీసులు గుర్తించారు. అయితే కోట సాయి (ఈసీఈ, రెండవ సంవత్సరం) మృతదేహం మాత్రం నీటిపై తేలింది. మిగిలిన ముగ్గురి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


