ఉప్పల్: గృహ నిర్మాణం కోసం తవ్విన ఓ గుంత ఇద్దరు బాలుర ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఉప్పల్ న్యూశాంతినగర్‌లో ఉంటున్న వెంకటరావు కొడుకు రేవంత్(13), సత్యానగర్ కాలనీలో ఉంటున్న పోలెపల్లి స్వామి కుమారుడు మనోహర్(14)లు 8, 7వ తరగతులు చదువు తున్నారు. ఆదివారం వీరిద్దరు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి హెచ్‌ఎండీఏ బగాయత్ లేఅవుట్‌లో ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ సుందర్‌రావు తమ ఇంటి భూమి పూజకు 15 అడుగుల వరకు గోతిని తవ్వి వదిలేశారు. అందులో నీళ్లు ఊరాయి.
ఆ ప్రాంతానికి ఆడుకోవడానికి వెళ్లిన రేవంత్, మనోహర్‌లు బంతి నీళ్లలో పడటంతో గుంతలోకి దిగారు. నీరు ఉండటంతో ఇద్దరు మునిగిపోయారు. బయట ఉన్నవారు బాలుర తల్లిదండ్రులకు తెలిపారు. బాలురిద్దరిని బయటకు తీసి గాంధీ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు తో యాజమానులపై కేసు నమోదు చేశారు. ఐఫోకస్ ఎన్జీవో సభ్యులు శ్రీహరి, భరత్‌సింగ్, మైత్రి అసోసియేషన్ సభ్యులు వినోద్ యాదవ్, శేఖర్‌ఇవాన్, వేంకటేశ్వర శర్మ, రవిచందర్, ఉమామహేశ్వర్‌లపై కేసు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment