నమ్మకం మనిషి ఎదుగుదలకు సాయపడాలే తప్ప ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో నమ్మకాలను మూడనమ్మకాలుగా మార్చుతున్నారు. విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమతోపాటు ఇతురల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మూఢ నమ్మకం పేరుతో జరిగిన అలాంటి ఓ అమానవీయ ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అనారోగ్యం బారిన పడిన కొడుకుని నయం చేసేందుకు తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది.
ఢిల్లీకి చెందిన కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లాడి తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలను నమ్మి పిల్లవాడిని హరిద్వార్ తీసుకెళ్లలనుకున్నారు. అక్కడి గంగ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగి బాలుడి ఆరోగ్యం కుదుటపడుందని గుడ్డిగా విశ్వసించారు. అనుకున్నది పనిగా బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాలుడు.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది.
చదవండి:మార్కులు తక్కువ వచ్చాయని...
హరిద్వార్‌లోని హర్‌కీ పౌరికి వద్దకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరిచినా పట్టించుకోకుండా గంగంలో పదేపదే ముంచాడు. బాధతో కొడుకు అల్లాడుతుంటే ఆ తల్లి మాత్రం వెకిలి నవ్వుతో ‘ నా పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది నా వాగ్దానం’ అంటూ చెబుతోంది. చివరికి ఊపిరాడక చిన్నారి నీటిలోనే చనిపోయాడు.
ఈ దృశ్యాలను ఘాట్‌కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. అనంతరం అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘాట్ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హర్ కీ పైరీ ఎస్‌హెచ్ భావన కైంతోలా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment