Alia Bhatt Ranbir Kapoor Welcomes First Child After 2 Months Of Wedding - Sakshi
Sakshi News home page

Alia Bhatt Ranbir Kapoor: తల్లిదండ్రులు కాబోతున్న అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌

Published Mon, Jun 27 2022 11:45 AM | Last Updated on Mon, Jun 27 2022 1:47 PM

Alia Bhatt Ranbir Kapoor Welcomes First Child After 2 Months Wedding - Sakshi

బాలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌లు వివాహ బంధంతో ఒక్కటై రెండు నెలలకుపైగా అవుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ ఇల్లు బాంద్రాలోని వాస్తులో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరు వివాహం చేసుకున్నారు. ఐదేళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఏప్రిల్‌ 14న పెళ్లి పుస్తకమనే కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు ప్రేమజంటగా, భార్యాభర్తలుగా అనుభూతి చెందిన రణ్‌బీర్‌-అలియా తాజాగా మరో కొత్త మధురానుభూతిని ఆస్వాదించనున్నారు. 

అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని అలియా భట్‌ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఆస్పత్రిలో స్కానింగ్‌ చేసుకున్న ఫొటోలను అలియా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. త్వరలో పాపాయి రాబోతున్నట్లు క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అలియాకు ప్రెగ్నెన్సీ కావడంతో సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

చదవండి: హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌..
మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement