Superstitious beliefs
-
ఘోరం: కేన్సర్ చిన్నారిని గంగలో ముంచి..
నమ్మకం మనిషి ఎదుగుదలకు సాయపడాలే తప్ప ప్రాణాల మీదకు తీసుకురాకూడదు. ప్రస్తుత సమాజంలో నమ్మకాలను మూడనమ్మకాలుగా మార్చుతున్నారు. విశ్వాసాల పేరుతో మానవత్వాన్ని మరచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తమతోపాటు ఇతురల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మూఢ నమ్మకం పేరుతో జరిగిన అలాంటి ఓ అమానవీయ ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అనారోగ్యం బారిన పడిన కొడుకుని నయం చేసేందుకు తల్లిందండ్రులు చేసిన ప్రయత్నం అందరినీ ఆగ్రహానికి గురిచేస్తోంది. ఢిల్లీకి చెందిన కుటుంబంలో అయిదేళ్ల చిన్నారి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లాడి తల్లిదండ్రులు మూఢ విశ్వాసాలను నమ్మి పిల్లవాడిని హరిద్వార్ తీసుకెళ్లలనుకున్నారు. అక్కడి గంగ నదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఏదో అద్భుతం జరిగి బాలుడి ఆరోగ్యం కుదుటపడుందని గుడ్డిగా విశ్వసించారు. అనుకున్నది పనిగా బుధవారం ఢిల్లీ నుంచి ట్యాక్సీలో బయల్దేరారు. అప్పటికే అస్వస్థతకు గురైన బాలుడు.. హరిద్వార్‌కు చేరుకునే సమయానికి అతని పరిస్థితి మరింత దిగజారిపోయింది. చదవండి:మార్కులు తక్కువ వచ్చాయని... హరిద్వార్‌లోని హర్కీ పౌరికి వద్దకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు వాగు ఒడ్డున మంత్రాలు పఠించారు. పిల్లవాడిని గంగనాదిలో స్నానం చేయించేందుకు నీటిలో ముంచారు. పసివాడు భయంతో ఏడుస్తూ గట్టి అరిచినా పట్టించుకోకుండా గంగంలో పదేపదే ముంచాడు. బాధతో కొడుకు అల్లాడుతుంటే ఆ తల్లి మాత్రం వెకిలి నవ్వుతో ‘ నా పిల్లవాడు లేచి నిలబడతాడు.. అది నా వాగ్దానం’ అంటూ చెబుతోంది. చివరికి ఊపిరాడక చిన్నారి నీటిలోనే చనిపోయాడు. ఈ దృశ్యాలను ఘాట్‌కు అవతలివైపు ఉన్న ఓ వ్యక్తి తన మొబైల్లో రికార్డ్ చేశాడు. అనంతరం అక్కడ ఉన్నవారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఘాట్ వద్దకు చేరుకునేసరికి పిల్లవాడు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, అత్తను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు హర్ కీ పైరీ ఎస్‌హెచ్ భావన కైంతోలా తెలిపారు. -
పాము కరిస్తే మంత్రం వేశారు!
ఎడపల్లి (బోధన్): సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢ నమ్మకాలు విశ్వసిస్తున్నారు. పాము కరిస్తే వైద్యుడిని సంప్రదించకుండా మంత్రం వేయించుకోవడంతో ఓ వ్యక్తి ప్రాణం పోయింది. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుర్నాపల్లికి చెందిన గంగారెడ్డి (51)కి శనివారం మధ్యాహ్నం ఇంటి వద్ద బాత్రూంలో పాముకాటు వేసింది. దీంతో స్థానికంగా ఉన్న పాము మంత్రం వేసే వారి వద్దకు వెళ్లి మంత్రం వేయించుకున్నాడు. అయితే గంటపాటు పాము మంత్రం వేసే వారి వద్ద ఉంచడంతో పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో గంగారెడ్డిని ఆటోలో నిజామాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో మల్లాపూర్ గండి వద్ద ఆటోలో డీజిల్ అయిపోయింది. మరో ఆటోలోకి ఎక్కించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంగారెడ్డి మృతి చెందాడ -
60 మంది చూస్తుండగానే..ముగ్గురి హత్య..! మూఢనమ్మకాలే..
జగిత్యాల క్రైం: పాత పగలు పడగ విప్పాయి. మూఢనమ్మకాలు తోడయ్యాయి. తండ్రి, ఇద్దరు కుమారులను పొట్టన పెట్టుకున్నాయి. కత్తులు, బరిశెలు పట్టుకుని వచ్చిన ప్రత్యర్థులు.. విచక్షణారహితంగా నరుకుతున్నా అక్కడున్న వారెవరూ ఆపే సాహసం చేయలేకపోయారు. జగిత్యాల జిల్లా టీఆర్‌నగర్ గ్రామంలో గురువారం ఈ దారుణం జరిగింది. కత్తులు, బరిశెలతో ప్రవేశించి: టీఆర్‌నగర్ గ్రామంలోని ఎరుకల సంఘ భవనంలో ఆర్నెల్లకోసారి కుల సంఘం సమావేశం నిర్వహిస్తారు. గురువారం కూడా 40 నుంచి 60 మంది వరకు సమావేశమయ్యారు. కులపెద్దగా వ్యవహరించే జగన్నాథం నాగేశ్వర్రావు, కుమారులు రాంబాబు, రమేశ్, రాజేశ్ హాజరయ్యారు. భేటీ జరుగుతుండగా అదే గ్రామానికి చెందిన వనం దుర్గయ్య, వనం గంగయ్యతో పాటు మరికొందరు కత్తులు, బరిశెలతో లోనికి ప్రవేశిం చారు. వచ్చీరాగానే నాగేశ్వర్రావుపై దాడిచేశారు. అక్కడే ఉన్న రాంబాబు, రమేశ్ అడ్డుకోబోగా వారిపైనా దాడికి దిగారు. ముప్పును గమనించిన రాజేశ్ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితులు వెంబడించినా చాకచక్యంగా తప్పించుకున్నాడు. నాగేశ్వర్రావు(60), అతడి పెద్దకుమారుడు రాంబాబు(35) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చిన్నకుమారుడు రమేశ్ (25)ను పోలీసులు జగిత్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్పీ సింధూ శర్మ, అడిషనల్ ఎస్పీ రూపేశ్, డీఎస్పీ ప్రకాశ్, రూరల్ సీఐ కృష్ణకుమార్ పరిశీలించారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వేములవాడలో ముగ్గురిపై దాడి నెల రోజుల క్రితం వేములవాడ శివారులోని అగ్రహారం గుట్ట వద్ద క్షుద్రపూజలు చేశారనే కారణంతో సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలోని వీరి కులానికి చెందిన కొందరు.. నాగేశ్వర్రావు, అతడి కుమారుడు రాంబాబు, రాజేశ్‌పై దాడి చేశారు. ఈ మేరకు వేములవాడ పోలీస్‌స్టేషన్‌లో అప్పుడు కేసు నమోదైంది. మరోవైపు తండ్రీకొడుకులు సెప్టిక్ ట్యాంక్ వాహనాలు నడిపిస్తుంటారు. వేములవాడలోనూ వీళ్లు వాహనాలు నడుపుతున్నారు. దీంతో తమ వ్యాపారం సాగట్లేదనే ఆగ్రహంతో ఎరుకల కులస్తులు వీరిని అప్పుడు హత్య చేసేందుకు యత్నించగా తండ్రీకొడుకులు తప్పించుకున్నారు. మంత్రాలు, కులంలో పెత్తనం చెలాయిస్తున్నారనేనా? హత్యలకు సంబంధించి ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మంత్రాలు చేస్తున్నారని, కులంలో పెత్తనం చెలాయిస్తున్నారనే కారణంతో కులస్తులు పథకం ప్రకారం ఏకమై నాగేశ్వర్రావు, ఇద్దరు కుమారులను పథకం ప్రకారం అంతమొందించారని అనుమానిస్తున్నారు. వార్డు సభ్యుడిగా ఓడిన నాగేశ్వర్రావు నాగేశ్వర్రావు దాదాపు 20 ఏళ్లుగా కుల సంఘం పెద్దమనిషి కొనసాగుతున్నారు. గతంలో మున్సిపల్ 48వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. -
పొట్టపై కాల్చుకుంటే పిల్లలు పుడతారా?
మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న గిరిజనుడు అనాదిగా వస్తున్న ఆచారం- అడ్డుకోని వైనం రావికమతం, అనకాపల్లి: గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాన్ని సొమ్ముచేసుకుంటున్నాడు ఓనమాలు రాని ఓ గిరిజనుడు. అమ్మవారి విగ్రహం ముందు పొట్టపై వాతలేయించుకుంటే పిల్లలు పుడతారని నమ్మిస్తున్నాడు. పిల్లలు పుట్టని దంపతులకు వాతలే స్తూ వేలల్లో సొమ్ము వెనకేసుకుంటున్నాడు. ప్రసిద్ధి చెందిన కళ్యాణపులోవ జాతరలో పెద్దింటమ్మ ఆలయం వద్ద ప్రతి ఏటా ఈ తతంగం జరుగుతున్నా సంబంధిత అధికారులు గానీ, ఆలయ కమిటీ సభ్యులుగానీ పట్టించుకోవడం లేదు. అమ్మవారి హుండీలో మూడు రోజుల ఉత్సవాల్లో అయిదు వేల రూపాయలు మాత్రమే దక్షిణ రూపంలో వస్తుండగా, వాతలేస్తున్న పూజారికి మాత్రం 30 వేలు పైచిలుకు వస్తుందంటే నమ్మకతప్పదు. పిల్లలు కలుగుతారనే ఆశతో ఎందరో దంపతులు ఆ పూజారి మాటలు నమ్మి కాల్చుకునేందుకు క్యూ కడుతున్నారు. మహాశివరాత్రి సందర్బంగా కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయం వద్ద ప్రతి ఏటా మూడురోజులపాటు తిరునాళ్లు నిర్వహిస్తారు. పలు జిల్లాల నుంచి లక్షకు పైగా యాత్రికులు, భక్తులు వస్తుంటారు. పోతురాజుబాబు దర్శనానంతరం పెద్దింటమ్మవారని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పల్లె గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది సంతానం లేని దంపతులను ఆ ఆలయం వద్ద తిష్ట వేసి కూర్చునే కొత్తెం రాము అనే వ్యక్తి నమ్మించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇనుముతో తయారుచేసిన చిన్నచిన్న శూలాలను దీపంపై వేడిచేసి ఆడవారికి పొట్టపై, మగవారికి వెన్నుపై కాల్చుతున్నాడు. ఒక్కొక్కరి వద్ద రూ.50 గుంజుతున్నాడు. ఈవిధంగా చేస్తే సంతానం కలుగుతుందని నమ్మబలుకుతున్నాడు. సంతానం లేక వేదన చెందుతూ ఉన్న దంపతులు వేలం వెర్రిగా రూ.50 పోతే పోనీ అంటూ కాల్చుకునేందుకు క్యూ కడుతున్నారు. ఏళ్లతరబడి ఈ తతంగం జరుగుతోంది. పెద్దింటమ్మ ఆలయం వద్ద ఉన్న హుండీలో సొమ్ముకు ఆరింతలు వసూలు చేస్తున్నాడు. ఇలా ప్రతి ఏటా జరుగుతున్నా ఎవరూ -
అబ్రకదబ్ర...!
‘‘అబ్రకదబ్ర.. మాయూ లేదు.. మంత్రం లేదు.. హాంఫట్..’’ అనగానే చేతిలో ఉన్న పాలపిట్ట పూలగుత్తిలా.. ఆ తర్వాత కోడిగుడ్డులా మారిపోతుంది.. ఇలాంటి ఇంద్రజాల విన్యాసాలెన్నో మనం చూస్తూనే ఉంటాం.. అబ్బురపడి హర్షధ్వానాలు చేసే ఉంటాం.. మాయాలేదు.. మంత్రం లేదంటూ ఆ ఇంద్రజాలికులు చేసే విన్యాసం గుట్టు విప్పినప్పుడు ఓ ఇంతేనా అని నిట్టూర్చే ఉంటాం. తమ మ్యాజిక్‌లతో ప్రజలను మెప్పిస్తూ మూఢనమ్మకాల గుట్టు విప్పుతూ ప్రజలను, సమాజాన్ని చైతన్య పరిచే ఇంద్రజాలికులు నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నారు.. పశ్చిమబెగాల్కు చెందిన ప్రఖ్యాత ఇంద్రజాలికులు పీసీ సర్కార్ జయంతిని పురస్కరించుకొని సోమవారం జరిగే ప్రపంచ ఇంద్రజాల దినోత్సవంపై ప్రత్యేక కథనం.. - ఇంద్రియూలను మాయచేసే ఇంద్రజాలం - మూఢ నమ్మకాలపై ప్రజలను చైతన్యపరుస్తున్న మెజీషియన్లు - నేడు ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సత్తుపల్లి టౌన్ : మ్యాజిక్ అంటే ఇంద్రజాలం. మానవ ఇంద్రియాలను(చెవి, ముక్కు, కన్ను, చర్మం, నాలుక) పక్కదోవ పట్టించేదే ఇంద్రజాలం. వీధుల్లో పొట్టకూటికోసం చేసే పలు మాయలను గారడీలుగా చెప్పుకుంటాం.. కాషాయ వస్త్రాలు ధరించిన కొందరు ప్రజలను మభ్యపెట్టేందుకు సృష్టించే పలు రకాల వస్తువులను చూసి వారి మహిమగా భావిస్తారు.. ఈ విషయూలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వీటిని ఒక వేదికపై ప్రదర్శిస్తే ఇంద్రజాలం అంటారు. చేతబడులు, బాణామతి, దయ్యాలు, భూతాలు వంటివి ఉండవనే ఈ ఇంద్రజాల ప్రదర్శకులు వారి ప్రదర్శనల ద్వారా నిరూపిస్తారు. వీరు ప్రజలను చైతన్య పరుస్తూనే పలు ప్రభుత్వ పథకాలకు ప్రచారానికి పని చేస్తుంటారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా.. : ప్రేక్షకులను మైమరిపిస్తూ.. మాయాలేదు.. మంత్రం లేదంటూనే గాలిలోనే పూలు పూయించటం ఇంద్రజాలికులకే సొంతం. సాధ్యం కానివాటిని సుసాధ్యం చేస్తూ అబ్బుర పరిచేదే ఇంద్రజాల ప్రదర్శనలు. ఇవి నేటి యాంత్రిక జీవనంలో మనస్సుకు ఉత్తేజాన్ని.. ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ఈ స్పీడ్ యుగంలో ఎన్నో ప్రాచీన కలలు మరుగున పడుతున్నాయి. సైన్స్ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇప్పటికి మూఢవిశ్వాసాలలో కొందరు కొట్టుమిట్టాడుతూనే ఉన్నారు. గగుర్పొడిచే విన్యాసాలు : ఇంద్రజాలికులు ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ప్రేక్షకులు చూస్తుండగానే ఖాళీ చేతుల్లో నుంచి పావురాలు, గొడుగులు సృష్టించటం.. మనిషిమెడలో నుంచి కత్తి గుచ్చటం.. గాలిలోనే టేబుల్‌ను నిలబెట్టడం.. తలపై మంటవెలిగించి టీ తయారు చేయటం.. వంటి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేస్తూ వాటి రహస్యాలను విప్పి చెపుతున్నారు. మనిషిని రెండు ముక్కలు చేయించటం.. ఖాళీ టోపీలో నుంచి కోడిపిల్లలను ఇలా రకరకాల ఇంద్రజాల ప్రదర్శనలతో మెప్పిస్తున్నారు. కానీ తమ శ్రమ, కష్టాలు, ఇబ్బందులు పాలకులకు పట్టడం లేదని ఇంద్రజాలికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, ఇతర ప్రచార కార్యక్రమాలలో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. చైతన్యం తెచ్చేదే ఇంద్రజాలం : ఇప్పటి వరకు 1500లకు పైగా ఇంద్రజాల ప్రదర్శనలు ఇచ్చా. ఈ ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తెస్తున్నాం. మూఢ విశ్వాసాలను పారద్రోలేందుకు కృషి చేస్తున్నాం. నేటి యాంత్రిక జీవ నంలో ఒత్తిడి నుంచి బయటపడటానికి, మానసిక ఉల్లాసానికి మా ప్రదర్శనలు దోహదపడుతున్నాయి. - జుజ్జూరి వెంకటేశ్వర్లు, మెజీషియన్, సత్తుపల్లి ప్రోత్సహించాలి : నేటి సాంకేతిక సమాజంలో విద్యావంతులు కూడా మూఢ నమ్మకాలు నమ్ముతున్నారు. వీరిలో మార్పు తెచ్చేందుకు ఇంద్రజాలం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడే ఇంద్రజాల 2విద్యను అందరు ప్రోత్సహించాలి. ఇంద్రజాలికులను ప్రభుత్వం గుర్తించాలి. - జె.సాయి, సత్తుపల్లి