పొట్టపై కాల్చుకుంటే పిల్లలు పుడతారా?
మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న గిరిజనుడు
అనాదిగా వస్తున్న ఆచారం- అడ్డుకోని వైనం
రావికమతం, అనకాపల్లి: గ్రామీణ ప్రజల మూఢ నమ్మకాన్ని సొమ్ముచేసుకుంటున్నాడు ఓనమాలు రాని ఓ గిరిజనుడు. అమ్మవారి విగ్రహం ముందు పొట్టపై వాతలేయించుకుంటే పిల్లలు పుడతారని నమ్మిస్తున్నాడు. పిల్లలు పుట్టని దంపతులకు వాతలే స్తూ వేలల్లో సొమ్ము వెనకేసుకుంటున్నాడు. ప్రసిద్ధి చెందిన కళ్యాణపులోవ జాతరలో పెద్దింటమ్మ ఆలయం వద్ద ప్రతి ఏటా ఈ తతంగం జరుగుతున్నా సంబంధిత అధికారులు గానీ, ఆలయ కమిటీ సభ్యులుగానీ పట్టించుకోవడం లేదు. అమ్మవారి హుండీలో మూడు రోజుల ఉత్సవాల్లో అయిదు వేల రూపాయలు మాత్రమే దక్షిణ రూపంలో వస్తుండగా, వాతలేస్తున్న పూజారికి మాత్రం 30 వేలు పైచిలుకు వస్తుందంటే నమ్మకతప్పదు. పిల్లలు కలుగుతారనే ఆశతో ఎందరో దంపతులు ఆ పూజారి మాటలు నమ్మి కాల్చుకునేందుకు క్యూ కడుతున్నారు.
మహాశివరాత్రి సందర్బంగా కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయం వద్ద ప్రతి ఏటా మూడురోజులపాటు తిరునాళ్లు నిర్వహిస్తారు. పలు జిల్లాల నుంచి లక్షకు పైగా యాత్రికులు, భక్తులు వస్తుంటారు. పోతురాజుబాబు దర్శనానంతరం పెద్దింటమ్మవారని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పల్లె గ్రామాల నుంచి వచ్చిన కొంతమంది సంతానం లేని దంపతులను ఆ ఆలయం వద్ద తిష్ట వేసి కూర్చునే కొత్తెం రాము అనే వ్యక్తి నమ్మించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇనుముతో తయారుచేసిన చిన్నచిన్న శూలాలను దీపంపై వేడిచేసి ఆడవారికి పొట్టపై, మగవారికి వెన్నుపై కాల్చుతున్నాడు. ఒక్కొక్కరి వద్ద రూ.50 గుంజుతున్నాడు. ఈవిధంగా చేస్తే సంతానం కలుగుతుందని నమ్మబలుకుతున్నాడు. సంతానం లేక వేదన చెందుతూ ఉన్న దంపతులు వేలం వెర్రిగా రూ.50 పోతే పోనీ అంటూ కాల్చుకునేందుకు క్యూ కడుతున్నారు. ఏళ్లతరబడి ఈ తతంగం జరుగుతోంది. పెద్దింటమ్మ ఆలయం వద్ద ఉన్న హుండీలో సొమ్ముకు ఆరింతలు వసూలు చేస్తున్నాడు. ఇలా ప్రతి ఏటా జరుగుతున్నా ఎవరూ