గంగానదిలోని నీటి నాణ్యత గతంలో కన్నా ఎంతో మెరుగుపడింది. నమామి గంగే కార్యక్రమ భాగస్వాములు తెలిపిన వివరాల ప్రకారం గంగానది ప్రక్షాళనలో తాబేళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. గంగానదిలోని వ్యర్థ పదార్థాలను అవి తింటూ, నీటిని పరిశుభ్రపరుస్తున్నాయి. గంగా యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాబేళ్ల సంతానోత్పత్తి పునరావాస కేంద్రం 1980 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 40 వేలకు మించిన తాబేళ్లను పవిత్ర గంగా నదిలో విడిచిపెట్టింది.
తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రం సాయంతో..
కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు గంగానదితో పాటు పలు నదులలోని నీటి స్వచ్ఛతకు, పరిశుభ్రతకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో గంగానది నీటిని స్వచ్ఛంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్, వారణాసి జిల్లాలలోని గంగానదిలో వేల తాబేళ్లను వదలనుంది. దేశంలోనే తొలిసారిగా తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రాన్ని వారణాసిలో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో జన్మించిన తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టనున్నారు. ఇవి గంగానదిని పరిశుభ్రం చేయనున్నాయి.
‘నమామి గంగే’ కార్యక్రమంలో..
నమామి గంగే కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ, భారత వన్యప్రాణుల విభాగం సంయుక్తంగా తాబేళ్లను గంగానదిలో విడిచిపెట్టే పనులను చేపట్టనున్నాయి. నగం కాలిన మృతదేహాలు, విసిరివేసే పుష్పాల కారణంగా గంగానది కలుషితంగా మారుతోంది. ఇటువంటి నీటిని పరిశుభ్రంగా మార్చడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తున్నాయి. తాబేళ్ల సంతానోత్పత్తి, పునరావాస కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త ఆశీష్ పాండ్యా మాట్లాడుతూ గంగానదిలో 2017 నుంచి ఇప్పటి వరకూ మొత్తం 5 వేల తాబేళ్లను విడిచిపెట్టాం. ఈ ఏడాది ఇప్పటివరకూ వెయ్యి తాబేళ్లను విడిచిపెట్టామన్నారు.
ఇది కూడా చదవండి: ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..
Turtles In Varanasi Ganga River: గంగలో వేలకొద్దీ తాబేళ్లను ఎందుకు విడిచిపెడుతున్నారంటే..
Published Wed, Jul 12 2023 1:18 PM | Last Updated on Wed, Jul 12 2023 1:31 PM
Comments
Please login to add a commentAdd a comment