Student Performing Maa Ganga Aarti For 4 Years Passed the NEET Exam - Sakshi
Sakshi News home page

‘నీట్‌’ని క్రాక్‌ చేసిన కాశీ పురోహితుని కుమారుడు.. రోజూ గంగా హారతి ఇస్తూ..

Published Thu, Jun 15 2023 2:00 PM | Last Updated on Thu, Jun 15 2023 2:34 PM

student performing maa ganga aarti for 4 years passed the neet exam - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని కాశీలోగల భాగీరథ ఘాట్‌ వద్ద 2019 నుంచి ప్రతిరోజూ సాయం సమయాన గంగామాతకు హారతి ఇవ్వడంతో పాటు ‘నీట్‌’కు ప్రిపరేషన్‌ కొనసాగించిన విభూ ఉపాధ్యాయ మొదటి ప్రయత్నంలోనే నీట్‌ పరీక్షను క్రాక్‌ చేశాడు. ఈ సందర్భంగా విభు మీడియాతో మాట్లాడుతూ తాను 2019 నుంచి గంగామాతకు సేవ చేస్తున్నానని అన్నారు. 

ఒక వైపు చదువుకుంటూనే మరోవైపు మహాహారతి కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చానని తెలిపారు. ఈరోజు తాను గంగామాత ఆశీర్వాదంతోనే నీట్‌లో ఉత్తీర్ణత సాధించానని తెలిపారు. ఇన్నాళ్లూ గంగామాతకు ఏ విధంగా భక్తశ్రద్ధలతో హారతి ఇచ్చానో అదే విధంగా ఇకపై సమయం దొరికినప్పుడల్లా గంగా మాతకు సేవ చేస్తాననని అన్నారు. ఇలా చేస్తేనే తన మనసుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. 

తాను ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూనే నీట్‌ పరీక్షకు ప్రిపేర్‌ అవుతూ వచ్చానన్నారు. తన విజయంలో తన సోదరుడు హర్షిత్‌ భాగస్వామ్యం కూడా ఉందన్నారు. ఈ సందర్భంగా విభు తల్లి సునీత శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల చదువుసంధ్యలపై దృష్టి పెట్టాలి. అప్పుడే వారు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కేవలం 8 నెలల పాటు సాగించిన కృషితోనే విభు నీట్‌ పరీక్షలో 622 వ ర్యాంకు సాధించాడన్నారు. విభు తండ్రి హరేంద్ర ఉపాధ్యాయ శ్రీ గంగాహారతి సేవా సమితి భాగీరథ ఘాట్‌ సభ్యుడు. కుమారుని విజయం గురించి ఆయన మాట్లాడుతూ గంగామాత కృపతోనే తన కుమారుడు నీట్‌లో ర్యాంకు సాధించాడన్నారు. 

ఇది కూడా చదవండి: ‘సార్‌’ కలను సాకారం చదువుల తల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement