అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు! | Amy Jackson Shares her Newborn Son Picture | Sakshi
Sakshi News home page

అమ్మగా అమీ.. ప్రశంసల జల్లు!

Published Tue, Sep 24 2019 1:08 PM | Last Updated on Tue, Sep 24 2019 1:15 PM

Amy Jackson Shares  her Newborn Son Picture - Sakshi

అమీ జాక్సన్‌ అమ్మయింది. ఇందులో విశేషమేమే లేకున్నా.. అమ్మగా అమీ చేసిన వినూత్న ప్రయత్నం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. తల్లీపాలు బిడ్డకు ఎంత ముఖ్యమో చెప్పడానికి అమీ జాక్సన్‌ తన కొడుక్కి పాలిస్తూ దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలిస్తూ.. తల్లీపాల ఆవశ్యకతను చాటుతూ పెట్టిన ఫొటోపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘యాండ్రియాస్‌.. మా ఏంజెల్‌. ఈ ప్రపంచానికి స్వాగతం’ అని క్యాప్షన్‌ చేస్తూ పాపతో దిగిన ఫొటోను ఆమె షేర్‌ చేశారు. జార్జి పనయొట్టుతో అమీ జాక్సన్‌ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. వీరి నిశ్చితార్థం కూడా అయింది. ఇంకా పెళ్లి కాలేదు. ‘ఎవడు, ఐ, 2.0’ సినిమాల్లో  అమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటించారు. ఇండియాలోని పలు భాషల్లో నటించిన అమీ జాక్సన్‌ హాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేశారు. డాన్సర్‌గా, సింగర్‌గా, నటిగా నిరూపించుకున్న జాక్సన్‌.. సామాజికంగానూ ముందుంటానని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement