నవజాత శిశు సంరక్షణ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
Published Sat, Aug 6 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ)లో పని చేస్తున్న వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి శుక్రవారం ఆస్పత్రిలోని అకాడమిక్ హాల్‌లో యూని సెఫ్ ప్రతినిధులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ బలరాం మాట్లాడారు. అప్పుడే పుట్టిన శిశువులకు మరింత మెరుగైనా వైద్యం అందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు తోడ్పడుతాయన్నారు. తెలంగాణ జిల్లాలో నల్లగొండ, మెదక్ జిల్లాలో పిడియాట్రిక్ విభాగంలో మెరుగైనా వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు నేషనల్ నూయోనెటానలజీ ఫోరం సర్టిఫికేట్‌ను ఎన్‌ఎన్‌ఎఫ్ ప్రదానం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రికి సైతం ఈ సర్టిఫికేట్ అందించే దిశగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఈక్రమంలో ఈనెల 10వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి ఇక్కడి ఎస్‌ఎన్‌సీయూ ప్రమాణాలను పరిశీలిస్తుందని చెప్పారు.
Advertisement