MGM
-
మేయర్ ఫోన్ చేస్తే మాట్లాడవా? నా చాంబర్ ఎదుట30 నిమిషాలు నిల్చో!
ఎంజీఎం: ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తన తండ్రి వృత్తిని కించపరుస్తూ తనను డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు ఆయన చాంబర్ ఎదుట నిల్చోబెట్టాడని కాకతీయ మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న డాక్టర్ వీర ప్రసాద్ ఆరోపించడం కలకలం రేపింది. మనస్తాపానికి గురైన ప్రసాద్ తన పీజీ సీటు వదిలేస్తానని లేఖ రాసి.. తనకు అవమానం జరిగిందంటూ జూడా ప్రతినిధు లకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు విషయం బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సదరు లేఖ, ఫిర్యాదులోని వివరాల ప్రకారం..’’ ఈ నెల రెండో తేదీన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో డ్యూటీలో ఉండగా ఓ రోగి ఛాతీనొప్పితో రావడంతో పరీక్షిస్తున్నాను. సరిగ్గా అదే సమయంలో అటెండర్ ఫోన్ తీసుకువచ్చి మేయర్ మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పగా.. రోగికి వైద్యం అందించగానే మాట్లాడతానని చెప్పాను. వెంటనే ఫోన్ తీసుకోలేదన్న కారణంగా సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్.. నన్ను చాంబర్ దగ్గరికి పిలిపించాడు. నా తండ్రి వృత్తిని పేర్కొంటూ వ్యక్తిగతంగా కించపరిచాడు. డీఎంఓ వచ్చే వరకు 30 నిమిషాలు తన చాంబర్ ఎదుట నిలుచోబెట్టి తీవ్రంగా అవమాపరిచాడు’ అని ఆ లేఖ, ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ చదవడంకంటే పీజీ సీటు వదిలేసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారంతే: ఆర్ఎంఓ శ్రీనివాస్ ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్ ఈ ఘటనపై స్పందించారు. సదరు పీజీ వైద్యుడితో సూపరింటెండెంట్ దురుసుగా ప్రవర్తించలేదని, సాధారణంగా పీజీ విద్యార్థి ఏ స్థాయి నుంచి వచ్చారో అనే కోణంలో ప్రశ్నించారని తెలిపారు. చాంబర్ ముందు 30 నిమిషాలు ఉండమన్నందుకు సదరు విద్యార్థి మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రి కాబట్టి ప్రజాప్రతినిధుల ఫోన్లకు స్పందించాలని చెప్పారే తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని వివరణ ఇచ్చారు. -
‘బలగం’ మొగిలయ్యను పరీక్షించిన ఎంజీఎం వైద్యబృందం
కాశిబుగ్గ: వరంగల్ సంరక్ష సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న ‘బలగం’సినిమాలో నటించి, పాటతో మెప్పించిన మొగిలయ్యను ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం శనివారం పరామర్శించింది. మొగిలయ్య దీన పరిస్థితిపై ‘సాక్షి’లో ఇటీవల ‘ఆపదలో ఉన్నాం.. తోడుగా నిలవండి’ శీర్షికన ప్రచురితమైన మానవీయ కథనానికి రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పందించారు. మొగిలయ్యకు ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని వైద్యబృందం, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ నాయక్‌లు సంరక్ష ఆస్పత్రికి చేరుకొని మొగిలయ్యను పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యసేవల గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మొగిలయ్య గత సెప్టెంబర్ నుంచి రెండు కిడ్నీలు పూర్తిగా పాడై ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చికిత్స పొందుతున్నాడని, ఇటీవల బీపీ, షుగర్ పెరిగి కంటి సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. ఇక్కడ వైద్యసేవలు బాగానే ఉన్నాయని, రోజూ దుగ్గొండి నుంచి రావాలంటే బస్సులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని మొగిలయ్య భార్య కొమురమ్మ తెలిపినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. వచ్చివెళ్లేందుకు అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి మొగిలయ్యకు మంచి వైద్యసేవలు అందుతున్నాయని, మరేమైనా సమస్యలు వస్తే తమ దృష్టికి తీసుకురావాలని, వారి రక్షణకు తెలంగాణ ప్రభుత్వం, తాము సిద్ధంగా ఉన్నామని మొగిలయ్య దంపతులకు సూపరింటెండెంట్ సూచించారు. సూపరింటెండెంట్ వెంట సంరక్ష వైద్యులు డాక్టర్లు మల్లేష్, దినేష్, సంరక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డాక్టర్ నటరాజ్, డాక్టర్ భాస్కర్ ఉన్నారు. -
మృతదేహాలనే మార్చేశారు..
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎం మార్చురీలో సిబ్బంది నిర్లక్ష్యంతో శనివారం అనూహ్య ఘటన చోటు చే సుకుంది. రెండు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో వారు తమ ఇళ్లకు తీసుకెళ్లి మృతదేహాలను చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తమ బిడ్డ చనిపోయాడని రోదించే క్రమంలో పోస్టుమార్టం సిబ్బంది కట్టిన కట్టు విప్పి చూసే సరికి ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే స్థానిక పోలీసుల సహకారంతో ఇరువురు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. వివరాలిలా ఉన్నాయి.. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తానేదార్పలి్లకి చెందిన రాగుల రమేశ్ (33) శుక్రవారం కుటుంబ కలహాలతో పురుగుల మందుతాగి ఎంజీఎంలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో వైద్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన అశాడపు పరమేశ్ (45) నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. దీంతో పరమేశ్ మృతదేహాన్ని సైతం పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. శనివారం పోలీసుల పంచనామా అనంతరం రెండు మృతదేహాలకు ఫోరెన్సిక్ వైద్యులు పో స్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం పూర్తిస్థాయిలో మృతదేహాలకు క ట్టు కట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయి తే మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లి రోదిస్తున్న క్ర మంలో కట్టు విప్పి చూడగా మృతదేహం తమది కా దని భావించిన కుటుంబ సభ్యులు స్థానిక పోలీసు ల సహాయంతో మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మార్చురీ సి బ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఎవరి మృతదేహాలను వారికి అప్పగించారు. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ట్రాన్స్జెండర్లకు ఆరోగ్యమస్తు.. తొలిసారిగా వారి కోసం ఎంజీఎంలో ప్రత్యేక క్లినిక్
సాక్షి, వరంగల్: ట్రాన్స్జెండర్లను సమాజం నేటికీ చిన్నచూపు చూస్తోంది. రీ అసైన్మెంట్ సర్జరీ కారణంగా తరచూ అనారోగ్యం బారినపడుతున్నప్పటికీ వైద్యం పొందడంలోనూ అడుగడుగునా వారికి వివక్ష ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ట్రాన్స్జెండర్లకు ఎదురవుతున్న శారీరక, మానసిక సమస్యలకు చికిత్స అందించేందుకు వరంగల్‌లోని మహత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి ముందుకొచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా వారి కోసం ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి ఈ క్లినిక్‌ను మంగళవారం ప్రారంభించనున్నారు. ఎంజీఎంలోని 133, 134 ఓపీ రూమ్‌లలో ప్రతి మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాన్స్జెండర్లకు ఎంజీఎం ఆస్పత్రి వైద్య సేవలు అందించనుంది. సైకలాజికల్ కౌన్సెలింగ్‌తోపాటు హర్మోనల్ థెరపీ, సెక్స్ రీ అసైన్మెంట్ సర్జరీ, బ్రెస్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్, మ్యాస్టెక్టమీ, హిస్టరెక్టమీ, ప్లాస్టిక్ సర్జరీ, చర్మవ్యాధులు వంటి వాటికి స్పెషలిస్ట్ వైద్యులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తమిళనాడులో ఈ సేవలు అందుతుండగా రాష్ట్రంలో మాత్రం ఎంజీఎం సొంతంగా మొదలు పెడుతోంది. హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు... ఎంజీఎంలో వారానికోరోజే ఈ క్లినిక్‌లో ఓపీ సేవ లు అందనున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చే ట్రాన్స్జెండర్లు ఇబ్బందిపడకుండా ఉండేందుకు ఆస్పత్రి యాజమాన్యం హెల్ప్‌లైన్ నంబర్ 99631 64111ను ఏర్పాటు చేసింది. ఈ నంబర్‌కు ఫోన్‌చేసి పేరు, అనారోగ్య సమస్య చెబితే క్లినిక్ పనివేళల సమాచారం చెబుతారు. ఓపీ సేవ ల్లో ఎస్టీఐ కౌన్సిలర్ కీర్తి సతీశ్‌కుమార్, తెలంగా ణ ట్రాన్స్‌జెండర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఓరుగంటి లైలా, కమ్యూనిటీ మొబిలైజర్ పూర్ణిమారెడ్డి చేదోడువాదోడుగా ఉండనున్నారు. సంపూర్ణ వైద్యసేవలు అందుతాయి.. ఇప్పటికే హెచ్ఐవీ పాజిటివ్ ట్రాన్స్జెండర్లకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ, ఇతర వైద్యసేవలు అందిస్తున్నాం. ఇప్పుడు ఈ క్లినిక్‌తో వారికి సంపూర్ణ వైద్యసేవలు అందినట్టవుతాయి. ఇందుకోసం మా సిబ్బంది కృషి చేస్తారు. – వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
శిశు శోకం: ఏమైందో తెలియదు.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు..
‘ఆకలైనప్పుడల్లా పాలు తాగాను. నువ్విచ్చే ముద్దులతో మురిసిపోయాను. నీ ఒడిలో ఆడుకున్నాను. నీ వెచ్చని స్పర్శతో హాయిగా నిద్రపోయాను. ఏమైందో తెలియదు గానీ.. వీళ్లెవరో నన్నెత్తుకొచ్చారు. అంగట్లో బొమ్మలా.. నన్ను వేరొకరికి అమ్మారు. నాకేదో ప్రాణాంతక వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పడంతో.. తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు నాకే తెలియని లోకమైన శిశుగృహలో ఉన్నాను. నీ ఒడి చేరాలనుంది. నీ చనుబాలు తాగాలనుంది.’ అని ఆ శిశువుల ఆక్రందనలు వింటే అర్థమవుతోంది. తల్లికి దూరమైన ఇద్దరు శిశువులు గుక్క పట్టి ఏడుస్తున్నారు. – సాక్షి, వరంగల్ ఓరుగల్లు కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా సభ్యులు శిశువులను విక్రయిస్తున్నారని ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. శిశువులను సంరక్షించారు. నెలల వయసు లేని ఆ పసిబిడ్డలు ఆక్రందనలు చేస్తున్నా.. తల్లుల ఆచూకీ ఇంకా దొరక్కపోవడం విచారకరం. గత నెల 14న శిశువుల విక్రయ ముఠాను పట్టుకున్నా.. ఇప్పటివరకు ఆ శిశువుల తల్లులెవరో తెలుసుకునే దిశగా ఇంతేజార్గంజ్ పోలీసులు అడుగు ముందుకేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ కేసులో వరంగల్ వాసులు రుద్రారపు స్వరూప, ఓదెల అనిత, విజయవాడ వాసి శారదతోపాటు గుజరాత్, మహారాష్ట్రకు చెందిన అనురాధ అక్షయ్ కోరి, సల్మా యూనిస్ షేక్ అలియాస్ హారతి, పాట్నీ శైలబేన్లను పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించి ఆ శిశువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలుసుకొని వారి వద్దకు చేర్చాల్సి ఉంది. కానీ పోలీసులు ఆ కేసును పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ శిశువులను గుజరాత్, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చామని పట్టుబడిన నిందితులు చెప్పినప్పటికీ పోలీసులు ఆ దిశగా విచారణ చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని ప లువురు విమర్శిస్తున్నారు. తీగ లాగితే.. డొంక కదులుద్ది! వరంగల్ కేంద్రంగా అంతర్రాష్ట అక్రమ రవాణా ముఠా కదలికలున్నాయని పోలీసులకు ఈ అరెస్టుతో తెలిసినా.. వాటి మూలాలను వెలికితీసే దిశగా చొరవ చూపడం లేదు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తే ఇక్కడి లోకల్ ఏజెంట్ల గుట్టు రట్టవుతుంది. ఆశ వర్కర్ స్వరూప, స్వయం సహాయక మహిళా సంఘం లీడర్ అనితతోపాటు ఇతర రాష్ట్ర నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే.. ముఠాకు సంబంధించిన వివరాలు దొరికే అవకాశం ఉంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరిస్తే ముఠా మూలాలు, శిశువుల తల్లులు దొరికే అవకాశం ఉందని పలువురు పేర్కొటున్నారు. -
అమెజాన్ చేతికి ఎంజీఎం
న్యూయార్క్: జేమ్స్‌బాండ్ సినిమాల నిర్మాణ దిగ్గజం ఎంజీఎంను ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 8.45 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. తద్వారా తమ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది. నిత్యావసరాల చెయిన్ హోల్ ఫుడ్స్‌ను 2017లో 14 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత అమెజాన్‌కి ఇదే అతి పెద్ద డీల్. మీడియా రంగంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ వంటి స్ట్రీమింగ్ సేవల సంస్థలతో పోటీపడేందుకు అమెజాన్‌కి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో పేరిట స్ట్రీమింగ్ సర్వీసులు అందిస్తోంది. దీనికి నికరంగా ఎంత మంది యూజర్లు ఉన్నారన్నది వెల్లడించనప్పటికీ .. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్న దాదాపు 20 కోట్ల మందికి ఇది అందుబాటులో ఉంటోంది. ప్రైమ్ వీడియోతో పాటు ఐఎండీబీ టీవీ పేరుతో ఉచిత స్ట్రీమింగ్ సర్వీస్ కూడా అమెజాన్ నిర్వహిస్తోంది. ఎంజీఎం కొనుగోలుతో రాకీ, రోబోకాప్, పింక్ పాంథర్ వంటి పలు హిట్ సినిమాలు, షోలు కంపెనీ చేతికి దక్కుతాయి. అలాగే ఎపిక్స్ అనే కేబుల్ చానల్ కూడా లభిస్తుంది. త్వరలో విడుదలయ్యే జేమ్స్ బాండ్ మూవీ.. ‘నో టైమ్ టు డై’ కూడా ఎంజీఎం నిర్మించింది. మూకీ యుగం నుంచి ఎంజీఎం.. గర్జించే సింహం లోగోతో మూకీ సినిమాల సమయం నుంచి సినీ ప్రేక్షకులకు ఎంజీఎం స్టూడియో చిరపరిచితం. 1924లో దీన్ని ఏర్పాటు చేశారు. సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి అనేక క్లాసిక్ సినిమాలతో పాటు ఇటీవలి షార్క్ ట్యాంక్, ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ బెవర్లీ హిల్స్ వంటి రియాలిటీ టీవీ షోలను ఎంజీఎం నిర్మించింది. మరోవైపు అమెజాన్‌కి కూడా సొంత స్టూడియో ఉన్నప్పటికీ ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి. మార్వెలస్ మిసెస్ మెయిజెల్, ఫ్లీబ్యాగ్ వంటి షోలు అవార్డులు గెల్చుకున్నప్పటికీ చాలా మటుకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. 1995లో ఏర్పాటైన అమెజాన్ ప్రస్తుతం 1.6 లక్షల కోట్ల డాలర్ల దిగ్గజంగా ఎదిగింది. ఆన్లైన్ అమ్మకాల నుంచి అంతరిక్షంలో ఉపగ్రహాల దాకా పంపిస్తోంది. దీంతో కంపెనీ గుత్తాధిపత్యాన్ని తగ్గించడంపై అమెరికా దృష్టి పెడుతోంది. -
249 మంది వైద్య విద్యార్థులపై వేటు
ఎంజీఎం: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల (కేఎంసీ) ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ద్వితీయ, తృతీయ ఏడాది చదువుతున్న 249 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. పరీక్షలు రాసేందుకు శుక్రవారం వారిపై అనర్హత వేటు వేశారు. దీంతో కేఎంసీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తృతీయ సంవత్సరానికి చెందిన 176 మంది ఎస్పీఎం సబ్జెక్టులో, ద్వితీయ సంవత్సరానికి చెందిన 15 మంది ఫార్మకాలజీలో, 18 మంది పథాలజీ, 40 మంది మైక్రోబయాలజీ తరగతులకు సక్రమంగా హాజరుకాలేదు. వారి హాజరు 75 శాతం కంటే తక్కువగా ఉండటంతో పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవగా.. పోలీసులు వారికి నచ్చజెప్పి సామరస్య పూర్వకంగా పరిశీలించుకోవాలన్నారు. విద్యార్థుల విన్నపాన్ని పరిశీలిస్తాం ఆయా విభాగాల్లో విద్యార్థుల హాజరుశాతం తక్కువగా ఉండటం వల్లే పరీక్ష రాసేందుకు అనర్హులుగా ప్రకటించాం. ఈనెల 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. హాజరు శాతంపై ఆయా విభాగాధిపతులతో చర్చించాం. విద్యార్థుల విన్నపాన్ని పరిశీలిస్తాం. విద్యార్థులు ఫీజు చెల్లించి పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ సంధ్య, ప్రిన్సిపాల్, కేఎంసీ -
కేఎంసీ వర్సెస్ ఎంజీఎం
సాక్షి, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రిలోని పోస్టుమార్టం నిర్వహించే మార్చురీకి వచ్చే మృతుల బంధువులకు సమస్యలు తప్పడంలేదు. ఆస్పత్రి అధికారులకు, ఫోరెన్సిక్ వైద్యసిబ్బందికి మధ్య తలెత్తిన వివాదం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఎంజీఎంలో మృతి చెందిన రోగులను పోస్టుమార్టం నిర్వహించే మార్చురీకి పిల్లల విభాగం మీదుగా తరలిస్తారు. అయితే ఆస్పత్రి వెనుకభాగంలో ఉన్న పోస్టుమార్టం విభాగానికి పీడియాట్రిక్ విభాగానికి మధ్య ఓ గేటు ఉంటుంది. బుధవారం ఉదయం ఈ గేటుకు ఫోరెన్సిక్ విభాగం వైద్యనిపుణులు తాళం వేయడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలిచేందుకు బంధువులు మూడు గంటల పాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు చివరకు అంబులెన్స్ సాయంతో మార్చురీకి తరలించారు. అధికారుల నడుమ వివాదం పోస్టమార్టం ప్రాంగణం ఎంజీఎం ఆవరణలో ఉండగా ఇందులో విధులు నిర్వర్తించే వైద్యులకు సంబంధించిన ఫోరెన్సిక్ విభాగం కేఎంసీ పరిధిలో ఉంటుంది. అయితే పోస్టుమార్టానికి అవసరమైన గ్లౌజులు, సిరంజ్‌లు ఇతర సామగ్రి ఎంజీఎం ఆస్పత్రి నుంచే సరఫరా అవుతాయి. మార్చురీలో వసతులు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కేఎంసీ అధికారులదే. ఈ విషయంలో నెలకొన్న వివాదం గేటుకు తాళం వేసే వరకు వచ్చింది. ఎంజీఎం అధికారుల తీరుతోనే తాళం వేశాం పోస్టుమార్టం నిమిత్తం ఉపయోగించే గ్లౌజులు, సిరంజిలు తదితర సామగ్రిని కొన్నేళ్లుగా ఎంజీఎం ఆస్పత్రి అధికారులే సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సామగ్రిని అందించమని కేఎంసీ నుంచి తెచ్చుకోవాలని సోమవారం పేర్కొన్నారు. అంతే కాకుండా పోస్టుమార్టం మీదుగా ఉన్న గేటు కారణంగా అనవసర రాకపోకలు జరుగుతున్నాయి. అలాగే ఈ ప్రాంగణాన్ని మలమూత్ర విసర్జనకు ఉపయోగిస్తుండడంతో తాళం వేశాం.. – రజామ్ ఆలీఖాన్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. మార్చురీ ప్రాంగణానికి హద్దుగా ఉన్న గేటుకు తాళం వేసిన విషయాన్ని కేఎంసీ ప్రిన్సిపాల్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. మార్చురీకి అవసరమున్న గ్లౌజులు అన్ని రకాల వస్తువులు అందిస్తున్నాం. ఫర్నిచర్ విషయంలో మాత్రమే వ్యతిరేకించడం.. ఉన్నతాధికారుల జోక్యంతో గేట్‌కు తాళం తీసాం. – శ్రీనివాస్, సూపరింటెండెంట్ మృతదేహంతో పడిగాపులు మా సోదరి కాలిన గాయాలతో బుధవారం ఉదయం 9 గంటలకు మృతి చెందింది. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాతే మృతదేహాన్ని అప్పగిస్తామన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు మృతదేహంతో గేట్ వద్దే ఉన్నాము. అయినా తాళం తీయలేదు. మట్టెవాడ పోలీసులకు చెప్పిన తర్వాత ఎంజీఎం అధికారులు స్పందించి అంబులెన్స్ ద్వారా పోస్టుమార్టానికి తరలించారు. చివరకు నాలుగు గంటలకు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అప్పగించారు. – రాజు, మృతుడి బంధువు -
జూడాల మీడియా సమావేశాన్ని బహిష్కరించిన పాత్రికేయులు
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ వార్డులో సోమవారం రోగి బంధువులతో జూనియర్ డాక్టర్ మధ్య జరిగిన వివాదంపై మంగళవారం జూనియర్ వైద్యులు ఎంజీఎం సూపరింటెండెంట్ దొడ్డ రమేశ్‌ను కలిసి వివరించారు. సోమవారం ఎంజీఎం సూపరింటెండెంట్‌కు తమ సమస్యలను వివరించడానికి జూనియర్ డాక్టర్లు వచ్చారు. అక్కడే ఉన్న పాత్రికేయుడు ఫొటో తీస్తుండగా జూనియర్ డాక్టర్లు సదరు జర్నలిస్టు ఫోన్ గుంజుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే పరిపాలనాధికారులు, వివిధ విభాగాధిపతులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది. అనంతరం ఇదే విషయాన్ని జూనియర్ డాక్టర్లు కలెక్టర్, పోలీస్ కమిషనర్‌ను కలిసి వివరించారు. సూపరింటెండెంట్‌కు సమస్యలు వివరిస్తున్న జూనియర్ డాక్టర్ల ఫొటోను చిత్రీకరిస్తున్న జర్నలిస్టు ఫోన్‌ను గుంజుకునే వ్యవహారాన్ని నిరసిస్తూ జూనియర్ డాక్టర్ల మీడియా సమావేశాన్ని పాత్రికేయులు బహిష్కరించారు. -
ఎంజీఎంలో రూ. 5కే భోజన పథకం
వరంగల్ అర్బన్: నగరంలోని ఎంజీఎం ఆస్పత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ. 5 కే అన్నపూర్ణ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీ హరి ప్రారంభించారు. ఆస్పత్రిలో చికిత్సి కోసం వచ్చే వారి అటెండెంట్లకు ఈ పథకం లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు మేయర్ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, అరూరి రమేష్, ఎమ్మెల్సీ మురళీధర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీ సుధీర్ బాబు, కలెక్టర్ అమ్రాపాలి కమీషనర్ శృతిఓజా, ఎంజీఎం సూపరెండెంట్ రమేష్ పాల్గొన్నారు. -
వరంగల్ ఎంజీఎంలో నిషేదిత సెలైన్ వాడకం
-
ఎంజీఎంలో నర్సుల ఆందోళన
వరంగల్ అర్బన్: ఎంజీఎం ఆస్పత్రిలో నర్సులు ధర్నాకు దిగారు. అకారణంగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తమను దూషించాడని నిరసనగా.. గురువారం విధులను బహిష్కరించిన నర్సులు ఎమ్మెల్యే వచ్చి క్షమాపణ చెప్పేంతవరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. దీంతో నర్సుల సేవలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ఆస్కార్ చిన్నమ్మి... ఆస్కార్ పెద్దయ్య
ఆస్కార్‌లో ‘ఎక్స్’ చిత్రం కూడా ఉందా?! హిచ్‌కాక్‌కి ఎన్ని ఆస్కార్లు వచ్చాయి? ఆస్కార్‌ను అందుకో కుండానే వెళ్లి ‘పోయిన’వాళ్లెవరు? ఆస్కార్ చిన్నమ్మి ఎవరు? ఆస్కార్ పెద్దయ్య ఎవరు? ఆస్కార్ ఎత్తెంత? ఆస్కార్ వెయిటెంత? ఆస్కార్‌ను అమ్ముకోవచ్చా? నేడు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కొన్ని ఆస్కార్ విశేషాలు. ఆస్కార్ బరువు , పరువు ఆస్కార్ ప్రతిమను డిజైన్ చేసింది ఎం.జి.ఎం. (మెట్రో గోల్డ్విన్ మేయర్) ఆర్డ్ డైరెక్టర్ సెడ్రిగ్ గిబన్స్. సినిమా రీలు మీద ఒక యుద్ధ యోధుడు ఖడ్గం పట్టుకుని నిటారుగా నిలబడినట్టుగా ఆయన డిజైన్ చేశారు. ఆస్కార్ స్టాచుయెట్ (ప్రతిమ) 34 సెంటీమీటర్ల (13.5 అంగుళాలు) పొడవు, 3.5 కేజీల బరువు ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో మెటల్ కొరత ఏర్పడింది. అప్పుడు మూడేళ్ల పాటు ఆస్కార్ ప్రతిమలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యాయి. ప్రారంభంలో ఆస్కార్ ప్రతిమలు బంగారు పూత పూసిన కంచు లోహంతో తయారయ్యేవి. కంచులో రాగి, తగరం మిశ్రమంగా ఉంటాయి. తర్వాత కంచు లోహానికి బదులుగా బ్రిటానియా మెటల్ని వాడడం మొదలుపెట్టారు. తగరం కలిసిన వేరే లోహం అది. ఆ లోహంతో చేసిన ప్రతిమపై మొదట రాగిపూత, దానిపైన నికెల్ పూత, దానిపైన 24 కేరెట్ల బంగారు పూత పూస్తున్నారు. 1982 నుండీ ఆస్కార్ ప్రతిమలను చికాగోలోని ఆర్ఎస్ ఓవెన్స్ అండ్ కంపెనీ తయారు చేసి ఇస్తోంది. ఆ కాంట్రాక్టును ఆ కంపెనీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. విజేతలు తమ ఆస్కార్ ప్రతిమలను అమ్ముకోడానికి లేదని 1950లో నిబంధన విధించారు. ఎవరైనా అమ్ముకోదలిస్తే వేలంలో మొదట అవకాశం అకాడమీకే ఇవ్వాలి. అదీ 10 డాలర్లకు! అన్నట్లు ఆస్కార్ ప్రతిమ తయారీకి అయ్యే ఖర్చు 400 డాలర్లు. -
ఎంజీఎంలో నర్సింగ్ స్టూడెంట్స్ ఆందోళన
వరంగల్ అర్బన్: వరంగల్ ఎంజీఎంలో స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. ఏడాదిన్నరగా స్టైఫండ్ రావటం లేదంటూ నర్సింగ్ విద్యార్థినులు నిరసనకు దిగారు. బుధవారం వారు విధులు బహిష్కరించి ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. తమకు ఉన్న అన్ని సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఎంజీఎంకు ఇద్దరు న్యూరోసర్జన్లు
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద ది క్కుగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రి కి రోడ్డు ప్రమాదంలో తలకు దెబ్బలు తగిలిన బాధితులను తీసుకొస్తే న్యూ రోసర్జన్ వైద్యుల లేమీతో ఇప్పటివరకు హైదరాబాద్‌కు తరలించేవారు. ఆర్థికంగా ఉన్నవారు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించేవారు. అయితే ఇప్పటి నుం చి ఆ బాధలు ఉండవు. ఈ మేరకు పా త విధానానికి స్వస్తి పలుకుతూ ఎం జీఎంకు ప్రభుత్వం ఇద్దరు న్యూరోసర్జ న్ వైద్యులను నియమించింది. ఈ సం దర్భంగా నూతనంగా నియామకమైన న్యూరోసర్జన్ డాక్టర్ రాజ్‌మోహన్, సీనియర్ రెసిండెంట్ మధు బుధవా రం ఎంజీఎం సూపరింటెండెంట్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మెరుగుపడనున్న సేవలు.. ఎంజీఎం సూపర్‌స్పెషాలిటీలో కీలకమైన న్యూరోసర్జన్ వైద్యుల లేమీతో ఎంతో మంది రోగులు సరైన సమ యంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఈ విభాగంలోని రోగులకు కొంత కాలంగా సీనియర్ డాక్టర్ బందెల మోహన్‌రావు వైద్యం అందించేవారు. ప్రాణపాయస్థితిలో ఉన్న రో గులను హైదరాబాద్‌కు తరలించడం తప్పేదీ కాదు. ఈ క్రమంలో వరంగల్ కు చెందిన డాక్టర్ రాజ్‌మోహన్ గతం లో ఎంజీఎం సర్జరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిం చారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి లో న్యూరోసర్జన్ విభాగంలో పీజీ పూ ర్తి చేసి ఎంజీఎంలో సేవలందించేందుకు వచ్చారు. అలాగే సీని యర్ రెసిడెంట్‌గా డాక్టర్ మధు కూడా నియామకమయ్యారు. -
ఎంజీఎంలో గాడి తప్పుతున్న పాలన
పరిపాలనాధికారుల పోస్టులు ఖాళీ ఇబ్బంది పడుతున్న రోగులు ఎంజీఎం : నాలుగు జిల్లాలకు ధర్మాస్పత్రిగా పే రుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో పాలన గాడి తప్పుతోంది. పరిపాలనాధికారులు లేకపోవడం తో సరైన వైద్య సేవలందక ఆస్పత్రికి వచ్చే రో గులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెయ్యి పడకల ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యల పరిష్కారంతోపాటు రోగుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం ముగ్గురు రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్లను కేటాయించింది. అయితే రెండు నెలల క్రితం సివిల్ సర్జన్ ఆర్ఎంఓ–1 నాగేశ్వర్రావు ఉద్యోగ విరమణ పొందడంతోపాటు బుధవారం డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంఓ–2 హేమంత్ కూడా ఉద్యోగ విరమణ చేశారు. విధుల్లో ఉండాల్సిన ఆర్ఎంఓ–3 శివకుమార్ సైతం ఎంజీఎం ఆస్పత్రి ఎన్‌బీహెచ్ సర్టిఫికేషన్ పొందడమే లక్ష్యంగా కలెక్టర్ ఆదేశాల మేరకు పుట్టపర్తి వెళ్లారు. దీంతో గురువారం ఆస్పత్రిలోని ఆర్ఎంఓ కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. సూపరింటెండెంట్ కరుణాకర్‌రెడ్డికి సైతం అదనంగా హెల్త్ యూనివర్సిటీ వీసీ బాధ్యతలు అప్పగించడంతో ఆయన గురువారం పలు పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. పరిపాలన విభాగంలో అధికారులు ఎవరు లేకపోవడంతో పలు వార్డుల సామగ్రి సరఫరాకు సంబంధించిన సంతకాలను ఓ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్‌తో చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫోన్ ఎత్తని డ్యూటీ ఆర్‌ఎంఓలు.. ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు పీఆర్ఓలు ఉండేవారు. పీఆర్ఓ పోస్టులకు ప్రభుత్వం నుంచి ఎ లాంటి అనుమతి లేదని గతంలో నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పేర్కొనడంతో వారిని విధుల నుంచి తొలగించారు. అయితే ఆస్పత్రిలోని రోగుల వివరాలను తెలి యజేసేందుకు డ్యూటీ ఆర్‌ఎంఓలు స్పందిస్తార ని అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికారులు సభ్యులకు హామీ ఇచ్చారు. 9490611938 నం బర్కు కాల్చేసే ్తడ్యూటీ ఆర్ఎంఓగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఫోన్ ఎత్తడం లేదని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఆస్పత్రి పరిపాలనాధికారులతోపాటు ఆయా విభాగాధిపతులు ఫోన్ చేస్తేనే స్పందించడం ఆనవాయితీగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎంజీఎం ఆస్ప త్రిలో పాలనను గాడిలో పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
నవజాత శిశు సంరక్షణ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం (ఎస్ఎన్సీయూ)లో పని చేస్తున్న వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి శుక్రవారం ఆస్పత్రిలోని అకాడమిక్ హాల్లో యూని సెఫ్ ప్రతినిధులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ బలరాం మాట్లాడారు. అప్పుడే పుట్టిన శిశువులకు మరింత మెరుగైనా వైద్యం అందించేందుకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు తోడ్పడుతాయన్నారు. తెలంగాణ జిల్లాలో నల్లగొండ, మెదక్ జిల్లాలో పిడియాట్రిక్ విభాగంలో మెరుగైనా వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు నేషనల్ నూయోనెటానలజీ ఫోరం సర్టిఫికేట్‌ను ఎన్ఎన్ఎఫ్ ప్రదానం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రికి సైతం ఈ సర్టిఫికేట్ అందించే దిశగా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఈక్రమంలో ఈనెల 10వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం ఎంజీఎం ఆస్పత్రికి వచ్చి ఇక్కడి ఎస్ఎన్సీయూ ప్రమాణాలను పరిశీలిస్తుందని చెప్పారు. -
ఎంజీఎంలో ఔషధాల శాంపిల్స్ సేకరించాం..
డ్రగ్ కంట్రోల్ డీడీ సురేంద్రనాథ్ సాయి ఎంజీఎం : నాసిరకమైన ప్రాలీడాక్సైమ్ ఐడెడ్ ఇంజక్షన్ శాంపిల్స్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో సోమవారం సేకరించామని డ్రగ్ కంట్రో ల్ డీడీ సురేంద్రనాథ్ సాయి తెలిపారు. అంతేకాకుండా అనుమానంగా ఉన్న మరికొన్ని ఔషధా ల శాంపిల్స్ సైతం సేకరించినట్లు ఆయన పే ర్కొన్నారు. స్థానికంగా కొనుగోలు చేస్తున్న డైక్లోపెనాక్స్ సోడియం మాత్రలు, సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి సరఫరా అవుతున్న ఎమాక్సిలిన్ పోటాషియం క్లావలోలేట్ మాత్రలు, ఇంజక్షన్‌తో పాటు రాణిటిడిన్, మాత్రాల శాంపిల్స్‌ను సేకరించామని తెలిపారు. వీటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ఔషధ నియంత్రణ పరీక్ష కేంద్రానికి పంపిస్తున్నట్లు ఆయన వివరించారు -
ఎంజీఎంలో మరో నాసిరకం ఔషధం?
- ప్రాలీడోక్సైజ్ క్లోరైడ్ ఇంజక్షన్ లో ఫంగస్..! ఎంజీఎం: ప్రభుత్వాస్పత్రులకు టీఎస్ ఎంఎస్ఐడీసీ ద్వారా సరఫరా చేస్తున్న ఔషధాలలో నాసిరకమైనవి సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు సద్దుమణగకముందే ఆదివారం ఎంజీఎం ఆస్పత్రిలో మరో ఔషధంలో ఫంగస్ వచ్చినట్లు సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో డ్రగ్ అధికారులు ఆదివారం రాత్రి శాంపిల్స్ సేకరించారు. క్రిమిసంహారక మందు తాగడంతో పాటు ఏదైనా విషం తాగి కొట్టుమిట్టాడుతున్న రోగులకు అందించే ప్రాలీడోక్సైజ్ క్లోరైడ్ ఇంజక్షన్‌లో ఫంగస్ వచ్చినట్లు వైద్యసిబ్బంది గుర్తించారు. అయితే, ఈ విషయాన్ని ఎంజీఎం పరిపాలనాధికారులు వెలుగులోకి రాకుండా జాగ్ర త్తలు తీసుకోగా, విషయాన్ని రోగులు వెలుగులోకి తీసుకొచ్చారు. దీంతో అధికారులు ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఎంజీఎంకు వచ్చారు. ఫార్మాసిస్టులు అందుబాటులో లేకపోవంతో డ్రగ్ అధికారులు శాంపిల్స్ సేకరించడానికి రెండు గంటల సమయం పట్టింది. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి సరఫరా అరుున 1604502 బ్యాచ్‌కు చెందిన ప్రాలీ డోక్సైమ్ క్లోరైడ్ ఇంజక్షన్‌లో ఫంగస్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో రోగులకు ఈ బ్యాచ్ ఇంజక్షన్లు అందించవద్దని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఎంజీఎం ఫార్మాసిస్టులను అదేశించారు. ఔషధ నియంత్రణ శాఖ జేడీ అమృతరావు, డీడీ సురేంద్రనాథ్సాయి అదేశాల మేరకు వీటి శాంపిల్స్‌ను పరిశీలిస్తున్నామన్నారు. -
ఎంజీఎంలో త్వరలో ఆన్లైన్ సేవలు
ఆదర్శంగా జిల్లాలోని రెండు సీహెచ్‌సీ, ఐదు పీహెచ్‌సీలు మంత్రి లక్ష్మారెడ్డికి వివరించిన కలెక్టర్ ఎంజీఎం : నాలుగు జిల్లాలకు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎంకు వచ్చే రోగుల వివరాలను నమోదు చేయడంతో పాటు ప్రతీ రికార్డు అందుబాటులో ఉండేలా వైద్యసేవలను కంప్యూటరీకరించేందుకు త్వరలో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామ ని కలెక్టర్ వాకాటి కరుణ మంత్రి లక్ష్మారెడ్డికి వి వరించారు. ఎంజీఎంతో పాటు సీకేఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆమె బుధవారం మంత్రి దృష్టికి తెచ్చారు. ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్(ఎన్బీఏహెచ్) ర్యాంకు సాధించేలా సేవలు మెరుగుపర్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. 1200 పడకల ఆస్పత్రిలో మెకానిజం లాండ్రీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎంజీఎంకు వచ్చే రోగుల సంఖ్య ను తగ్గించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రిలయన్స్ పౌండేషన్ ప్రతినిధుల సహాయం తో జిల్లాలో రెండు సీహెచ్‌సీలు, ఐదు పీహెచ్‌సీలను మోడల్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దేలా ప్ర ణాళిక సిద్ధం చేశామని వివరించారు. అక్కడి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు. 104లో జీపీఆర్ఎస్ సిస్టమ్.. జిల్లాలో 104 వాహనాల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఈ వాహనాలను సక్రమంగా విని యోగించుకుంటే గ్రామాల్లో పేదలకు మెరుగైన సేవలందించవచ్చని కలెక్టర్ మంత్రికి వివరించారు. 104ల్లో జీపీఆర్ఎస్ సిస్టమ్‌ను అందుబాటులో తెస్తే.. అవి రోజూ ఏయే గ్రా మాల్లో సేవలందిస్తున్నాయో తెలుసుకోవచ్చ న్నారు. సీకేఎం ఆస్పత్రిలో అదనపు భవన ని ర్మాణం అవసరమని, అక్కడ సిబ్బంది పోస్టు లు భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎంజీఎం, సీకేఎంల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంజీఎం పిడియాట్రిక్ విభాగంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న మాతశిశు కేంద్ర భవనాన్ని మంత్రి పరి శీలించారు. పలువురు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి చికిత్స ఎలా అందుతుందో ఆరా తీశారు. కార్యక్రమంలో వీసీ కరుణాకర్‌రెడ్డి, సీకేఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు -
రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు
వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలం ముల్లకట్ట సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో పదిమంది గాయాలపాలయ్యారు. ఇసుక లారీ, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొని ట్రాక్టర్‌లోని పదిమంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
ఎంజీఎం నర్సింగ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
వరంగల్: వరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్లో పుడ్ పాయిజన్ అయింది. విషాహారం తిని 30 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుడ్పాయిజన్కు గల కారణాలు తెలియరాలేదు. -
కన్నతండ్రిపై కత్తిదూసిన కుమారుడు
ఓ యువకుడు కన్నతండ్రిపై కత్తిదూశాడు. ఈ ఘటనలో వృద్ధుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మూడెత్తుల తండాలో ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన శ్రీనివాస్ (30) ఏ పనీ పాటా లేకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ విషయమై మంగళవారం ఉదయం బాణోతు రాములు కుమారుడ్ని ప్రశ్నించాడు. ఆగ్రహంతో శ్రీనివాస్ కత్తితో చేయడంతో రాములుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
హేల్ప్ ప్లీజ్
ఎంజీఎంలో హెల్ప్‌లైన్ లేక అవస్థలు క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షణ సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం రోగుల అవస్థలు హన్మకొండ : సారూ.. 23వ నంబరు ఎక్కడ? అన్నా.. ఆర్ధోపెడిక్ డాక్టరు ఏడుంటడు? అయ్యూ.. రక్త పరీక్ష జేయించుకోవాల్నంటే ఏడికి పోవాలే? అక్కా.. మందులెక్కడిత్తరు.. బిడ్డా.. జర లేవరాదు.. కాళ్లు నొప్పెడుతన్నయి.. కొంచేపు కూసుంట..! ఇవి తెలంగాణ రాష్ట్రంలోని రెండో పెద్దాస్పత్రి అరుున మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్(ఎంజీఎం)లో నిత్యం వినిపించే మాటలు.. ఎంజీఎంకు వచ్చే రోగులకు, వారి సహాయకులకు సమాచారం కొరవడింది. ప్రధానంగా హెల్ప్‌లైన్ లేకపోవడమే. హెల్ప్‌డెస్క్ అవసరం మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు జిల్లాతోపాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఇందులో ప్రధానంగా గ్రామీణులు, ని రక్షరాస్యులు, వయసుపైబడిన వారు ఉంటారు. ఎం జీఎంలో వీరి రోగానికి సంబంధించిన వైద్యుడిని పట్టుకోవడం తలకు మించిన భారం అవుతోంది. ఎ టు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. కాలు, పంటినొప్పి సమస్యల మీద వచ్చే రోగులు జనరల్ ఓపీ వద్దే ఆగిపోతున్నారు. ఒక వేళ ఎవరైనా ఇక్కడ ఉంటారని సూచిస్తే.. ఆ వైద్యులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఓపీ విభాగానికి వచ్చిన రోగులు జనరల్ ఓపీ గది వద్ద గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. తీరా జనరల్ ఓపీకి వెళ్లగానే మీ సమస్యకు ఫలానా వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వ చ్చి గంటల తరబడి నిల్చున్న రోగులుకు ఈ సమాధానం పిడుగుపాటుల మారుతోంది. వైద్యుడు దొరికి పరీక్ష చేరుుంచుకుని మందులు రారుుంచుకునే లోపే ఓపీ సమయం ముగిసిపోతోంది. రోగుల ఇబ్బందులు తొలగించేందుకు ఓపీలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయూలని రోగులు కోరుతున్నారు. ఓపీలో రోగుల అవస్థలు.. రోగులు అధిక సంఖ్యలో వచ్చే జనరల్ ఓపీలో సంఖ్యను పెంచాలి. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఓపీలు ఉన్నాయి. వీటిని రెట్టింపు చేయాలి.ఉచితంగా మందులు ఇచ్చే మెడికల్ స్టోర్ ఎదుట కేవలం నాలుగు కౌంటర్లు పని చేస్తున్నాయి. వీటి సంఖ్యను పెంచాలి. నిత్యం రెండు వేల మంది రోగులు, వారి సహాయకులు వచ్చే ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో రోగులు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు లేవు.ఓపీల దగ్గర రద్ది ఎక్కువగా ఉండటంతో సిబ్బంది, సెక్యూరిటీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైద్యుల వద్దకు త్వరగా పంపించేందుకు పైసలు వసూలు చేస్తున్నారు.మందుల దుకాణంలో అన్ని రకాల ఔషధాలు లభించడం లేదు. అదేవిధంగా రోగనిర్ధారణ పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. -
‘సూపర్’ వైద్యసీట్లలో తెలంగాణకు అన్యాయం
ఉస్మానియా, గాంధీ, ఎంజీఎంల్లో జూడాల నిరసన సాక్షి, హైదరాబాద్: సూపర్ స్పెషాలిటీ, బ్రాడ్ స్పెషాలిటీ వైద్య సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని జూనియర్ డాక్టర్ల(జూడా) సంఘం మండిపడింది. రాష్ట్రంలోని నిమ్స్ సహా వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లలో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కే కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ జూడాలు ఉస్మానియా, గాంధీ, వరంగల్‌లోని ఎంజీఎంలలో సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా సూపర్‌స్పెషాలిటీ సీట్లు ఏపీ విద్యార్థులకే దక్కేలా నిబంధనలున్నాయని రాష్ట్ర జూడాల కన్వీనర్ శ్రీనివాస్ విమర్శించారు. ఉస్మానియాలో నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని సూపర్ వైద్య సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణవారికే కేటాయించాలని డిమాండ్ చేశారు.