జూడాల మీడియా సమావేశాన్ని బహిష్కరించిన పాత్రికేయులు | Junior Doctors Who Meet The Collector And CP | Sakshi
Sakshi News home page

కలెక్టర్, సీపీని కలిసిన జూనియర్‌ డాక్టర్లు

Published Wed, Jun 27 2018 2:53 PM | Last Updated on Wed, Jun 27 2018 2:53 PM

Junior Doctors Who Meet The Collector And CP - Sakshi

సూపరింటెండెంట్‌తో చర్చలు జరుపుతున్న జూనియర్‌ డాక్టర్లు 

ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ వార్డులో సోమవారం రోగి బంధువులతో జూనియర్‌ డాక్టర్‌ మధ్య జరిగిన వివాదంపై మంగళవారం జూనియర్‌ వైద్యులు ఎంజీఎం సూపరింటెండెంట్‌ దొడ్డ రమేశ్‌ను కలిసి వివరించారు.

సోమవారం  ఎంజీఎం సూపరింటెండెంట్‌కు తమ సమస్యలను వివరించడానికి జూనియర్‌ డాక్టర్లు వచ్చారు. అక్కడే ఉన్న పాత్రికేయుడు ఫొటో తీస్తుండగా జూనియర్‌ డాక్టర్లు సదరు జర్నలిస్టు ఫోన్‌ గుంజుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే పరిపాలనాధికారులు, వివిధ విభాగాధిపతులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

అనంతరం ఇదే విషయాన్ని జూనియర్‌ డాక్టర్లు కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌ను కలిసి వివరించారు. సూపరింటెండెంట్‌కు సమస్యలు వివరిస్తున్న జూనియర్‌ డాక్టర్ల ఫొటోను చిత్రీకరిస్తున్న జర్నలిస్టు ఫోన్‌ను గుంజుకునే వ్యవహారాన్ని నిరసిస్తూ జూనియర్‌ డాక్టర్ల మీడియా సమావేశాన్ని పాత్రికేయులు బహిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement