యమజీఎం
శ్రీయుత గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి..
విషయం : ఎంజీఎంలో నెలకొన్న సమస్యలపై.. అయ్యూ !
మనిషి ప్రాణాలు నిలిపే దేవాలయంగా భావించి అందరూ నా దగ్గరకు వస్తారు.. ఆపదలో ఆదుకుంటాననే భరోసాతో నా గడప తొక్కుతారు. పాలకుల నిర్లక్ష్యమో.. అధికారులు, వైద్యుల అలసత్వమో.. దీనాస్పత్రిగా మారా.. న్యూరో ఫిజీషియన్, న్యూరో సర్జన్ వైద్యులు లేక కాలం వెళ్లదీస్తున్నా. కేన్సర్ రోగులకు చికిత్స అందించలేక చతికిలపడ్డా.
సరిపడా వెంటిలేటర్లు లేవు.. అస్తవ్యస్తంగా మారిన రక్తపరీక్షలు, ఉచిత మందుల పంపిణీ, అధికారుల వివాదాస్పద నిర్ణయూలు నన్ను కుంగదీస్తున్నారుు. ఆదివారం రాత్రి మీరు మా ఆస్పత్రిలో బస చేస్తున్నారని విన్నా.. డాక్టర్‌గా పేదల అవస్థలు ఏంటో మీకు తెలుసు... తక్షణమే స్పందిస్తారనే ఆశతో ఈ లేఖ రాస్తున్నా.
ఇట్లు
ఎంజీఎం