ఎంజీఎంలో హెల్ప్‌లైన్ లేక అవస్థలు
క్యూలైన్‌లో గంటల తరబడి నిరీక్షణ
సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం
రోగుల అవస్థలు
హన్మకొండ : సారూ.. 23వ నంబరు ఎక్కడ? అన్నా.. ఆర్ధోపెడిక్ డాక్టరు ఏడుంటడు? అయ్యూ.. రక్త పరీక్ష జేయించుకోవాల్నంటే ఏడికి పోవాలే? అక్కా.. మందులెక్కడిత్తరు.. బిడ్డా.. జర లేవరాదు.. కాళ్లు నొప్పెడుతన్నయి.. కొంచేపు కూసుంట..! ఇవి తెలంగాణ రాష్ట్రంలోని రెండో పెద్దాస్పత్రి అరుున మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్(ఎంజీఎం)లో నిత్యం వినిపించే మాటలు.. ఎంజీఎంకు వచ్చే రోగులకు, వారి సహాయకులకు సమాచారం కొరవడింది. ప్రధానంగా హెల్ప్‌లైన్ లేకపోవడమే.
హెల్ప్‌డెస్క్ అవసరం
మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు జిల్లాతోపాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఇందులో ప్రధానంగా గ్రామీణులు, ని రక్షరాస్యులు, వయసుపైబడిన వారు ఉంటారు. ఎం జీఎంలో వీరి రోగానికి సంబంధించిన వైద్యుడిని పట్టుకోవడం తలకు మించిన భారం అవుతోంది. ఎ టు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. కాలు, పంటినొప్పి సమస్యల మీద వచ్చే రోగులు జనరల్ ఓపీ వద్దే ఆగిపోతున్నారు. ఒక వేళ ఎవరైనా ఇక్కడ ఉంటారని సూచిస్తే.. ఆ వైద్యులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఓపీ విభాగానికి వచ్చిన రోగులు జనరల్ ఓపీ గది వద్ద గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. తీరా జనరల్ ఓపీకి వెళ్లగానే మీ సమస్యకు ఫలానా వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వ చ్చి గంటల తరబడి నిల్చున్న రోగులుకు ఈ సమాధానం పిడుగుపాటుల మారుతోంది. వైద్యుడు దొరికి పరీక్ష చేరుుంచుకుని మందులు రారుుంచుకునే లోపే ఓపీ సమయం ముగిసిపోతోంది. రోగుల ఇబ్బందులు తొలగించేందుకు ఓపీలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయూలని రోగులు కోరుతున్నారు.
ఓపీలో రోగుల అవస్థలు..
రోగులు అధిక సంఖ్యలో వచ్చే జనరల్ ఓపీలో సంఖ్యను పెంచాలి. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఓపీలు ఉన్నాయి. వీటిని రెట్టింపు చేయాలి.ఉచితంగా మందులు ఇచ్చే మెడికల్ స్టోర్ ఎదుట కేవలం నాలుగు కౌంటర్లు పని చేస్తున్నాయి. వీటి సంఖ్యను పెంచాలి. నిత్యం రెండు వేల మంది రోగులు, వారి సహాయకులు వచ్చే ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో రోగులు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు లేవు.ఓపీల దగ్గర రద్ది ఎక్కువగా ఉండటంతో సిబ్బంది, సెక్యూరిటీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైద్యుల వద్దకు త్వరగా పంపించేందుకు పైసలు వసూలు చేస్తున్నారు.మందుల దుకాణంలో అన్ని రకాల ఔషధాలు లభించడం లేదు. అదేవిధంగా రోగనిర్ధారణ పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది.
హేల్ప్ ప్లీజ్
Published Sun, Sep 13 2015 4:14 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM
Advertisement