Mahatma Gandhi Memorial Hospital
-
ఆపరేషన్ కోసం తీసుకొస్తే.. మత్తు మందే మింగేసింది
సాక్షి, వరంగల్: చేయి విరిగిన ఎనిమిదేళ్ల బాలుడిని ఆపరేషన్ కోసం తీసుకొస్తే ప్రాణం పోయింది. అధిక మోతాదులో అనస్తీషియా ఇవ్వడంతో చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా లింగానాయక్ తండాకు చెందిన భూక్యా విహాన్(8)కు కుడిచేయి విరిగింది. 4న ఎంజీఎం ఆస్పత్రి ఆర్థో వార్డులో అడ్మిట్ చేశారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆపరేషన్ చేసేందుకు మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో థియేటర్లోకి తీసుకెళ్లారు. అనస్తీషియా ఇవ్వాల్సిన డోస్ కన్నా ఎక్కువ మోతాదులో ఇవ్వడంతో కార్డియాక్ అరెస్టయింది. ఉదయం 10 గంటలకు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లిన వైద్యులు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది బయట వైద్యులను అడిగారు. అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్‌కు సిద్ధం చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చిందని, ఆర్ఐసీయూలో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొద్దిసేపటికి బాబు మృతి చెందినట్లు ప్రకటించారు. దీంతో విహాన్ తల్లిదండ్రులు రోదిస్తూ ఆందోళనకు దిగారు. చదవండి: ప్రాణం తీసిన ప్రేమ పంచాయతీ ప్రత్యక్ష పోస్టుమార్టం: విహాన్ మృతదేహానికి సాయంత్రం 6 గంటల తర్వాత ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడు ఎలా మృతిచెందాడో నిర్ధారణ కావడానికి వీడియో చిత్రీకరణ మధ్య ఫోరెన్సిక్ వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రి 7 గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, విహాన్ మృతి ఘటన వివరాలను వైద్యారోగ్యశాఖ మంత్రి కార్యాలయ సిబ్బంది.. ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కమిటీ వేసి విచారణ చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.. విహాన్ మృతి ఘటనపై విచారణకు అదేశించామని, దీనికోసం ద్విసభ్య కమిటీ వేసినట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని పేర్కొన్నారు. -
ముంబై ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ముంబై: దక్షిణ ముంబైలోని మహాత్మగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐదు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా సమాచారం అందలేదు. -
హేల్ప్ ప్లీజ్
ఎంజీఎంలో హెల్ప్‌లైన్ లేక అవస్థలు క్యూలైన్లో గంటల తరబడి నిరీక్షణ సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం రోగుల అవస్థలు హన్మకొండ : సారూ.. 23వ నంబరు ఎక్కడ? అన్నా.. ఆర్ధోపెడిక్ డాక్టరు ఏడుంటడు? అయ్యూ.. రక్త పరీక్ష జేయించుకోవాల్నంటే ఏడికి పోవాలే? అక్కా.. మందులెక్కడిత్తరు.. బిడ్డా.. జర లేవరాదు.. కాళ్లు నొప్పెడుతన్నయి.. కొంచేపు కూసుంట..! ఇవి తెలంగాణ రాష్ట్రంలోని రెండో పెద్దాస్పత్రి అరుున మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్(ఎంజీఎం)లో నిత్యం వినిపించే మాటలు.. ఎంజీఎంకు వచ్చే రోగులకు, వారి సహాయకులకు సమాచారం కొరవడింది. ప్రధానంగా హెల్ప్‌లైన్ లేకపోవడమే. హెల్ప్‌డెస్క్ అవసరం మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్‌కు జిల్లాతోపాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రోగులు వస్తుంటారు. ఇందులో ప్రధానంగా గ్రామీణులు, ని రక్షరాస్యులు, వయసుపైబడిన వారు ఉంటారు. ఎం జీఎంలో వీరి రోగానికి సంబంధించిన వైద్యుడిని పట్టుకోవడం తలకు మించిన భారం అవుతోంది. ఎ టు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. కాలు, పంటినొప్పి సమస్యల మీద వచ్చే రోగులు జనరల్ ఓపీ వద్దే ఆగిపోతున్నారు. ఒక వేళ ఎవరైనా ఇక్కడ ఉంటారని సూచిస్తే.. ఆ వైద్యులకు సంబంధించి బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ఓపీ విభాగానికి వచ్చిన రోగులు జనరల్ ఓపీ గది వద్ద గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు. తీరా జనరల్ ఓపీకి వెళ్లగానే మీ సమస్యకు ఫలానా వైద్యుడి వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వ చ్చి గంటల తరబడి నిల్చున్న రోగులుకు ఈ సమాధానం పిడుగుపాటుల మారుతోంది. వైద్యుడు దొరికి పరీక్ష చేరుుంచుకుని మందులు రారుుంచుకునే లోపే ఓపీ సమయం ముగిసిపోతోంది. రోగుల ఇబ్బందులు తొలగించేందుకు ఓపీలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయూలని రోగులు కోరుతున్నారు. ఓపీలో రోగుల అవస్థలు.. రోగులు అధిక సంఖ్యలో వచ్చే జనరల్ ఓపీలో సంఖ్యను పెంచాలి. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా ఓపీలు ఉన్నాయి. వీటిని రెట్టింపు చేయాలి.ఉచితంగా మందులు ఇచ్చే మెడికల్ స్టోర్ ఎదుట కేవలం నాలుగు కౌంటర్లు పని చేస్తున్నాయి. వీటి సంఖ్యను పెంచాలి. నిత్యం రెండు వేల మంది రోగులు, వారి సహాయకులు వచ్చే ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంలో రోగులు కూర్చునేందుకు తగిన ఏర్పాట్లు లేవు.ఓపీల దగ్గర రద్ది ఎక్కువగా ఉండటంతో సిబ్బంది, సెక్యూరిటీ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైద్యుల వద్దకు త్వరగా పంపించేందుకు పైసలు వసూలు చేస్తున్నారు.మందుల దుకాణంలో అన్ని రకాల ఔషధాలు లభించడం లేదు. అదేవిధంగా రోగనిర్ధారణ పరీక్షల కోసం బయటకు వెళ్లాల్సి వస్తోంది. -
త్వరలో మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వరంగల్: వైద్య సంబం ధ నియూమకాల కోసం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల(ఎంజీఎం)ను ఆది వారం ఆయన సందర్శించారు. పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి బోధనా ఆస్పత్రుల అధికారులతోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 2006 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ జరగలేదని, దీని వల్ల ఆయాఆస్పత్రుల్లో పెద్దఎత్తున సిబ్బంది కొరత ఉందన్నారు. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేసి ఖాళీల ను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో ఓ రకమైన భావన ఉందని, దీన్ని పోగొట్టేందుకు కృషి చేయూలన్నారు. రాష్ట్ర ప్రభు త్వ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలని సూచించారు. -
రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి
వరంగల్: రైలు ఢీకొని గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నెక్కొండ-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. నెక్కొండ మండలం పెద్దకోర్పోలు గ్రామానికి చెందిన కడారి భీమయ్య(55) గొర్రెలను పట్టాలు దాటించి తను దాటే క్రమంలో రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వరంగల్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమయ్యకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఎంజీఎం ఆస్పత్రి సమస్యలతో..
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు తలమానికంగా నిలుస్తున్న వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రి సమస్యలతో సతమతమవుతోంది. ఏళ్లకేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్లకు అధికారులే తలొగ్గాల్సిన దుస్థితి నెలకొంది. వరంగల్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి రోజుకు వేలాది మంది రోగులు వచ్చే పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాలది కీలక పాత్ర. ప్రధాన గేట్లు, వార్డుల వద్ద రోగులతోపాటు వారి వెంట వచ్చే బంధువులను నియంత్రించాల్సిన బాధ్యత సెక్యూరిటీ సిబ్బందిపై ఉంది. అదేవిధంగా.. ఎప్పటికప్పుడు పరిశుభ్రత చర్యలు చేపట్టడంలో శానిటేషన్ విభాగానిదీ పెద్ద పాత్రే. అలాంటి ప్రధానమైన రెండు విభాగాలు సమస్యలకు నిలయంగా మారారు. నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించలేని పరిస్థితులు తలెత్తగా.. ఏజెన్సీ కాంట్రాక్టర్లదే హవా నడుస్తోంది. పలువురు అధికారుల నిర్లక్ష్యం.. మామూళ్ల జబ్బు ఏజెన్సీలకు వరాలు కురిపిస్తున్నారుు. రోగులకు అత్యవసర సమయూల్లో వైద్య పరికరాలు అమర్చే ‘ఇంప్లాంట్స్’ టెండర్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. టెండర్ల ప్రక్రియ వివాదంగా మారడంపై ఆస్పత్రి వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. అవినీతి అధికారులు కొందరు ధనదాహంతో తప్పులు చేసి.. కాంట్రాక్టర్లు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకునేలా వారికి పరోక్షంగా మేలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. కొందరు ఉద్యోగులు ఏకంగా బినామీ కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎంజీఎం ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో సాగుతున్న పలు పనులు నాసిరకంగా మారాయి. కాంట్రాక్టర్‌కు ఆరేళ్లుగా సెక్యూరిటీ.. ఎంజీఎంలోని సెక్యూరిటీ విభాగం జైహింద్ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఆస్పత్రిలో సుమారు పదేళ్లుగా సదరు కాంట్రాక్టర్ తిష్టవేశాడు. ఆరేళ్లుగా టెండర్ లేకుండానే కోర్టు వివాదాలతో నెట్టుకుంటూ వస్తున్నాడు. టెండర్ల విషయంలో అధికారుల చేసిన తప్పిదాలను ఎత్తిచూపుతూ.. కోర్టుకు వెళ్తూ స్టే తెచ్చుకోవడం సెక్యూరిటీ కాంట్రాక్టర్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ విధంగా ఆస్పత్రిలోని అధికారులను శాసిస్తూ యథేచ్ఛగా టెండర్‌ను కొనసాగిస్తూ వస్తున్నాడు. అంతేకాదు.. ఎంజీఎం సెక్యూరిటీ విభాగ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వ అధికారులకు అప్పగించాలి. కానీ.. ఏడాదిగా సెక్యూరిటీ సూపర్వైజర్ను నియమించకపోవడంతో సదరు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. వేతనాలివ్వకుండా.. ఎంజీఎంలో మూడు విడతల్లో సుమారు 105 మంది సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వర్తించాలి. వీరందరికి ఈఎస్ఐ, ఈపీఎఫ్‌తో కలుపుకుని ఒక్కొక్కరికి రూ.7 వేల వేతనాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తోంది. కాంట్రాక్టర్ మాత్రం ఒక్కొక్కరికి రూ.4 వేలకు మించకుండా వేతనాలిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో బడ్జెట్ రావడం లేదంటూ ఒక్కో సెక్యూరిటీ గార్డుకు సుమారుగా 8 నెలల వేతనం చెల్లించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది.. అటెండెంట్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఫలితంగా రోగుల వెంట వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. ఎంజీఎం రికార్డుల్లో 105 మంది సెక్యూరిటీ సిబ్బందిని చూపిస్తున్నా... వాస్తవంగా 60 మంది సిబ్బందితో పనిచేయిస్తున్నట్లు సమాచారం. మిగిలిన వారికి సంబంధించిన వేతనాన్ని దర్జాగా దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై లేబర్ అధికారులకు ఫిర్యాదు అందినా.. సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకునేందుకు వారు జంకుతున్నట్లు తెలిసింది. శానిటేషన్‌లో తప్పని తిప్పలు బోధన ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్ టెండర్లను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణరుుంచడం పారిశుద్ధ్య కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. సెక్యూరిటీ, శానిటేషన్‌ను ఒకే కాంట్రాక్టర్‌కు ఎలా అప్పగిస్తారని సెక్యూరిటీ కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లడంతో స్టే వచ్చింది. శానిటేషన్ టెండర్ కొలిక్కిరాకపోవడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ పర్యవేక్షణ లో విభాగం కొనసాగుతోంది. అరుుతే.. మెడికల్ విభాగంలో శానిటేషన్ కార్మికుల వేతనాలకు సంబంధించి చిక్కులు వచ్చారుు. పెరిగిన జీతాలకు తగ్గట్టుగా ప్రభుత్వం నుంచి బడ్జెట్‌కు రాకపోవడంతో వారు ఆందోళన బాట పట్టారు. దీంతో పరిపాలనాధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్మికుల ఆందోళనతో చివరకు వారు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, పెంచిన వేతనాలు ఇస్తామనే హామీ ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ‘ఇంప్లాంట్స్’ కొలిక్కి వచ్చేనా? ఎంజీఎం ఆస్పత్రిలో ఇంప్లాంట్స్ టెండర్స్ గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదంగా మారాయి. 4 నెలల క్రితం ఎంజీఎం అధికారులు ఇంప్లాంట్స్‌కు టెండర్లు పిలిచారు. ఇద్దరు కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. ఇందులో కొన్నేళ్లుగా ఆస్పత్రిలో కొనసాగుతున్న కాంట్రాక్టర్‌తోపాటు కొత్తగా మరో కాంట్రాక్టర్ టెండర్ దాఖలు చేశారు. పాత కాంట్రాక్టర్ కంటే టెండర్లలో పాల్గొన్న కొత్త కాంట్రాక్టర్ తక్కువ రేటుకు కోట్ చేశారు. నిబంధనల ప్రకారం ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ టెండర్లు దాఖలైనప్పుడే వీటిని తెరుస్తామని అధికారులు వాయిదా వేశారు. చివరకు జాయింట్ కలెక్టర్ అనుమతితో వీటిని తెరిచారు. ఎక్కువ రేట్ కోడింగ్ చేసిన కాంట్రాక్టర్‌కు 316 ఎల్వీఎం సర్టిఫికెట్ ఉందని పేర్కొంటూ.. కొన్నేళ్లుగా తిష్టవేసిన కాంట్రాక్టర్‌కు టెండర్ కట్టబెట్టేలా పలువురు అధికారులు పావులు కదిపారు. చివరకు ఆ కాంట్రాక్టర్‌కు 316 ఎల్వీఎం సర్టిఫికెట్ లేదని తేలింది. ఈ టెండర్ల ప్రక్రియ వివాదంగా మారి కలకలం రేగడంతో ఎంజీఎం సూపరింటెండెంట్ మొత్తానికే వాటిని రద్దు చేశారు. త్వరలోనే పారదర్శకంగా ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తామని హామీ ఇచ్చారు. కానీ.. 50 రోజులుగా పాత కాంట్రాక్టరుతోనే ఇంప్లాంట్స్ పరికరాలను ఆస్పత్రికి సరఫరా చేయించుకుంటున్నారు. -
కేఎంసీలో ఎంసీఐ తనిఖీ
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలతోపాటు అనుబంధ ఆస్పత్రులైన మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి, రీజినల్ కంటి ఆస్పత్రి, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల్లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) బృందం సభ్యులు సోమవారం పర్యటించారు. గత ఏడాది ఎంసీఐ సభ్యు లు తనిఖీలు నిర్వహించినపుడు కళాశాల పరిధిలో 150 సీట్లలో అదనంగా పెంచిన 50 సీట్లకు సౌకర్యాలు లేవని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు డీఎంఈ పుట్ట శ్రీని వాస్, కేఎంసీ ప్రిన్సిపాల్ రమేశ్ కుమార్ ఢిల్లీలో ఎంసీఐ సభ్యులను కలిసి వసతులు కల్పిస్తామని పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీంతో పెంచిన సీట్లను కొనసాగించేందుకు ఎంసీఐ నిర్ణయించింది. ఈ క్రమంలో కేఎంసీ, అనుబంధ ఆస్పత్రుల్లో ఎంసీ ఐ సభ్యులు దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర), అరుణ్‌వ్యాస్ (అహ్మద్‌బాద్), జేఎం జడేజా (అహ్మద్‌బాద్), సుమన్ బన్సాలీ (జోధ్‌పూర్) తనిఖీ చేశారు. విడివిడిగా పరిశీలనలు కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యవిద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను దేశ్‌ముఖ్, అరుణ్‌వ్యాస్ క్షుణ్ణంగా పరిశీలించారు. మొదటగా ఓపీ విభాగంతోపాటు బ్లడ్‌బ్యాంక్, సెంట్రల్ ల్యాబ్, రెడియోలజీ, అత్యవసర చికిత్స విభాగాలను తనిఖీ చేశారు. అనంతరం ఏఎంసీ, ఐఎంసీ, ఆర్ఐసీయూ, ఐసీసీయూ, మెడికల్, సర్జికల్ వార్డులను సందర్శించారు. రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. మరో ఇద్దరు ఎంసీఐ సభ్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కేఎంసీలో తనిఖీ చేశారు. సీకేఎంతోపాటు జీఎంహెచ్‌లో కూడా తనిఖీలు కొనసాగారుు. సభ్యులు ఆస్పత్రిలోని గైనిక్, పోస్టు ఆపరేటివ్, లేబర్, స్కా నింగ్ గదులను పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి పరిపాలనాధికారులతో సమావేశమై ఆస్పత్రిలోని సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం కేఎంసీలో సిబ్బంది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మొ త్తం 9 గంటలపాటు ఎంసీఐ తనిఖీలు నిర్వహించింది. కాగా, గత ఏడాది కేఎంసీ సీనియర్ రెసిడెన్సీలో సౌకర్యాలు సక్రమంగా లేవని ఎంసీఐ తనిఖీల్లో తేలగా, ఈ లోపాలను సవరించినట్లు అధికారులు తెలిపారు. నేడు డీఎంఈ రాక కళాశాలలో ఎంసీఐ సభ్యులు తనిఖీ లు నిర్వహిస్తున్న సమయంలో జూని యర్ డాక్టర్లు సమ్మెలో ఉండడంతో మెడికల్ సీట్లకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు మంగళవారం డీఎంఈ శ్రీనివాస్... కేఎంసీకి రానున్నారు. -
కడుపులో 40 వస్తువులు
వరంగల్: వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం)లో ఓ రోగికి శస్త్రచికిత్స చేయగా విచిత్రమైన వస్తువులు ప్రత్యక్షమయ్యూరుు. కరీంనగర్ జిల్లా రాగంపేటకు చెందిన సరోజు రమేశ్ మానసిక పరిస్థితి బాగోలేక ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. కడుపునొప్పితో బాధపడుతున్న రమేశ్‌కు డాక్టర్ శ్రీనివాస్, సర్జన్ వైద్యులు శనివారం రాత్రి శస్త్రచికిత్స చేశారు. అతడి కడుపులో నుంచి మేకులు, పెన్సిల్, పెన్నులు వంటి 40 వస్తువులు బయటపడడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. -
తాటికొండ తొలివరం
ఎంజీఎం ఫైలుపై మొదటి సంతకం మాతా శిశు సంరక్షణ వార్డుకు 120 అదనపు పడకల మంజూరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ జిల్లా అభివృద్ధిపై సచివాలయంలో నేడు సమీక్ష సంపూర్ణ సమాచారంతో రావాలని అధికారులకు ఆదేశం సాక్షి, హన్మకొండ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తన సొంత జిల్లాకు తొలి వరమిచ్చారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రిగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వెంటనే జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ స్మారక(ఎంజీఎం) ఆస్పత్రిలో మాతా శిశు సంరక్షణ వార్డుకు 120 అదనపు పడకలను మంజూరు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. రాజయ్య వృత్తిపరంగా పిల్లల వైద్యుడు... కేఎంసీ విద్యార్థి. అంతే కాకుండా తాను విద్యనుభ్యసించిన ఓరుగల్లుపై ప్రధాన దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు తలమానికంగా నిలుస్తున్న ఎంజీఎంలో శిశు మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ముందుకుసాగారు. 58 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఎంజీఎం ఆస్పత్రి క్రమక్రమంగా 650 పడకలుగా అభివృద్ధి చెందింది. 2006లో వేయి పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ అయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందినప్పటికీ ఆ స్థాయిలో వైద్యం అందడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ఉపముఖ్యమంత్రిగా రాజయ్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో నాలుగు జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్యమందించే ఫైలుపై ఆయన తొలిసంతకం చేయడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నారుు. ఉపముఖ్యమంత్రి స్థాయి పదవి జిల్లాకు దక్కడం ఇదే తొలిసారి. దీంతో జిల్లా అభివృద్ధి వేగం పుంజుకుంటుందనే ఆశలు ప్రజల్లో చిగురించాయి. దీనికి తగ్గట్లుగా శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఉపముఖ్యమంత్రి రాజయ్య జిల్లా సమస్యలపై దృష్టి పెట్టారు. రాజకీయాల్లోకి రాక ముందు పిల్లల వైద్యుడిగా దీర్ఘకాలం పాటు ఆయన సేవలు అందించారు. ఇదే సమయంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో పిల్లల వార్డు ఏళ్ల తరబడి సమస్యలతో సావాసం చేస్తోంది. మాతాశిశు సంరక్షణా కేంద్రం ఉన్నప్పటీకీ అత్యాధునిక సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్డులో 50 పడకలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే రోగులకు ఈ పడకలు సరిపోవడం లేదు. వైద్యుడిగా తనకున్న అనుభవం, ఇక్కడి సమస్యలపై అవగాహాన ఉన్న ఉపముఖ్యమంత్రి ఎంజీఎం పిల్లల వార్డుకు 120 పడకలను నూతనంగా మంజూరు చేశారు.అంతేకాదు... అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత 14వ తేదీన ఎంజీఎం ఆస్పత్రి సమస్యలు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎంజీఎంకు మంత్రి రాజయ్య మరో 120 పడకల మాతా శిశుసంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయడంపై ఎంజీఎం సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎఓం నాగేశ్వర్రావు, పిడియాట్రిక్ హెచ్ఓడీ బలరాం హర్షం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సూపర్‌స్పెషాలిటీ సైవలైన కార్డియాలజీ, న్యూరోసర్జన్, న్యూరో ఫిజీషియన్, ఎండ్రోక్రైనాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, వాస్క్యులర్ సర్జన్ వంటి సేవలను అందుబాటులోకి తెస్తానని, ఎంజీఎంను ఎయిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇవ్వడం శుభసూచకమని వారు అన్నారు. నేడు హైదరాబాద్‌లో సమీక్ష తెలంగాణ రాష్ట్ర శాసన సభ తొలి సమావేశాలు జూన్ 9 నుంచి 12 వర కు జరగనున్నాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో రాజయ్య ఈ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అభివృద్ధిపై ఆలస్యం జరగకుండా ఉండాలనే సంకల్పంతో అసెంబ్లీ సమావేశాలకు ముందుగా సెలవు రోజైన ఆదివారం ఆయన జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లా అధికారులు సంపూర్ణ సమాచారంతో హైదరాబాద్ రావాల్సిందిగా ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం, డి బ్లాకులో ఉదయం 11:00 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం నివేదికలు సిద్ధం చేసింది. ఈ సమావేశానికి కలెక్టర్ జి.కిషన్, అదనపు జేసీ కె.కృష్ణారెడ్డి సహా పలు శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. -
ఎంజీఎంలో ఆక్సీజన్ దందారూ35.29 లక్షలు స్వాహా
= రూ. 2 కోట్ల దోపిడీకి అదనం =సిలిండర్ల అద్దె పేరిట మోసం =ఆలస్యంగా తేరుకున్న అధికారులు రోగుల ప్రాణాలు కాపాడే ఆక్సీజన్...ఎంజీఎం ఆస్పత్రిని పీల్చి పిప్పి చేస్తోంది. అధిక ధరతో ఆరేళ్లపాటు అడ్డగోలుగా దోచుకున్న సంబంధిత కాంట్రాక్టర్ అద్దె పేరిట మరో మోసానికి ఒడిగట్టాడు. రూ. 2 కోట్లు చాలవన్నట్లు మరో రూ. 35.29 లక్షలను గుటకాయ స్వాహా చేశాడు. బిల్లులు చెల్లించేటప్పుడు కళ్లు మూసుకున్న అధికారులు చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరించడం కొసమెరుపు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ఉత్తర తెలంగాణలో పెద్దాస్పత్రిగా పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) హాస్పిటల్లో చోటుచేసుకున్న ఆక్సీజన్ సిలిండర్ల దందాలో మరో కోణం వెలుగు చూసింది. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 230కే ఆక్సీజన్ సిలిండర్‌ను సరఫరా చేసిన కాంట్రాక్టర్... ఎంజీఎం ఆస్పత్రికి రూ. 385 చొప్పున అంటగట్టిన వైనం ఇప్పటికే బట్టబయలైంది. ఒక్కో సిలిండర్‌పై రూ. 155 చొప్పున సర్కారుకు నష్టం వాటిల్లింది. ఆరేళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ దందాతో రూ. 2 కోట్లకు పైగా పక్కదారి పట్టాయి. కాంట్రాక్టర్... అందరి కళ్లకు గంతలు కట్టి అడ్డగోలుగా దోచుకున్న బాగోతాన్ని ఈ ఏడాది మే నెలలో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజాగా మరో నిర్వాకం బయటపడింది. ఆక్సీజన్ సిలిండర్లకు అడ్డగోలు రేటు పెట్టిన ఎంజీఎం పాలనా యంత్రాం గం... అదీ చాలదన్నట్లు రోజుకు రూ. 26 చొప్పున అద్దె కూడా చెల్లించింది. దీంతో ఈ కుంభకోణం విలువ మరింత పెరిగింది. ధ్రువీకరించిన ఎంజీఎం సూపరింటెండెంట్ రేటులో గిమ్మిక్కు చేసి... నిండా ముంచిన ఏజెన్సీకి అద్దె పేరిట మ రో రూ. 35.29 లక్షలు అప్పనంగా చెల్లించినట్లు లెక్కతేలడంతో ఏం చే యాలో పాలుపోక ఎంజీఎం అధికారులు తల పట్టుకుంటున్నారు. అక్రమంగా అద్దె పేరిట బిల్లులు తీసుకున్నట్లు తమ దృష్టికి వచ్చిం దని.. భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజనాకు నష్టం వాటిల్లిందని స్వ యానా ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇటీవల సదరు ఏజెన్సీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ఆక్సీజన్ కొనుగోలులో భారీ మొత్తమే పక్కదారి పట్టినట్లు మరోసారి రూఢీ అయింది. 2007 నుంచి చెల్లించిన అద్దె రూ. 35,29,344 ఎంజీఎంలో సగటున రోజుకు 70 నుంచి 80 ఆక్సీజన్ సిలిండర్లు అవసరమవుతాయి. 2007 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఆస్పత్రి రికార్డుల ప్రకారం మొత్తం 1,35,744 సిలిండర్లు సరఫరా అయ్యాయి. 2007-08లో 2,794 సిలిండర్లు, 2008-09లో 11,522, 2009-10లో 20,858, 2010-11లో 36,028, 2011-12లో 35,762, 2012-13లో 28,780 సిలిండర్లు కొనుగోలు చేశారు. హన్మకొండకు చెందిన తులసి ఏజెన్సీ వీటిని సరఫరా చేసింది. వీటికి మొత్తంగా రూ. 35,29,344 అద్దె చెల్లించినట్లు ఆస్పత్రి అధికారులు ధ్రువీకరించారు. బిల్లులు చెల్లించేటప్పుడు కళ్లు మూసుకున్న అధికారులు ఇప్పుడు రికవరీకి తంటాలు పడుతుండడం గమనార్హం. ఆది నుంచీ వివాదాస్పదమే... ఎంజీఎంలో ఆక్సీజన్ కొనుగోలు ముందు నుంచీ వివాదాస్పదంగానే ఉంది. సర్కారు ఆస్పత్రి కావడంతో రేట్లను ఎవరూ పట్టించుకోరనే ధీమాతో సదరు కాంట్రాక్టర్ గిమ్మిక్కులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఆరేళ్ల తర్వాత రేట్లలో ఉన్న తేడా బయటపడడంతో మే నెలలో ఎంజీఎం అధికారులు హడావుడిగా ఫైళ్లు కదిపారు. అప్పటి సూపరింటెండెంట్ రామకృష్ణ ఆస్పత్రిలో అన్ని విభాగాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రూ. 230కే సిలిండర్లను కొనాలని తీర్మానించారు. మౌఖికంగా రేటును తగ్గించేందుకు అంగీకరించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇప్పటికీ పద్ధతి మార్చుకోలేదని... పాత రేటు ప్రకారమే బిల్లులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవధిలోనే సూపరింటెండెంట్ రామకృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. సిలిండర్లకు సంబంధించిన పాత బిల్లులు చెల్లించేందుకు లంచం ఇవ్వాలని వేదిస్తున్నాడంటూ సదరు కాంట్రాక్టర్ ఏసీబీకి సమాచారమిచ్చి రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. దీంతో ఆక్సీజన్ సిలిండర్ల వ్యవహారం తేనెతుట్టెలా తయారైంది. కదిపితే.. ఎవరి మెడకు చుట్టుకుంటుందనే భయాందోళన ఎంజీఎం అధికారులను వెంటాడుతోంది. 3న తెరవనున్న టెండర్లు ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత మేల్కొన్న అధికారులు ఇటీవల ఆక్సీజన్ సిలిండర్ల కొనుగోళ్లకు టెండర్లు పిలిచారు. ఈనెల 13వ తేదీన టెండర్లు తెరువనున్నారు. అరుుతే ఈ సారి ఎంత మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తారు.. మళ్లీ పాత కాంట్రాక్టర్లే రంగంలోకి దిగుతారా... కొత్త ఏజెన్సీల పేరిట... ఎంజీఎంను తమ గుప్పిట్లోకి తీసుకుంటారా... అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రజాధనాన్ని కాపాడుతారా.. వేచి చూడాల్సిందే మరి.