త్వరలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు | Soon Medical Recruitment Board | Sakshi
Sakshi News home page

త్వరలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు

Published Mon, Apr 13 2015 2:53 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

త్వరలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు - Sakshi

త్వరలో మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
వరంగల్: వైద్య సంబం ధ నియూమకాల కోసం మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. వరంగల్‌లోని మహాత్మాగాంధీ స్మారక వైద్యశాల(ఎంజీఎం)ను ఆది వారం ఆయన సందర్శించారు. పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలసి బోధనా ఆస్పత్రుల అధికారులతోపాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 2006 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ జరగలేదని, దీని వల్ల ఆయాఆస్పత్రుల్లో పెద్దఎత్తున సిబ్బంది కొరత ఉందన్నారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డును త్వరలో ఏర్పాటు చేసి ఖాళీల ను భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులపై ప్రజల్లో ఓ రకమైన భావన ఉందని, దీన్ని పోగొట్టేందుకు కృషి చేయూలన్నారు. రాష్ట్ర ప్రభు త్వ విధానాలకు అనుగుణంగా ప్రభుత్వాస్పత్రిలో కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement