ఆస్కార్‌ చిన్నమ్మి... ఆస్కార్‌ పెద్దయ్య | Five facts about Sunday's 89th Annual Academy Awards | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ చిన్నమ్మి... ఆస్కార్‌ పెద్దయ్య

Published Mon, Feb 27 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM

Five facts about Sunday's 89th Annual Academy Awards

ఆస్కార్‌లో ‘ఎక్స్‌’ చిత్రం కూడా ఉందా?!  హిచ్‌కాక్‌కి ఎన్ని ఆస్కార్‌లు వచ్చాయి? ఆస్కార్‌ను అందుకో కుండానే వెళ్లి ‘పోయిన’వాళ్లెవరు? ఆస్కార్‌ చిన్నమ్మి ఎవరు? ఆస్కార్‌ పెద్దయ్య ఎవరు? ఆస్కార్‌ ఎత్తెంత? ఆస్కార్‌ వెయిటెంత? ఆస్కార్‌ను అమ్ముకోవచ్చా? నేడు ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కొన్ని ఆస్కార్‌ విశేషాలు.

ఆస్కార్‌ బరువు , పరువు
ఆస్కార్‌ ప్రతిమను డిజైన్‌ చేసింది ఎం.జి.ఎం. (మెట్రో గోల్డ్విన్‌ మేయర్‌) ఆర్డ్‌ డైరెక్టర్‌ సెడ్రిగ్‌ గిబన్స్‌. సినిమా రీలు మీద ఒక యుద్ధ యోధుడు ఖడ్గం పట్టుకుని నిటారుగా నిలబడినట్టుగా ఆయన డిజైన్‌ చేశారు.


ఆస్కార్‌ స్టాచుయెట్‌ (ప్రతిమ) 34 సెంటీమీటర్ల (13.5 అంగుళాలు) పొడవు, 3.5 కేజీల బరువు ఉంటుంది.

రెండో ప్రపంచ యుద్ధంలో మెటల్‌ కొరత ఏర్పడింది. అప్పుడు మూడేళ్ల పాటు ఆస్కార్‌ ప్రతిమలు ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో తయారయ్యాయి.

ప్రారంభంలో ఆస్కార్‌ ప్రతిమలు బంగారు పూత పూసిన కంచు లోహంతో తయారయ్యేవి. కంచులో రాగి, తగరం మిశ్రమంగా ఉంటాయి. తర్వాత కంచు లోహానికి బదులుగా బ్రిటానియా మెటల్‌ని వాడడం మొదలుపెట్టారు. తగరం కలిసిన వేరే లోహం అది. ఆ లోహంతో చేసిన ప్రతిమపై మొదట రాగిపూత, దానిపైన నికెల్‌ పూత, దానిపైన 24 కేరెట్‌ల బంగారు పూత పూస్తున్నారు.

1982 నుండీ ఆస్కార్‌ ప్రతిమలను చికాగోలోని ఆర్‌ఎస్‌ ఓవెన్స్‌ అండ్‌ కంపెనీ తయారు చేసి ఇస్తోంది. ఆ కాంట్రాక్టును ఆ కంపెనీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది.

విజేతలు తమ ఆస్కార్‌ ప్రతిమలను అమ్ముకోడానికి లేదని 1950లో నిబంధన విధించారు. ఎవరైనా అమ్ముకోదలిస్తే వేలంలో మొదట అవకాశం అకాడమీకే ఇవ్వాలి. అదీ 10 డాలర్లకు! అన్నట్లు ఆస్కార్‌ ప్రతిమ తయారీకి అయ్యే ఖర్చు 400 డాలర్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement