gold plated
-
బంగారు హెడ్‌ఫోన్స్ @ రూ. 80 లక్షలు
శాన్ఫ్రాన్సిస్కో: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తయారీ తొలి హెడ్‌ఫోన్స్‌ను మరింత విలాసవంతంగా తీర్చిదిద్దింది. రష్యన్ కంపెనీ కేవియర్. ఎయిర్‌పోడ్స్ మాక్స్‌ను స్వచ్చమైన బంగారంతో రూపొందించింది. నిజానికి ఎయిర్‌పోడ్స్ మాక్స్ ఇయర్ కప్స్‌ను యాపిల్ కంపెనీ అల్యూమినియంతో తయారు చేస్తోంది. అయితే బాగా ప్రాచుర్యం పొందిన గ్యాడ్జెట్స్‌ను లగ్జరీ ఐటమ్స్‌గా మలిచే రష్యన్ కంపెనీ కేవియర్ వీటిని ప్యూర్ గోల్డ్‌తో రూపొందించింది. అంతేకాకుండా మెష్ హెడ్‌బ్యాండ్‌ను అరుదైన క్రోకొడైల్ లెదర్‌తో అలంకరించింది. వెరసి యాపిల్ హెడ్‌ఫోన్స్ ఖరీదు 1.08 లక్షల డాలర్లుగా ప్రకటించింది. అంటే సుమారు రూ. 80 లక్షలన్నమాట! వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా(కస్టమ్ మేడ్) వీటిని పరిమితంగానే తయారు చేయనున్నట్లు కేవియర్ పేర్కొంది. కొత్త ఏడాది(2021)లో ఈ హెడ్‌ఫోన్స్ మార్కెట్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: (యాపిల్ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్) తొలి హెడ్‌ఫోన్స్ ఈ నెల మొదట్లో ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్ పేరుతో యాపిల్ తొలిసారి హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని రూ. 59,900 ధరలో ప్రవేశపెట్టింది. స్పష్టమైన శబ్దం, అడాప్టివ్ ఈక్వలైజర్, అనవసర శబ్దాలను తగ్గించే సాంకేతికలతో వీటిని రూపొందించింది. కాగా.. వీటికి మరింత ప్రీమియంను జత చేస్తూ రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్.. తాజాగా గోల్డ్ ప్లేటెడ్ కప్స్‌తో రూపొందించింది. వీటిని రెండు కలర్స్‌లో అందిస్తున్నట్లు తెలియజేసింది. నలుపు, తెలుపు రంగుల్లో లభించే ఈ హెడ్‌ఫోన్స్‌ను ప్యూర్ గోల్డ్‌తోపాటు.. హెడ్‌బ్యాండ్‌ను క్రోకొడైల్ లెదర్‌తో రూపొందించినట్లు వెల్లడించింది. రెండు రంగుల్లోనూ బంగారంతో చేసిన కప్స్, లెదర్ హెడ్‌బ్యాండ్‌లతో ఇవి లభించనున్నట్లు వివరించింది. -
గాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు
లండన్: మహాత్మాగాంధీ ధరించాడని భావిస్తున్న బంగారుపూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్ ఆక్షన్స్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్ల (రూపాయలు 2.55 కోట్లు)కు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పెట్రోలియంకు పనిచేస్తున్న సమయంలో, 1910– 1930 మధ్యకాలంలో బ్రిటన్ దేశస్తుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు. సౌత్ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే వ్యక్తి 50 ఏళ్లుగా తమ ఇంట్లో ఉన్న ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా కోరారు. 10 నుంచి 15 వేల పౌండ్లు పలుకుతాయని భావించారు. అయితే ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు వేలం పాటలో పాల్గొన్నారు. ఇంత ధర పలకడంతో వేలానికి పెట్టిన వ్యక్తి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఈ సొమ్మును కూతురుతో పంచుకుంటానని చెప్పారు. -
టన్ను బంగారంతో తళుకులు..
హనోయి : వెంటాడుతున్న మహమ్మారి.. ఆపై కఠిన ఆంక్షలు వీటన్నింటి మధ్య కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపార సంస్థలు వినూత్న పోకడలతో ముందుకొస్తున్నాయి. కస్టమర్ దేవుళ్లను ఆకట్టుకునేందుకు మరికొందరు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. సుదీర్ఘ లాక్డౌన్ అనంతరం వియత్నాం రాజధాని హనోయిలో ఓ ఫైవ్‌స్టార్ హోటల్ సకల హంగులతో పునఃప్రారంభమైంది. అతిథులు, పర్యాటకులను ఆకర్షించేందుకు డాల్స్ హనోయి గోల్డెన్ లేక్ హోటల్ నిర్వాహకులు బాత్‌టబ్‌ల నుంచి బేసిన్ల వరకూ చివరికి టాయిలెట్లనూ బంగారు పూతతో పసిడిమయం చేశారు. హోటల్లో ఎటువైపు చూసినా స్వర్ణకాంతులు మెరిసేలా ఏర్పాట్లు చేశారు. మూడు నెలల లాక్డౌన్ అనంతరం వియత్నాంలో ఇప్పుడిప్పుడే పర్యాటకుల రాక మొదలవడంతో వారిని ఆకట్టుకునేందుకు ఈ హోటల్ అదనపు హంగులతో ముందుకొచ్చింది. సోవియట్ నాటి భవనాల పక్కన హు బిన్ గ్రూపుకు చెందిన ఈ హోటల్‌ను ప్రత్యేకంగా కనిపించేలా వన్నెలద్దారు. ప్రస్తుతం ప్రపంచంలోనే ఇలాంటి హోటల్ మరెక్కడా లేదని హు బిన్ గ్రూప్ చీఫ్, హోటల్అధిపతి నుయెన్ హు దుంగ్ చెప్పారు. ఎల్లో మెటల్ పూల్ హోటల్ పైకప్పుపై 24 కేరట్ల బంగారు పూతతో స్విమ్మింగ్‌పూల్ ప్రధాన ఆకర్షణ కాగా, అతిథుల రూంలు, బాత్రూమ్ గోడలు బాత్టబ్స్కూ బంగారు పూత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. సిటీలోని ఇతర హోటల్స్ తరహాలోనే ఈ హోటల్లోనూ ఒక రాత్రికి 18,176 రూపాయలు వసూలు చేస్తారు. ఈ ఏర్పాట్లతో అతిథులు సైతం ఆశ్చర్యపోతున్నారు. లగ్జరీ అంటే ఏంటో ఈ హోటల్ తిరగరాసిందని, ఇతర లగ్జరీ హోటళ్లు సహజంగా టైల్స్‌కు మార్బుల్స్‌ను వాడుతుంటే ఈ హోటల్లో వాషింగ్ బేసిన్‌తో సహా అన్నీ బంగారుపూతతో మెరిసిపోతున్నాయని 62 ఏళ్ల ఓ అతిథి వాన్ తున్ అన్నారు. వాన్ కూడా ఓ హోటల్ అధినేత కావడం కొసమెరుపు. టన్ను బంగారంతో తళుకులు హోటల్ మొత్తం బంగారుపూత కోసం టన్ను బంగారాన్ని వాడామని హోటల్ అధిపతి హు దుంగ్ అన్నారు. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న దుంగ్ ఆపై ట్యాక్సీ డ్రైవర్‌గానూ పనిచేశారు. నిర్మాణ, రియల్ఎస్టేట్ రంగంలో భారీగా సంపాదించిన దుంగ్ ఆతిథ్య రంగంలోనూ అదృష్టం పరీక్షించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించకుంటే ఈ హోటల్ మొత్తం అంతర్జాతీయ అతిథులతో నిండిపోయేదని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : లాక్డౌన్; ఆగిన బతుకు బండి -
ఆస్కార్ చిన్నమ్మి... ఆస్కార్ పెద్దయ్య
ఆస్కార్‌లో ‘ఎక్స్’ చిత్రం కూడా ఉందా?! హిచ్‌కాక్‌కి ఎన్ని ఆస్కార్లు వచ్చాయి? ఆస్కార్‌ను అందుకో కుండానే వెళ్లి ‘పోయిన’వాళ్లెవరు? ఆస్కార్ చిన్నమ్మి ఎవరు? ఆస్కార్ పెద్దయ్య ఎవరు? ఆస్కార్ ఎత్తెంత? ఆస్కార్ వెయిటెంత? ఆస్కార్‌ను అమ్ముకోవచ్చా? నేడు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా కొన్ని ఆస్కార్ విశేషాలు. ఆస్కార్ బరువు , పరువు ఆస్కార్ ప్రతిమను డిజైన్ చేసింది ఎం.జి.ఎం. (మెట్రో గోల్డ్విన్ మేయర్) ఆర్డ్ డైరెక్టర్ సెడ్రిగ్ గిబన్స్. సినిమా రీలు మీద ఒక యుద్ధ యోధుడు ఖడ్గం పట్టుకుని నిటారుగా నిలబడినట్టుగా ఆయన డిజైన్ చేశారు. ఆస్కార్ స్టాచుయెట్ (ప్రతిమ) 34 సెంటీమీటర్ల (13.5 అంగుళాలు) పొడవు, 3.5 కేజీల బరువు ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంలో మెటల్ కొరత ఏర్పడింది. అప్పుడు మూడేళ్ల పాటు ఆస్కార్ ప్రతిమలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యాయి. ప్రారంభంలో ఆస్కార్ ప్రతిమలు బంగారు పూత పూసిన కంచు లోహంతో తయారయ్యేవి. కంచులో రాగి, తగరం మిశ్రమంగా ఉంటాయి. తర్వాత కంచు లోహానికి బదులుగా బ్రిటానియా మెటల్ని వాడడం మొదలుపెట్టారు. తగరం కలిసిన వేరే లోహం అది. ఆ లోహంతో చేసిన ప్రతిమపై మొదట రాగిపూత, దానిపైన నికెల్ పూత, దానిపైన 24 కేరెట్ల బంగారు పూత పూస్తున్నారు. 1982 నుండీ ఆస్కార్ ప్రతిమలను చికాగోలోని ఆర్ఎస్ ఓవెన్స్ అండ్ కంపెనీ తయారు చేసి ఇస్తోంది. ఆ కాంట్రాక్టును ఆ కంపెనీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది. విజేతలు తమ ఆస్కార్ ప్రతిమలను అమ్ముకోడానికి లేదని 1950లో నిబంధన విధించారు. ఎవరైనా అమ్ముకోదలిస్తే వేలంలో మొదట అవకాశం అకాడమీకే ఇవ్వాలి. అదీ 10 డాలర్లకు! అన్నట్లు ఆస్కార్ ప్రతిమ తయారీకి అయ్యే ఖర్చు 400 డాలర్లు.