- ఆదర్శంగా జిల్లాలోని రెండు సీహెచ్‌సీ, ఐదు పీహెచ్‌సీలు
- మంత్రి లక్ష్మారెడ్డికి వివరించిన కలెక్టర్
ఎంజీఎంలో త్వరలో ఆన్‌లైన్ సేవలు
Published Wed, Jul 20 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM
ఎంజీఎం : నాలుగు జిల్లాలకు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎంకు వచ్చే రోగుల వివరాలను నమోదు చేయడంతో పాటు ప్రతీ రికార్డు అందుబాటులో ఉండేలా వైద్యసేవలను కంప్యూటరీకరించేందుకు త్వరలో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామ ని కలెక్టర్ వాకాటి కరుణ మంత్రి లక్ష్మారెడ్డికి వి వరించారు.
ఎంజీఎంతో పాటు సీకేఎం ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆమె బుధవారం మంత్రి దృష్టికి తెచ్చారు. ఎంజీఎం ఆస్పత్రికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్(ఎన్‌బీఏహెచ్) ర్యాంకు సాధించేలా సేవలు మెరుగుపర్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. 1200 పడకల ఆస్పత్రిలో మెకానిజం లాండ్రీ లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎంజీఎంకు వచ్చే రోగుల సంఖ్య ను తగ్గించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రిలయన్స్ పౌండేషన్ ప్రతినిధుల సహాయం తో జిల్లాలో రెండు సీహెచ్‌సీలు, ఐదు పీహెచ్‌సీలను మోడల్ ఆస్పత్రులుగా తీర్చిదిద్దేలా ప్ర ణాళిక సిద్ధం చేశామని వివరించారు. అక్కడి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చామన్నారు.
104లో జీపీఆర్‌ఎస్ సిస్టమ్..
జిల్లాలో 104 వాహనాల పరిస్థితి అధ్వానంగా మారిందని, ఈ వాహనాలను సక్రమంగా విని యోగించుకుంటే గ్రామాల్లో పేదలకు మెరుగైన సేవలందించవచ్చని కలెక్టర్ మంత్రికి వివరించారు. 104ల్లో జీపీఆర్‌ఎస్ సిస్టమ్‌ను అందుబాటులో తెస్తే.. అవి రోజూ ఏయే గ్రా మాల్లో సేవలందిస్తున్నాయో తెలుసుకోవచ్చ న్నారు. సీకేఎం ఆస్పత్రిలో అదనపు భవన ని ర్మాణం అవసరమని, అక్కడ సిబ్బంది పోస్టు లు భర్తీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ఎంజీఎం, సీకేఎంల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంజీఎం పిడియాట్రిక్ విభాగంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంతో పాటు నూతనంగా నిర్మిస్తున్న మాతశిశు కేంద్ర భవనాన్ని మంత్రి పరి శీలించారు. పలువురు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి చికిత్స ఎలా అందుతుందో ఆరా తీశారు. కార్యక్రమంలో వీసీ కరుణాకర్‌రెడ్డి, సీకేఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
Advertisement
Advertisement